Sunday, September 5, 2010

బిజినెస్‌ ‘ప్రభు’ ‘తులసీ సీడ్స్‌ అధినేత తులసీ రామచంద్ర ప్రభు ‘టర్నింగ్‌పాయింట్‌’

ఒకనాడు పదహారు రూపాయల పరీక్షఫీజు కట్టలేని యువకుడు నేడు 13 పరిశ్రమలను స్థాపించి, మూడు వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన కంపెనీల అధినేతగా ప్రసిద్ధికెక్కారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం అష్టకష్టాలు పడ్డ ఆ యువకుడు నేడు రెండువేల మందికి ఉద్యోగ ప్రదాతగా ఆవిర్భవించారు. ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకొని ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టేందుకు రెండేళ్ళపాటు కాళ్ళు అరిగేలా తిరిగిన నిరుద్యోగి ఇప్పుడు ఏకంగా 13 కంపెనీలకు అధినేతగా మారాడు. ఆ వ్యాపార దిగ్గజం పేరే తులసీ సీడ్స్‌ అధినేత తులసీ రామచంద్ర ప్రభు. చిన్న మధ్య తరహా పరిశ్రమల విభాగంలో ఇటీవలే ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డునందుకున్న ఆయన వ్యాపార ప్రస్థానం ఈ  ‘టర్నింగ్‌పాయింట్‌’


tualasi-rama1977 లో ‘కోస్టల్‌ ప్యాకేజింగ్స్‌’ పేరుతో అట్టపెట్టల కంపెనీని ప్రభు ప్రారంభించారు.అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార విస్తరణలో భాగంగా 1980లో చంద్రా ట్రాన్స్‌పోర్ట్‌, వంశీ ట్రేడ్‌లింక్స్‌ సంస్థలను స్థాపించారు. 1986లో అత్యాధునిక యంత్రాలలో చైతన్యా ప్యాకేజింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మరో ప్యాకేజింగ్‌ కంపెనీని స్థాపించారు. క్రమంగా తులసి సీడ్స్‌, తులసీ రామ్‌ చిట్స్‌, తులసీ ఫైలింగ్‌ సిస్టమ్స్‌, తులసీ డిజిటల్‌ స్టుడియోలను, హైదరాబాద్‌లో తులసీ టెక్నోసాఫ్ట్‌ కంపెనీని స్థాపించి ఎందరో మధ్యతరగతి యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కలుగచేశారు. తులసీ గ్రూపు సంస్థల్లో సుమారు వెయ్యి మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, నాలుగు వందల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు.తులసీ గ్రూపు సంస్థలలో పెద్దదైన కోస్టల్‌ ప్యాకేజింగ్స్‌, చైతన్యా ప్యాకేజింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తులసీ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు క్వాలిటీ మేనేజ్‌మెంటుకు ఐఎస్‌ఓ 9001 : 2000 ప్రామాణిక పత్రం లభించింది.

కుటుంబనేపథ్యం...
రామచంద్ర ప్రభు సతీమణి పేరు అరుణ. ఆమె ఇంటి విషయాలలోనే కాక గ్రూపు సంస్థల నిర్వహణా వ్యవహారాలలో కూడా ఆయనకు చేదోడువాదోడుగా అన్ని విధాల సహకరిస్తున్నారు. వీరికి యోగీష్‌ చంద్ర, కృష్ణచైతన్య అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు యోగీష్‌ చంద్ర తులసీ గ్రూపు సంస్థలకు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కాగా, రెండవ కుమారుడు కృష్ణచైతన్య అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తూ, హైదరాబాద్‌లో తులసీ గ్రూపు సంస్థలైన తులసీ టెక్నో సాఫ్ట్‌, ఇంటెక్‌ సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ కంపెనీలకు సాంకేతిక సలహాదారుగా ఉన్నారు.

తులసీ సీడ్స్‌ ప్రత్యేకతలు...
Tulasi-Family ప్రత్తి రైతుల ఆత్మహత్యలకు స్పందించి రైతు శ్రేయస్సే పరమావధిగా భావించి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించటానికే తులసీ ీీసీడ్స్‌ స్థాపించామని రామచంద్ర ప్రభు చెబుతుంటారు. భారతదేశంలోనే ఎంతో నాణ్యమైన బీటీ కాటన్‌ హైబ్రిడ్‌ విత్తనాలను దేశంలోని ప్రత్తి పండించే అన్ని రాష్ట్రాలకు అందజేసింది తులసీ సీడ్స్‌. విత్తనాల తయారీతో పాటు తులసీ ట్రస్ట్‌ ద్వారా సేంద్రీయ ఎరువులతో సేద్యాన్ని అభివృద్ధిపరిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. వర్మీ కంపోస్ట్‌ (వాన పాముల ద్వారా ఎరువు) తయారీ ఇందులో ఒక భాగం. హిందూ సంస్కృతిలో ముఖ్యమైన గోసంరక్షణ సిద్ధాంతానికి అనుకూలంగా ఆవుల పెంపకాన్ని ఆచరణలో పెట్టటం తులసీ గ్రూప్‌ ప్రత్యేకత.

