కళాకారుడు ప్రకృతిని తయారు చేయలేడు. కానీ తన సృజనను ఉపయోగించి దానికి ప్రతిరూపాన్ని తయారు చేస్తాడు. బోన్సాయ్ మొక్కలు కూడా కళాకారుని నీడలో ప్రకృతిపరంగానే ఎదుగుతాయి. నిజానికి ఈ మరుగుజ్జు మొక్కల పెంపకం ఒక ఖరీదైన వ్యాపకం. ధనవంతులకు ఒక హాబీ. నిజానికి బోన్సాయ్ మొక్కల పెంపకం ఒక కళ. జపాన్ దేశ సంస్కృతి, విశ్వాసాల నుంచి విస్తరించిన ఈ కళ ఆసక్తికరమైనది. పెంపుడు జంతువులను పెంచుకున్నట్లే బోన్సాయ్ మొక్కలనూ పెంచుకోవచ్చు. హాబీగా బోన్సాయ్ మొక్కలను పెంచడానికి నిర్దిష్టమైన సూత్రాలు ఎమీ లేవు. మొక్కలను పెంచడానికి వ్యక్తిగతమైన ఇష్టం ఆసక్తి, ఓర్పు, సహనం ఉండాలి.
బోన్సాయ్ మొక్కల తయారీ అంటే జన్యుపరంగా పెరిగే చిన్న మొక్కలు కాదు. అలాగే బలవంతంగా కూడా మొక్కలను చిన్న చిన్నవిగా మార్చలేము. మామూలు చెట్లలానే సరైైన నీరు గాలీ వెలుతురు, పోషకాలు అందజేస్తూ బోన్సాయ్ మొక్కగా తీర్చిదిద్దితే... అది మరుగుజ్జు మొక్కగా ఎదుగుతుంది. ఇవి మొదటగా వేయి సంవత్సరాల క్రితం చాలా కొద్ది సంఖ్యలో చైనా దేశంలో ఉండేవి. ఇప్పటికీ చైనాలో ఈ బోన్సాయ్ మొక్కల పెంపకం మనకు కనిపిస్తుంది. దీనిని వారు పున్ - సాయ్ అంటారు. ‚ఇవి అన్నిటిలాగే సాధారణమైన మొక్కలే. బయట మనకు చుట్టు పక్క కనిపించే ఏ మొక్కనైనా బోన్సాయ్ మొక్కగా పెంచుకోవచ్చు. కానీ చిన్న ఆకులు ఉన్న మొక్కలు మాత్రమే ఎంచుకో వాలి.
ఎందుకంటే ఇవి మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఎంతగా అంటే వచ్చిన అతిధులు అలా చూస్తునే ఉండిపోయేటంతగాఈ మొక్కలు ఇరవై సెంటీ మీటర్లనుండి ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతాయి. జపనీయులకు ్త బోన్సాయ్ వారి సంస్కృతిలో ఒక భాగం. జెన్ - బౌద్ధవిధానంలో పవిత్రమైనది. బోన్సాయ్ మొక్కను రక్షిస్తే కొన్ని తరాలు జీవిస్తుంది. ఓ మొక్కగా కాకుండా మీ స్నేహితునిగా మీ కుటుంబంలో భాగమైపోతుంది. మీ ఇంట్లోని పెద్దవారి జ్ఞాపకంగా పెంచుకున్న మొక్కను ఓసారి ఊహించుకోండి ఎంత హాయి గా ఉంటుందో..! అలాంటి బహుమతులు పొందడం మధురాతి మధురంగా ఉంటుంది. బోన్సాయ్ మొక్కలు అందంగా ఉంటాయి. ఏళ్ళ తరబడి జాగ్రత్తగా పెంచినందు వలన ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మొక్కలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. చూడగానే అందరి మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటాయి. బోన్సాయ్ మొక్కలు ఇంటిి, ఇంటిలో ఉన్న తోటకు అందం చేకూర్చుతాయి.
పెంపకం ద్వారా సమకూరే విజ్ఞానం అనంతం. కొత్త వాటిని తయారుచేసినప్పుడు మెదడు చైతన్యవంతమవుతుంది. ఇంటిదగ్గర ఉండే గృిహణులు వీటి పెంపకం ద్వారా ప్రకృతిని అర్థం చేసుకునేందుకు మరింత అవకాశం కలుగుతుంది. విత్తనాల ద్వారా, చిన్నమొక్కలను పెంచుకోవడం ద్వారా బోన్సాయ్‌లను తయారుచేయవచ్చు. మొక్కల వేర్లు, రెమ్మలు, కొమ్మలు జాగ్రత్తగా కత్తిరించడం ద్వారా, వైరింగ్ చేయడం ద్వారా ్త బోన్సాయ్ మొక్కలను కావలసిన ఆకారంలో తయారు చేసుకోవచ్చు. ఇవి చూడటానికి కూడా చిన్నవిగా ఉండి మనకు నచ్చిన ఆకారంలో ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఇది సృష్టికి సంబంధించినది. విశ్వవ్యాపితమయిన ప్రాణదాన ప్రక్రియ. ఇందులో కళాకారుడు వృక్షమూ ఇరువురూ భాగస్తులే. ఇద్దరూ కూడా ఒకరినొకరు విడిపోలేనంత మంచి స్నేహితుల లాంటి వారన్నమాట. ్త బోన్సాయ్ మొక్కలను ఆరుబయట తోటలో పెంచుతారు. బోన్సాయ్ మొక్కలను పెంచడానికి ముఖ్యమైనది మనం ఎంచుకునే పాత్ర. దీనిపైనే బోన్సాయ్ ఎదుగుదల కూడా ఆధారపడి ఉంటుంది.
అనువుగాని పాత్రలో పెంచిన మొక్కలు చివరకు చనిపోతాయి. వీటిని పెంచడానికి ప్రత్యేకమైన పాత్రలు స్టాండ్స్ వంటివి దొరుకుతాయి. మొక్కలను పెంచడానిి, ఎక్కువైన నీరు బయటికి వెళ్ళడానికి అవకాశమున్న పాత్రలు లేక కుండీలనే ఎంచుకోవాలి. నేలపైన కొంత ఎత్తులో బోన్సాయ్ మొక్కలు ఉంచాలి. ఏ రూపం కావాలో ఆరూపానికి అనుగుణంగా ఆ మొక్క ను పెంచడం,చెట్టును ఎదుగుతుండగా కత్తిరించడం ఓ పద్దతి. వైరుతో మొక్క ఆకారాన్ని, రూపా న్ని మార్చడం వైర్లతో మొక్కను కావలసినట్లు వంచి కట్టడం చేయాలి. ప్రతి కొమ్మ మనం అనుకున్నట్లు రావడానికి నిరంతరం ప్రయత్నించాలి. అప్పుడే బోన్సాయ్ మొక్క అందంగా కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా బోన్సా య్ మొక్కను తయారు చేయండి. ఇది ఒక అందమైన హాబీయే కాదు వచ్చిన అతిథులను ఆకట్టుకునే తారక మంత్రం కూడా ఇందులో దాగివుంది. ఇంటీరియల్ డెకరేషన్‌కు ఇప్పుడు బోన్సాయ్ మొక్కలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
No comments:
Post a Comment