గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ సెల్ఫ్ డెవలప్‌మెంట్‌ని బాగా వెలుగులోని తెచ్చిన వ్యక్తి. చాలా మంది గొప్పవారు కూడా వీటికి సంబంధించి ఎన్నో గొప్ప రచనలు కూడా చేశారు. వారిలో ప్రసిద్ధ సైకాలజిస్ట్‌స ఆల్‌ఫ్రెడ్ ఆడ్లర్, కార్ల్‌యంగ్ సైకాలజీకి, స్వయం అభివృద్ధికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. స్వయం అభివృద్ధికి పాటుపడే ముందు వాటికి కావలసిన విషయాలను కూలంకషంగా పరీక్షించుకోవల్సిన అవసరం ఎంతెైనా ఉంది అంటున్నారు.
స్వయం పరిజ్ఞానం.. అంటే మీరేమిటి అన్నది.. మీ ఫీలింగ్స్, ఆలోచనలు, దౌర్బల్యాలు, బలాలు, అన్నీ ఇందులోకి వస్తాయి. రూపురేఖల్ని ప్లాస్టిక్ సర్జరీ సహకారం లేకుండా ఎంత మాత్రం మార్చలేరుగానీ, ప్రవర్తనని మార్చుకోవడం ద్వారా పబ్లిక్ సోషల్ ఇమేజ్‌ని మార్చుకోగలరు. బాగా ఏమేమి చెయ్యగలరు? ఎన్ని స్కిల్స్ వచ్చు? పదిమందితో ఈజీగా మనగలిగితే మార్కెటింగ్, మంచి బుద్ధికుశలత వాక్చాతుర్యం ఉంటే లాయర్లు, ట్రైనర్స్, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ లాంటి ఫెైనార్ట్‌స బాగా వచ్చే వారెైతే ఒక డిజెైనర్ స్టోర్ బొటీక్ లేదా ట్రైనింగ్ సెంటర్ ఇలా ఆలోచిస్తూ పోతే మీ టాలెంట్‌కి తగ ్గప్రొఫెషన్‌ని ఎంచుకోగల్గుతారు. అలా మీరు ఏమేం చెయ్యగలరు? మీ సామర్థ్యం ఏ లెవల్లో ఉంది? అన్నవి తరచి చూసుకుంటే, ఈ పెైన ఇంేమేమి నేర్చుకోవాలో అర్థమవుతుంది. దానికి తగ్గ కోర్స్‌లు చేయవచ్చు. ట్రైనింగ్ తీసుకోవచ్చు. చదువు వల్ల, అనుభవజ్ఞానం వల్ల వచ్చిన విజ్ఞానాన్ని సానపట్టేవి సాఫ్ట్ స్కిల్స్, తద్వారా మన పర్సనాలిటీని వెలికి తెచ్చి చూపించే ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌కి మరింత పదునుపెట్టి, జీవితంలో అంచెలంచెలుగా పెైకెడుతూ, దినదిన ప్రవర్థమానమవ్వడానికి చేసే ప్రయత్నాన్నే స్వయం అభివృద్ధి అంటారు. తద్వారా విద్యా, ధన సంపదలు అభివృద్ధి చెందడమేకాదు, మన ఆశయాలని, కలలని నిజం చేసుకోగల సమర్థత, చాకచక్యం వస్తాయి. ఆత్మవిశ్వాసం విజయాలకి దారి తీస్తుంది. అందువల్ల దాన్ని పొందించుకోవాల్సిన ఆవశ్యకత వుంది. సాఫ్ట్ స్కిల్స్ అన్నీ ఒకే దండలోని పూవుల్లా అమరి వుంటాయి. ఒకదానితో మరొకటి అనుసంధానం అయి వుంటాయి. కాబట్టి ఒకదాన్ని నేర్చుకోవాలంటే మరొకటి తప్పకుండా నేర్చుకోవాలి.
ఆత్మవిశ్వాసం..