చైతన్యా ప్యాకేజింగ్స్‌...
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజింగ్స్‌ సంస్థ చైతన్యా ప్యాకేజింగ్స్‌. తైవాన్‌ దేశం నుండి సుమారు పది కోట్ల విలువైన ఆటోమాటిక్‌ యంత్రాలను దిగుమతి చేసుకొని సాంకేతికపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన అగ్గిపెట్టెలు తయారుచేసి బంగ్లాదేశ్‌, దుబాయ్‌, ఫిలిఫె్ఫైన్స్‌, జింబాబ్వే దేశాలకు ఎగుమతి చేస్తోంది. గుంటూరు జిల్లాలో ఉన్న పొగాకు ఎగుమతి చేసే సంస్థలన్నీ చైతన్య ప్యాకేజింగ్స్‌ వారి సి-48 బ్రాండ్‌ ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ అట్టపెట్టెలను మాత్రమే వినియోగిస్తాయంటే అతిశయోక్తి కాదు.

ఉత్తమ సేవలకు అత్యుత్తమ గుర్తింపు...
tualasi-ramachandrఅత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో ప్రతిభ కలిగిన శాస్తవ్రేత్తల పర్యవేక్షణలో ెహబ్రీడ్‌ విత్తనాలు అందిస్తున్న తులసి సీడ్స్‌ పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం అవార్డు లభించింది. కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలమంత్రిత్వశాఖ వారు 2009 సంవత్సరానికి ఆర్‌ అండ్‌ డి విభాగానికి ప్రకటించిన అవార్డులలో మొదటిస్థానం తులసి సీడ్స్‌ కైవసం చేసుకుంది. ఈ అవార్డును ఆగస్ట్‌ 31వ తేదీన ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రామచంద్రప్రభు రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా అవార్డునందుకున్నారు.అంతేకాకుండా 1992 లో తులసి సీడ్స్‌ సంస్థను నెలకొల్పి 10 ఏళ్ళ స్వల్పవ్యవధిలోనే కేంద్ర చిన్నతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ నుండి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డును గెలుచుకున్నాడు.

అప్పటి రాష్టప్రతి అబ్దుల్‌ కలాం చేతులమీదుగా పురస్కారం అందుకోవడం విశేషం. అప్పట్లో బిటిపత్తి విత్తనాలు ఉత్పత్తి చేయడానికి జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ ఎస్సెస్‌మెంట్‌ కౌన్సిల్‌ (జిఇఎసి) అనుమతి తులసీ సీడ్స్‌ సంస్థకు లభించింది. శ్రీతులసి, నమస్కార్‌ అన్న రెండు బిటి తరహా విత్తనాలు మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమ్మకాలు జరిపారు.మార్కెట్‌లో కొత్త తరహా విత్తనాలను ప్రవేశపెట్టడం కోసం మోన్‌సాంటోనుంచి బిటి జీన్‌ టెక్నాలజీని స్వీకరించిన అనేక భారతీయ కంపెనీల్లో తులసీ సీడ్స్‌ ఒకటి. ఈ కంపెనీ రు.2 కోట్లు వెచ్చించి గుంటూరు సమీపాన అప్పట్లో బయోటెక్‌ కేంద్రాన్ని కూడా నెలకొల్పడం విశేషం.

ప్రభు ప్రస్థానం...
పేరు : తులసి రామచంద్ర ప్రభు
తల్లిదండ్రులు: వెంకాయమ్మ, పేరయ్య 
పుట్టిన తేది : జూన్‌ 21, 1947 
చదువు : బి.టెక్‌ (మెకానికల్‌ ఇంజరింగ్‌ - ఐఐటీ, మద్రాసు)
తొలి బిజినెస్‌: ‘కోస్టల్‌ ప్యాకేజింగ్స్‌ కంపెని
ప్రస్తుత హోదా: చైర్మన్‌, తులసి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌
భార్య : శ్రీమతి అరుణ,
పిల్లలు : యోగీష్‌ చంద్ర (తులసీ గ్రూప్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌),
          కృష్ణచైతన్య (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)


అవార్డులు :
  • 1994లో ‘బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌’ అవార్డు.
  • ఏపిఎస్‌ఎఫ్‌సి నుంచి ‘పారిశ్రామిక విజేత’ అవార్డు (2001),
    ‘బెస్ట్‌ క్వాలిటీ ప్రోడక్ట్‌‌స’
  • జాతీయ అవార్డు (2003)
  • బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు (2007)
  • కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల నుండి
    ఆర్‌ అండ్‌ డి విభాగంలో మొదటి స్థానం (2009)

No comments: