Sunday, September 5, 2010

మరో చరిత్ర సృష్టించనున్న మోజర్‌ బేయర్‌

deepak-puri‘మోజర్‌బేయర్‌’ అనే వినూత్నమైన ‘స్విస్‌’ పేరును కంపెనీ పేరుగా నామకరణం చేయడం ప్రమోటర్ల విభిన్నమైన ఆలోచనా విధానానికి ఓ ధర్పణం. 1983 లో ఢిల్లీలో టైం రికార్డర్లను తయారుచేయడానికి ప్రారంభించబడ్డ కంపెనీ విభిన్నంగా ఆలోచించి తన పంథాను మార్చుకొని 1988 నాటికల్లా కంప్యూటర్‌ ప్లాపీ డిస్క్‌లను తయారుచేయడానికి ఉపక్రమించింది. 1999 లో మరల విభిన్నంగా ఆలోచించి సీడి లను, డీవిడీ లను తయారుచేసి ఆప్టికల్‌ స్టోరేజ్‌ డివైసెస్‌లో ప్రపంచంలో రెండవ స్థానానికి ఎగబాకింది.

కాలానుగుణంగా వచ్చిన మార్పులను ఆకలింపచేసుకొని గృహోపకరణాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలక్ట్రానిక్స్‌ సినిమా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్‌ సినిమా ప్రసార హక్కులతో పాటు అత్యంత వినూత్నంగా సాంప్రదాయ వ్యాపార ధోరణిని అనుసరించని ఈ కంపెనీ సాంప్ర దాయేతర ఇంధన వనరుల్లో సన్‌రైజ్‌ ఇండస్ట్రీ అయిన సౌరశక్తి రంగంలోకి 2005 లో ప్రవేశిం చింది. సౌర శక్తి రంగంలో కంపెనీ ప్రస్థానమే షేర్‌హోల్డర్లకు అందనున్న శక్తి. టెలికం రంగంలో ఎయిర్‌టెల్‌ మాదిరిగా, డైరెక్ట్‌ టు హోమ్‌ లో డిష్‌ టీవి లాగా, పవన విద్యుత్‌ రంగంలో సుజ్లాన్‌లాగా, సోలార్‌ పవర్‌ రంగంలో మోజర్‌బేయర్‌ మరో చరిత్ర సృష్టించబోతుంది. సాంప్రదాయేతర సోలార్‌ ఇం‘ధనమే’ మోజర్‌ బేయర్‌ షేర్‌ హోల్డర్లకు ‘ధనం’.

విస్తరణ - అభివృద్ధి
ఆప్టికల్‌ డిస్క్‌లైన సీడీలు, డీవిడీలు, బ్లూరే డిస్క్‌లను అమెరికా, ఐరోపాతో పాటు 80 పైగా దేశాలతో మార్కెట్‌ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆప్టికల్‌ స్టోరేజ్‌ డివైజెస్‌లో 2 వ స్థానాన్ని ఆక్రమించింది. హెడ్‌ ఫోన్‌ మార్కెట్స్‌లో 14 రకాల మార్కెట్స్‌ను ప్రవే శపెట్టింది. అతి తక్కువ ధరకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా సూపర్‌ డీవిడీలను మార్కె ట్లోకి ప్రవేశపెట్టింది. యు టీవి మోషన్‌ పిక్చర్స్‌కు చెందిన హోమ్‌ వీడియో బిజినెస్‌ను కైవసం చేసుకుంది.

శౌర్య హింది సినిమాను మరియు ప్రాంతీయ భాషా చిత్రాలైన రమన్‌ తేడియా సీతై, పూ, అభయం నానును నిర్మించి విడు దల చేసింది. హిందీ చిత్రాలైన మాన్‌ గయే మోఘల్‌ ఈ ఆజామ్‌ మరియు ఆంగ్ల చిత్రాలైన రైటియస్‌ స్కిల్‌ మరియు టెన్‌ కమాండ్‌మెంట్స్‌ను చిత్రాలను దేశవ్యాప్తంగా విడుదల చేసింది. జపాన్‌ మినహా బ్లూ రే టెక్నాల జీని అభివృద్ధి పరిచిన ఏకైక కంపెనీ మోజర్‌బేయర్‌ మాత్రమే.

