(అమెరికాలో ఉంటున్న ఇందు వినాయక చవితి జరుపుకునేందుకు చాలా కష్టాలు పడిందట. అవేంటో తన బ్లాగ్‌లో రాసుకుంది మీరూ చదవండి) చిన్నప్పటి నుంచి మేం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకునేవాళ్లం. అటువంటిది ఈ దేశం కాని దేశంలో మొదటిసారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ ఇది. రెండు రోజుల ముందు నుంచే చందుని హింసించడం మొదలుపెట్టాను..
పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా? ఉండ్రాళ్లకి బియ్యపు రవ్వ ఎక్కడ కొనాలి? మరి పాలవెల్లి సంగతేంటి? వ్రత కథ పుస్తకం ఎలా? బంతిపూల మాలలు దొరకవు కదా? ఇలా విసిగించాను. పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్స్ అన్నీ తిరిగాం. కానీ దొరకలేదు. అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా? దానికి పసుపురాసి కుంకుమ పెటి ్ట గోడకి కట్టి దానికి ఆపిల్, దానిమ్మ కాయలు, వెలక్కాయలు, మొక్కజొన్నలు, అరటి పిలకలు, మామిడాకులు, బంతి, కలువ పువ్వులన్నింటితో అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది? ఇంటికి వచ్చాక ఇంటర్‌నెట్‌లో గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు. సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్‌లో 'పాలవెల్లిని నేనే తయారు చేసుకున్నా' అని ఓ పోస్ట్ కనిపించింది.
నేనూ అలాగే తయారు చేసుకుందామని చెక్కముక్కల కోసం వాల్‌మార్ట్‌కి వె ళ్లాను. దొరకలేదు. మిగతా సరుకులైనా కొందామని 'క్రోగర్'లో పూల బొకేలు, అరటి పళ్లు తీసుకున్నాం. 'నమస్తే'కి వెళ్లి కొబ్బరికాయలు కొన్నాం. పండగ సందర్భంగా వారు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు, రెండు అరటిపళ్లు, ఇంకా నాలుగు రకాల పళ్లు కూడా ఇచ్చారు. అవన్నీ ఉంటేనే కదా పండగ కళ.
ఇక మట్టి వినాయకుని వెతకడమే మిగిలింది. ఏ షాపులో చూసినా రంగు రంగుల వినాయకులే. నాకేమో మట్టి వినాయకుడే కావాలి. చివరికి ఒక షాపులో బుజ్జి వినాయకుడు దొరికాడు. చిన్న గొడుగు కింద సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. తర్వాత తమలపాకులు, వక్కలు, చందనం, చిన్న దీపపు ప్రమిదలు కొన్నాం. పాలవెల్లి ఇంకా మిగిలే ఉంది. చెక్కల కోసం 'హోమ్ డిపో'కి వెళ్లాం. కష్టపడి మాకు కావాల్సిన చెక్కముక్కలు కొన్నాం. ఇంటికి రాగానే చందు పాలవెల్లిని తయారు చేసే పనిలో మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా. పాలవెల్లి రెడీ అయింది కాని దాన్ని ఎలా వేలాడదీయాలి? గోడకి మేకులు కొడితే ఓనర్స్ ఒప్పుకోరు.
అందుకే మా సైడ్ టేబుల్‌ని పూజామందిరంగా మార్చేశా. కింద పైన అద్దాలు ఉండే సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు. పైన పాలవెల్లి పెట్టొచ్చు అనుకున్నాం. అమ్మయ్య! మనసు కుదుటపడింది. చవితి రోజున పొద్దున్నే లేచి వంట కానిచ్చి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం. పాలవెల్లిని అలంకరించుకుని లాప్‌టాప్‌లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేశాం. ఆ రోజు మా ఇంటికి అతిథిగా వాచ్చిన నాని గారు మా వినాయకుణ్ణి చూసి 'ఇండియాని గుర్తు చేశారండి' అన్నారు. నాకు చాలా సంతోషమేసింది.

No comments:
Post a Comment