ఆత్మ గౌరవం ఎంత అవసరమో, ఎలా వాటని పెంపొందించుకోవాలో తద్వారా ఎలా ఆత్మవిశ్వాసం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆత్మవిశ్వాసం వల్ల సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకునే స్థైర్యం వస్తుంది. విజయాన్ని ఎదురుచూసేలా చేస్తుంది. చెయ్యలేనేమో, నష్టపోతానేమో లాంటి భయాల్ని దరిదాపుల్లోకి రానివ్వదు. పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుని వాటికి తగ్గ నిర్ణయాలు తీసుకునే ధెైర్యాన్ని ఇస్తుంది. ఓడిపోయినా, నష్టపోయినా భీరువుని చెయ్యదు. పడ్డా మళ్లీ లేచేందుకు చేయూతనిస్తుంది. ఓటమివల్ల వచ్చే బాధనీ దు:ఖాన్నీ వాటిల్లోంచి జనింగచే భయాన్నీ ఇమోషన్స్‌నీ తట్టుకునే శక్తినిస్తుంది.
సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్...
ఎవరికి వాళ్ల మనోవికాసానికి దోహదపడేలా తమని తాము పరీక్షించి చూసుకుని, బాధ్యత వహించడం. ఏం చేయాలంటే అనుక్షణం తమని తాము నిన్నటి కంటే ఈ రోజుకి ఎంత ఇంప్రూవ్ అయ్యాను కొత్తవి ఏం నేర్చుకున్నాను? వీటి వల్ల ఉద్యోగవకాశాలు ఎంత వరకు మెరుగు పరుచుకున్నాను? ఎంత అర్హత వచ్చింది? అని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటి రోజుల్లో నల్గురితో ఏం మాట్లాడాలో తెలియక తికమకపడి టెన్షన్‌లో ఏదేదో వాగి ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టుకునే వాళ్లే కోకొల్లలు. ఈ కోవలోకొచ్చేవారికి సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌గా వాక్చాతుర్యం ఆచితూచి సందర్భోచితంగా మాట్లాడటం మొట్టమొదటి ఛాలెంజ్ అవుతుంది.
అన్నిటినీ అధిగమించాలంటే..
అభివృద్ధి చెందాంటే అది నూటికి నూరు శాతం ఎవరికి వారిదే బాధ్యత. దీని కోసం ఎవ్వరూ దీనికి ఏమీ చెయ్యలేరు. గడిచిపోయిన కాలం గురించి వగస్తూ కూర్చుంటే వున్న కాలం కూడా వృథా అయిపోతుంది.
సమస్యలు వస్తే చిరాకు పడటం, హడలి పోవడం రెండూ వద్దు. వాటిని సొల్యూషన్ వెతకడం ద్వారా సానబట్టిన వజ్రంలా మీరు తయారవ్వడం మొదలవుతుంది. కష్టాలకు ఎదురీదడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక్కొక్క భయాన్నీ, సందేహాన్నీ జయిస్తున్నప్పుడల్లా మీ భుజం మీరు తట్టుకుని ప్రోత్సహించుకోవాలి. స్ఫూర్తి, ఉత్సాహం రెట్టింపవుతాయి. ఏదెైనా చేయడం కష్టం అనిపించినప్పుడు చాలా మంది వదిలేస్తారు.
అది పలాయనవాదం పఠించేవారికి, లూజర్సకి, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు చేసే పని కాదు. కొత్తగా ఏమి నేర్చుకున్నా కూడా దాన్ని గుర్తించి, గ్రహించి అర్థం చేసుకుని వ్యక్తీకరించుకుని, ఒక కొత్త ముఖ్యమూన పాఠ్యాంశంగా బురల్రో ముద్రవేసి, జ్ఞాపకంలో ఉంచుకుని, అవసరం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. పరిజ్ఞానంలో, బిహేవియర్‌లో మీ కన్నా ఒక మెట్టు పెైన ఉన్నవారితో సమయాన్ని వెచ్చించాలి. వారి నుండి తెలుసుకోవాల్సిన విషయాలను గుర్తించాలి. అవసరమైన వాటిని నేర్చుకోవాలి. మంచి సాహిత్యం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వ్యక్తిత్వానికి సానబెడుతుంది. అందులోనూ ఇంగ్లీష్‌లో చదివితే మరీ మంచిది. వీటివల్ల ఒకాబ్యులరీ పెరగడమే కాకుండా, ఇంగ్లీషు భాష బాగా ఇంప్రూవ్ అవుతుంది. బద్ధశత్రువులు అయిన వాళ్లు కూడా మిత్రులవుతారు. బాబోయ్ అనుకున్న కష్టాలు కూడా వెనక్కి వెళతాయి.. వీటన్నిటికీ ఆత్మవిశ్వాసం.. నమ్మకం.. ముఖ్యం.
No comments:
Post a Comment