భారత చిత్ర పరిశ్రమ వార్షికంగా 9% పైగా క్యుము లేటివ్‌ అభివృద్ధిని నమోదు చేస్తూ 2013 సంవత్సరానికి రూ.168 బిలియన్‌ పరిశ్రమగా వృద్ధి చెంద నుండడంతో కంపెనీ ముందు అపారమైన సినిమా ప్రసార అవకాశాలను ముందుంచుతు న్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వం ఇవ్వబోతున్న ప్రోత్సాహాలే కాకుండా అమెరికా, జర్మనీ దేశాల్లో ఉన్న గిరాకీ సోలార్‌ రంగంపై ఆకర్షణను పెంచుతుంది. పర్యావరణ కాలుష్యం పాళ్లు తగ్గించే వీలు ఉండడమే కొత్త పునర్‌ వినియోగ ఇంధన వనరుల లోని ప్రత్యేకత. ఐరోపాలో హరిత ఉద్యమం వేళ్లూనుకున్నందు వలన సౌర విద్యుత్‌ వల్ల కలిగే మేలు, ప్రాముఖ్యతను అక్కడి ప్రభుత్వాలు గుర్తించడంతో భవిష్యత్‌ అంతా సౌర శక్తిదే అనడంలో అతిశయోక్తి లేదు.

ఆర్థిక ఫలితాలు
ఆర్థిక మాంద్యం నుంచి బయటపడ్డ మోజర్‌బేయర్‌ 2009 ఆర్థిక సంవత్సరం కన్నా, 2010 ఆర్థిక సంవ త్సరంలో గణనీయమైన మార్పులు సాధించింది. వడ్డీ చెల్లింపులను రూ.205 కోట్ల నుండి రూ.186 కోట్లకు తగ్గించుకోగలిగింది. నికర నష్టాన్ని రూ.150 కోట్ల నుంచి రూ.36 కోట్ల వరకు గణనీయంగా తగ్గించుకోగ లిగింది. 2010-11 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిర్వహణ పరంగా 44 కోట్లకు పైగా లాభాలు ఆర్జిం చినప్పటికి తరుగుదల మూలంగా నష్టాలను నమోదు చేయవలసి వచ్చింది. జవహర్‌లాల్‌ నెహ్రు నేషనల్‌ సోలార్‌ పథకం అందించిన ఉత్సాహంతో రాబోయే త్రైమాసికాల్లో కంపెనీ పన్ను తర్వాత నికర లాభాన్ని ఆర్జించనుందనే ఆశావాద దృక్పధంతో 2009-10 ఆర్థిక సంవత్సరానికి 6% డివిడెండ్‌ను ప్రకటించింది.

మోజర్‌ బేయర్‌ షేర్‌ ఎందుకు కొనాలి...
రవి కిరణ శక్తిని సంగ్రహించి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉపయోగించుకుంటున్న, అభివృద్ధి చెందిన దేశాలు జర్మనీ. అమెరికా లను ఆదర్శంగా తీసుకొని భారత ప్రభుత్వం పర్యావరణ హిత సౌరశక్తి రంగాన్ని అభివృద్ధి పరచడానికి సహాయ సహకారాలు అందించడానికి జూన్‌ 2010 లో జవహర్‌ లాల్‌ నెహ్రు జాతీయ సోలార్‌ మిషన్‌ పథకం క్రింద విధి విధానాలను ప్రకటించింది. ఈ విధాన నిర్ణయ ప్రకటన అనంతరం ఒక్క సారిగా ఊపందుకున్న సౌరశక్తి రంగం అదే రంగంలో 2005 సంవత్సరంలో ప్రవేశించిన మోజర్‌బేయర్‌కు అపరిమితమైన, అనూహ్యమైన, అసాధారణమైన, అవకాశాలను, లాభాలను, అభివృద్ధిని అందించబోతున్నాయి.

అనుబంధ సంస్థలు:మోజర్‌బేయర్‌ తన అను బంధ సంస్థలైన మోజర్‌బేయర్‌ ఫోటోవాల్టిక్‌ లిమిటెడ్‌ (ఖఔఆఙ) మరియు పివీ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్ల (ఆఙఊఉ) ద్వారా సోలార్‌ పవర్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. 2005 -2007 మధ్య కాలంలో ప్రారంభించబడ్డ ఈ సంస్థలు సోలార్‌ సెల్స్‌, సోలార్‌ మాడ్యుల్స్‌, క్రిస్టలీన్‌ సిలికాన్‌ మాడ్యుల్స్‌, ఎమార్ఫస్‌ సిలికాన్‌ మాడ్యుల్స్‌ (థిన్‌ ఫిల్మ్‌) ను గ్రిడ్‌కు అనుసంధానించడానికి అనుగుణంగా మరియు గ్రిడ్‌ రహితంగా ప్రపంచ ప్రమాణాలకు అనుసరించి విభిన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి చేస్తున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రు - జాతీయ సోలార్‌ పథకం: మొదటి దశ 2013 కల్లా 1100 మెగావాట్లు, రెండవ దశ 2017 కల్లా 4,000 మెగావాట్లు, మూడవ దశ 2022 కల్లా 20,000 మెగావాట్లకు సాంప్రదాయేతర సౌర శక్తిని ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వ సంకల్పం. సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి ఒక్కొక్క మెగావాటుకు రూ.15 కోట్ల నుంచి రూ.17 కోట్ల వరకు ప్రాజెక్ట్‌ వ్యయం అవుతుంది.

ఈ విధంగా రూ.3,40,000 కోట్ల నిధులు సౌరశక్తి రంగానికి తరలనున్నాయి. ఇందులో దాదాపుగా 75% సౌర విద్యుత్‌ ఉత్పత్తి పరికరాలకే అంటే రూ.2,50,000 కోట్లు వెచ్చించవలసి యుంటుంది. ఈ రూ. 2,50,000 కోట్లే మోజర్‌బేయర్‌కు ఉన్న మార్కెట్‌ విసృ్తతి. ఈ రంగంలో ప్రముఖ మైన కంపెనీలు మోజర్‌బేయర్‌ లిమిటెడ్‌ మరియు టాటా బిపీ సోలార్‌ లిమిటెడ్‌. ఈ సన్‌రైజ్‌ ఇండస్ట్రీ సోలార్‌ రంగంలో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయిన కంపెనీ మోజ ర్‌బేయర్‌ కావడంతో షేర్‌ హోల్డర్లకు అనూ హ్యమైన లాభాలు సమకూరనున్నాయి.

మోజర్‌బేయర్‌ సామర్థ్యం: ప్రస్తుతం మోజర్‌బేయర్‌ 90 మెగావాట్ల క్రిస్టలిన్‌ సిలికాన్‌ సెల్స్‌, 100 మెగావాట్ల క్రిస్టలిన్‌ సిలికాన్‌ మాడ్యుల్స్‌ మరియు 50 మెగావాట్ల అమార్ఫస్‌ సిలికాన్‌ (థిన్‌ ఫిల్మ్‌) మాడ్యుల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 5 స్టార్‌ రేటింగ్‌ నాణ్యతా ప్రమాణాలతో సోలార్‌ సెల్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ మోజర్‌బేయర్‌ ఫోటోవాల్టిక్‌ లిమిటెడ్‌ (ఎమ్‌బిపివి లిమి టెడ్‌) మాత్రమే.

మోజర్‌బేయర్‌ ఇపిసి: ఇప్పటికే ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రాతిపదికన మోజర్‌బేయర్‌ 50 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఖాతాదారుల తరుపున ఇండియా, జర్మనీలో ఏర్పాటు చేయడా నికి అవగాహన ఒప్పందాలను కుదర్చు కున్నది. 2012 సంవత్సరాంతానికి 200 మెగావాట్ల సామర్థ్యాన్ని ఖాతాదారుల తరుపున ఏర్పాటు చేయనుంది. ఈ ఇపిసి ద్వారా రూ.3,400 కోట్ల టర్నోవ ర్‌ను సాధించనుంది. జవహర్‌లాల్‌ నెహ్రు నేషనల్‌ సోలార్‌ మిషన్‌ పథకంతో 2013 సంవత్సరం నాటికి దేశంలో ఏర్పాటు చేయనున్న ఒక గిగావాట్‌ (వెయ్యి మెగా వాట్లు) సామర్థ్యంలో మోజర్‌బేయర్‌ 40% వాటాను కైవసం చేసుకోనుంది. అంటే దాదాపుగా 1 బిలి యన్‌ డాలర్ల టర్నోవర్‌ను ఈ ఒక్క విభాగాన్ని నుంచే రాబోయే 2 సంవత్స రాల్లోనే అందుకోనుంది. పథకం క్రింద దాదాపు 350 కంపెనీలకు పైగా సోలార్‌ పవర్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసు కున్నప్పటికి ఈ కంపెనీలన్నీ మోజర్‌బేయర్‌ నుంచే సోలార్‌ పల కాలను కొనుగోలు చేయవలసి యుంటుంది.

మహారాష్ట్ర ప్లాంటు:మహారాష్టల్రోని చంద్రపూర్‌ ప్రాంతంలో గ్రిడ్‌ అనుసంధానిత 1 మెగావాట్‌ థిన్‌ ఫిల్మ్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం తరుపున స్థాపించింది.

తమిళనాడు ప్లాంటు :తమిళనాడులోని శివగంగా జిల్లాలో తన అనుబంధ సంస్థ సఫైర్‌ ఇండస్ట్రీ ద్వారా ఫోటోవాల్టిక్‌ ఆధారిత 5 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని 90 కోట్ల వ్యయంతో ప్రారంభించనుంది. అదే విధంగా చెన్నై శివార్లలో ఫోటోవాల్టిక్‌ మాడ్యుల్స్‌ను తయారుచేయడానికి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

రాజస్థాన్‌ ప్లాంటు :రాజస్థాన్‌లో రూ.100 కోట్ల ప్రాజెక్ట్‌ వ్యయంతో 5 మెగావాట్ల గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది.

గుజరాత్‌ ప్లాంటు :భారతదేశంలో అతి పెద్ద గ్రిడ్‌ అనుసంధానిత 45 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును గుజరాత్‌లో స్థాపించడానికి, గుజరాత్‌ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ ప్రాజెక్టుకు కావలసిన నిధుల సమీకరణ కూడా పూర్తి కావచ్చింది.

జర్మనీ ప్లాంటు :జర్మనీలోని నార్డెన్‌ డార్ఫ్‌ ప్రాంతంలో 7.4 మెగావాట్ల సోలార్‌ ఫాంను నిర్మించి నిర్వహిస్తుంది.

విద్యుదుత్పత్తి :2016 సంవత్సరం కల్లా 5,000 మెగావాట్లను, 30,000 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధపరిచింది. ఇందులో 4,000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌, 500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ మరియు 500 మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. 4,000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ లో మధ్యప్రదేశ్‌లోని అణుపూర్‌లో 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఆర్థిక నిధుల సమీకరణను పూర్తి చేసింది.

బ్లాక్‌ స్టోన్‌ పెట్టుబడి: అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ బ్లాక్‌ స్టోన్‌ మోజర్‌బేర్‌ ప్రాజెక్ట్స్‌లో మైనార్టీ వాటాను రూ.1,350 కోట్లతో కైవసం చేసుకుంది. ఈ నిధులను పవర్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి మరియు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ లలో బొగ్గు ఆధారిత కొత్త పవర్‌ ప్రాజెక్టులను నిర్మించడానికి వినియోగించనుంది.

దిగుమతులపై ఆంక్షలు:2013 సంవత్సరం నుండి ఇతర దేశాల నుండి చవకైన సోలార్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోవడం నిషేదించబడడంతో దేశీయ సంస్థలైన మోజర్‌బేయర్‌కు లాభం చేకూరనుంది.

ముగింపు: ఆప్టికల్‌ స్టోరేజ్‌ డిస్క్‌ ల తయా రీలో అగ్రగామి సంస్థ అయిన మోజర్‌బేర్‌ వివిధ భాషల్లో 10,000 లకు పైగా సినిమా ప్రసార హక్కులను కలిగి ఉండి ఇంటర్‌ నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ప్రసిద్ధి కెక్కింది. అనేక సినిమాలను నిర్మించ డమే కాకుండా దేశవ్యాప్తంగా పంపిణీ చేసింది. వైవిధ్య భరితంగా, వినూత్నంగా కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంపెనీ మోజర్‌బేర్‌ బ్రాండ్‌తో టీవీలు, డీవిడిలు, సీడిలు, ప్లాష్‌ డ్రైవ్‌లను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. బ్లూ రే డిస్క్‌ అమ్మకాలను 10 రెట్లుగా పెంచుకోగలిగింది. ప్లాష్‌ మీడియా మార్కెట్లో స్లిమెస్ట్‌ ఎస్‌డిని ప్రవేశపెట్టిన మోజర్‌బేయర్‌ 20% మార్కెట్‌ వాటాను కైవసం చేసుకోనుంది.

కంపెనీ ఉత్పత్తుల తయారీకి కావలసిన ఇంధనాన్ని న్యాచు రల్‌ గ్యాస్‌కు మార్చడంతో కార్బన్‌ క్రెడిట్స్‌తో పాటు వార్షికంగా రూ.70 కోట్లు ఆదా చేయబోతుంది. 200 కెడబ్ల్యుపి రూఫ్‌టాప్‌ సోలార్‌ ఫోటోవాల్టిక్‌ పవర్‌ జనరేషన్‌ ప్రాజెక్టులను ఒమ్యాక్స్‌ ఆటో లిమిటెడ్‌కు నిర్మించింది. సోలార్‌ పవర్‌లోకి అందరి కన్నా ముందుగా ప్రవేశించిన ఈ కంపెనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలక్ట్రానిక్స్‌, కన్జూ మర్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ పెరిపెర ల్స్‌తో పాటు విద్యుచక్తి రంగంలో నిరం తరంగా ముందుకు దూసుకుపోతుంది. ధీర్ఘకాలిక మదుపుదారులకు ఆకాశమే హద్దు, అవకాశం వదలొద్దు.
డివిడెండ్‌
సం డివిడెండ్‌ డివిడెండ్‌ 
2009-10 0.60 6 
2008-09 0.60 6
2007-08 1.00 10
2006-07 1.50 15
2005-06 1.00 10 

No comments: