'అరేయ్ ఈ జర్కిన్‌కి మస్తు పెట్టినవ్‌రా..అబిడ్స్‌ల నీకిట్లాంటిది నాలుగు వందలకే ఇప్పిస్తా' ఒక అబ్బాయి. 'పేకకురా(గొప్పలు చెప్పకు). నాలుగు వందలకి ఇప్పిస్తే నాలుగు తీస్కుంటా' రెండో అబ్బాయి. 'అరేయ్.. వాడు పేక్తాడనే విషయం అందరికి తెల్సుకాని హలీం చల్లగైతుంది. బయట వాన పడ్తుంది తొందరగా తినండిరా... పోవాలే' ఇంకో ఫ్రెండ్.
'పేకుడు కాదురా.. ఈడికి హిందీ రాదుకదా... వాడు దోసౌ అంటే వీడు నాల్గు వందలిచ్చిండేమోనని నా అనుమానం' అన్నాడు మొదటివాడు.'అంత లేదు. దోసౌ అంటే గామాత్రం తెల్వదా నాకు' ఉడుక్కున్నాడు రెండో వాడు.
8.9.10.. బుధవారం రాత్రి ఎనిమిది గంటలు.. రంజాన్ ముందు రాత్రి.. మదీనా నుంచి లాడ్ బజార్ వరకు చార్మినార్ ప్రాంతమంతా జిగేల్ మంటోంది. గాజుల దుకాణాలు... బట్టల షాపులు... చెప్పుల కొట్లు.. హ్యాండ్ బ్యాగులు... బురఖాలు.. పరదాలు... మఖ్‌మల్ దుపట్టాలు.. ఆట బొమ్మలు.. సాఫ్ట్ టాయ్స్.. సువాసనల అత్తర్లు... ఓ వైపు కవ్వాలీ రికార్డులు... దగ్గరున్న శివాలయంలో ఢంకా, గంటల చప్పుడు.. బిర్యానీ పాయింట్లో లేటెస్ట్ హిందీ పాటల సవ్వడులు... హడావుడిగా తిరిగే జనం.. ఓహ్... తిరునాళ్లను మరిపించే వాతావరణం అది. ఆకాశం నుంచి సన్నని తుంపర శరీరంలో చలిని పుట్టిస్తున్నా.. అక్కడి జనాలు దీన్ని ఖాతరు చేస్తున్నట్టు అనిపించలేదు వాళ్ల షాపింగ్ హంగామా చూస్తుంటే. అయినా ఆవిర్లు కక్కే హలీం.. ఇరానీ ఛాయ్‌లుండగా చలిగిలి అన్నీ పొలోమని పోవూ... షాపింగ్‌లో అలసిపోతే ఘుమఘు0మలాడే హైదరాబాద్ బిర్యానీ కూడా ఉండనే ఉంది ఉత్సాహాన్ని ఇవ్వడానికి. అన్నిటికీ మించి అక్కడ కనిపించింది ఉత్సవ సంరంభం. అడుగుపెట్టే చోటు లేని ఆ సమూహంలో కలిసిపోతే ఇవి కనిపించాయి..
'దోసౌ పచాస్ ఏక్.. దోసౌ పచాస్ ఏక్' బురఖాలు అమ్మే భాయి స్టూలు మీద నిలబడి బురఖా వేసుకుని కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. 'ఏక్ సౌ పచాస్‌కో దోగే' ఓ యాభై ఏళ్లావిడ బేరం మొదలుపెట్టింది.
'అస్‌లీమే తీన్‌సౌ కా హై. పచాస్ కమ్‌కర్కే బతారహా, అబ్ ఏక్ పైసాభీ కమ్‌కర్నేకా నయ్యే' కచ్చితమైన జవాబు బురఖా భాయి నుంచి. 'కైకూ నై కరతే' ఆవిడ డిమాండ్.
'నై కర్తే జబర్దస్తీ హై క్యా? జావోజీ జావో' కొనే బేరం కాదనుకున్నాడేమో పుల్లవిరుపుగా చెప్పాడు.
*** 'బాబూ ఈ గాజుల సెట్ ఎంతమ్మా..?' గాజుల దుకాణం దగ్గర ఓ తెలుగావిడ సెలక్షన్ మొదలైంది.
'యే వాలా... సౌ కా సెట్' రేట్ చెప్పి ఇంకో బేరానికి గాజులు చూపించే పనిలో బిజీ అయ్యాడు దుకాణాదారు.
'సౌ అంటే ఎంతండీ ?' పక్కనున్న ఆవిడను అడిగింది ఈమె.
ఆవిడ చెప్పేలోపే దుకాణదారు 'హండ్రెడ్ ' అని సమాధానం చెప్పాడు.'యే లోకల్ మాల్ నయ్.. ఇంపోర్టెడ్ మాల్ హై..' అంటూ గాజుల ప్యాక్ తీసి చూపించసాగాడు అతను.
'మాకు తెలుసులేవయ్యా... ఇదిగో యాభై రూపాయలకు ఇస్తావా?' అడిగింది ఆమె.
'కిత్నేమే దేనా...?' కాస్త వ్యంగ్యంగా అన్నాడు దుకాణదారు.
'అగర్ పచాస్ మేదియేతో.. హమ్ భీ తీన్ సెట్ లేంగే' ఆ పక్కనున్న ఆమె కూడా బేరం చేసింది.
'అరే.. పచాస్ మే కైసే ఆతా ? సత్తర్ దేదో...' కాస్త తగ్గాడు అతను.
'నహీ.. పచాస్.' రెండో ఆవిడ బేరం..
' లేలో... లేలో' ఏదో ఆవిడ కోసం కాంప్రమైజ్ అవుతున్న అర్థం ధ్వనించింది ఆ పిలుపులో.
*** 'బడీ అమ్మీ.. యే కషికలీ సెంట్ కతే(పెద్దమ్మా ఇది కషికలీ సెంట్ అట) దేఖో ఇస్ కా ఖుష్బూ..' అంటూ ఓ పద్ధెనిమిదేళ్ల అమ్మాయి మండ మీద(అరచేయి వెనక భాగం) రాసుకున్న అత్తరు వాసనను చూపిస్తూ అడిగింది.
'అచ్ఛా హై.. కషీష్ కా హై క్యా పూఛో' ఆర్డరేసింది ఆ అమ్మాయి పెద్దమ్మ.
వీళ్లిద్దరు అత్తరు కొనుగోలులో ఉండగానే ఓ అయిదారుగురు ఆడవాళ్ల గ్యాంగు వచ్చింది 'బాబా పుకార్రే. బిర్యానీ కానేకో జానా హై. జల్దీ కరో ' అంటూ.
'అరే వా. .ఆప్ కాతో ఖతమ్ హో గయే(అరే.మీదప్పుడే అయిపోయిందా)' అడిగింది పెద్దమ్మ.
'అభీ కహా.. చెప్పల్, హ్యాండ్ బ్యాగ్ ఖరీద్‌నేకా హై.. బాబా కల్ ఆనేకా బోల్రే ..(లేదు. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు కొనాలింకా. నాన్న రేపు రండి అంటున్నారు)' ఆ గ్యాంగులోని పదహారేళ్ల అమ్మాయి.
వీళ్లిలా మాటల్లో ఉండగానే పద్ధెనిమిదేళ్ల అమ్మాయి ఐదు అత్తరు సీసాలను కొంది. అంతా కలిసి కదిలారు అక్కడి నుంచి.
నాకివే కావాలి..
'మమ్మీ... నాకివే కావాలి' ఏడేళ్ల అమ్మాయి మారాం చేస్తోంది.
'అవి హీల్స్ అమ్మా.. నడవ రాదు. పడిపోతావ్' సర్ది చెప్తోంది అమ్మ, 'ఆ.. ఆ...నడవొచ్చు. నాకివే కావాలి' మొండి కేసింది పాప.
ఎంత చెప్పినా వినడం లేదు. నాలుగేళ్ల అబ్బాయిని ఎత్తుకుని నిలబడ్డ ఒక వ్యక్తి పదిహేను నిమిషాలుగా వీళ్ల వాలకం గమనించి... 'అబ్బబ్బ..దానికి నచ్చినవి కొనిపెట్టొచ్చు కదా.. ఆ పంతం ఎందుకు' అన్నాడు విసుక్కున్నట్టుగా.
'మీరూరుకోండి. మీకేం తెలియదు. అవి వేసుకుని నడవగలదా అది?' విసురు సమాధానం ఆమె నుంచి.
ఈలోపు అతని చంకలో ఉన్న అబ్బాయి దిగడానికి తెగ ట్రై చేస్తున్నాడు. పక్కనుంచి వెళ్తున్న ఓ ఆవిడ జడ రబ్బర్ బ్యాండ్ లాగే ప్రయత్నం చేశాడు. షాపులో వేళ్లాడగట్టిన చెప్పులను పీకుతున్నాడు. ఆయనకు ఓపిక నశించి బాబును కింద దింపేశాడు
. దింపడమే ఆలస్యం వాడు ఆ గుంపులో కలిసిపోయాడు. ఇది గమనించిన ఆవిడ...'ఏమండీ.. బాబి గాడు. పరిగెడుతున్నాడు' అంటూ అరిచినంత పనిచేసింది. ఆ కేకకు ఉలిక్కిపడ్డాడేమో.. వెంటనే తేరుకుని వాడిని పట్టుకునేందుకు పరుగెత్తాడు. ఓ చేత్తో పాప చేయి పట్టుకుని అతని వెనకాల ఆమే పరుగెత్తింది. 'అమ్మా... నాకా చెప్పులే కావాలే' అని ఏడుస్తూ పాప తల్లిని అనుసరించింది.
వాన కొంచెం ఎక్కువయ్యే సరికి బండ్లు పెట్టుకుని అమ్ముతున్న వాళ్లంతా క్షణాల్లో అలర్టై చకచకా టర్బన్ కవర్లు కప్పేసే పనిలో పడిపోయారు. అయినా ఆ వర్షాన్ని లెక్క చేయక సంవత్సరానికి సరిపడా కావల్సిన వస్తువులను కొనుక్కోవడంలో ముస్లింలు బిజీగా ఉంటే....రంజాన్ సందర్భంగా వచ్చే వెరైటీ వస్తువులను కొనాలనే ఆసక్తి ఉన్న ఇతరులు ఆ అన్వేషణలో మునిగిపోయారు.
ఎక్కడ చూసినా చమ్కీ, జరీ, ముదురు రంగులతో జిగేల్ మంటున్న బట్టలను చూస్తూ అవి కొంటున్న వాళ్ల టేస్ట్‌ను గమనిస్తూ ఫ్రెండ్స్‌తో సరదాగా కామెంట్లు చేసుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు ఇంకొందరు. చార్మినార్‌కి నాలుగువైపులా బారులు తీరిన కొత్తకాంతులను చూడాలని వచ్చిన సందర్శకులు ఆ పనిలో మునిగిపోయారు. వీళ్లు కాకుండా తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో గీచి గీచి బేరం చేస్తున్న వాళ్లు, చూడ్డమే కాని కొనకుండా టైమ్ పాస్ చేస్తున్న వాళ్లు, ఎంత ధరైతే అంతా చెల్లించి తీసుకెళ్తున్న వాళ్లతో కోలాహలంగా ఉంది అంతా.
హలీం పాయింట్ ఎవరికి వారు విడిపోయి కావల్సినవి కొనుక్కుని అంతా అక్కడికి చేరినట్టుంది వాతావరణం.
వేడి వేడి హలీంలో నిమ్మకాయ పిండుకుని ఆ రుచిని ఆస్వాదిస్తూ... షాపింగ్ చేసి కొన్న వస్తువులను ఒకరికి ఒకరు చూపించుకుంటూ.. కామెంట్ చేసుకుంటూ... గమ్మత్తుగా ఉంది అంతా.
'అబ్బ! ఈ బ్యాగ్ కలర్ బాగుందే.. ఎక్కడ దొరికింది?' స్నేహితురాలి హ్యాండ్ బ్యాగుమీద మనసు పారుసుకున్న ఇంకో స్నేహితురాలు. 'లాడ్ బజార్ వైపు ఉన్నాయి' అమ్మాయి ఆన్సర్.
'షాపులోనా.. బండీ పైనా?' మొదటి అమ్మాయి.
'బండీ మీదే' రెండో అమ్మాయి.
'బాగుంది కదే...'ఇంకో స్నేహితురాలికి చూపిస్తూ మొదటి అమ్మాయి.
' ఎంతనుకున్నావ్. జస్ట్ 150 అంతే' రెండో అమ్మాయి గర్వంగా.
నాలుగు వందలకి నాలుగు
'అరేయ్ ఈ జర్కిన్‌కి మస్తు పెట్టినవ్‌రా..అబిడ్స్‌ల నీకిట్లాంటిది నాలుగు వందలకే ఇప్పిస్తా' ఒక అబ్బాయి.
'పేకకురా(గొప్పలు చెప్పకు). నాలుగు వందలకి ఇప్పిస్తే నాలుగు తీస్కుంటా' రెండో అబ్బాయి.
'అరేయ్.. వాడు పేక్తాడనే విషయం అందరికి తెల్సుకాని హలీం చల్లగైతుంది. బయట వాన పడ్తుంది తొందరగా తినండిరా... పోవాలే' ఇంకో ఫ్రెండ్.
'పేకుడు కాదురా.. ఈడికి హిందీ రాదుకదా... వాడు దోసౌ అంటే వీడు నాల్గు వందలిచ్చిండేమోనని నా అనుమానం' అన్నాడు మొదటివాడు. అంతా నవ్వులే.
'అంత లేదు. దోసౌ అంటే గామాత్రం తెల్వదా నాకు' ఉడుక్కున్నాడు రెండో వాడు.
'అరేయ్ గటు చూడు... బ్లాక్ కలర్ చుడీ దార్ మస్త్ ఉంది కదా...' మూడో వాడి కామెంట్.
'పక్కనున్న వాళ్లమ్మ గూడా మస్త్ ఉంది' లావుగా ఉందన్నట్టు చేతులతో సైగ చేస్తూ అన్నాడు రెండో వాడు.
నవ్వుకుంటూ హలీం తినడంలో మునిగిపోయారు.
హమారా పాస్ తో నయ్యే..
'హోజీ..ఆసిఫ్ కహా హై... హమారా పాస్ తో నయ్యే' బురఖా పరదా పైకి తీస్తూ చెప్పింది ఒకావిడ.
'నయ్యే... మేరా పాస్ భీ నయ్యాయే... అస్ఘర్ సే పూఛో షాయద్ ఉన్కా పాస్‌తో హై...' అతను కాస్త గాభారాగా సమాధానమిచ్చాడు.
'అస్ఘర్... బేటా అస్ఘర్' అంటూ తాను ఉన్నచోటు నుంచే ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఓ అబ్బాయిని పిలవసాగిందావిడ గట్టిగా..'
ఈవిడ వ్యవహారం గమనించి అతను లాభం లేదనుకుని అస్ఘర్ అనే అతని వైపు వెళ్తుంటే 'హోజీ కహాజారా.. హమార్కో హలీంకా ఆర్డర్ కర్కే జావోనా..' అంటూ అంతే గట్టిగా అరిచింది. ఈవిడ వైపు ఓ చూపు చూసి అతను వెళ్లిపోయాడు.
యాక్.. నాకొద్దు
'డాడీ.. వద్దు. చికెన్ బిర్యానీ కావాలి' ఆరేళ్లు ఉంటాయేమో. .మారాం చేస్తున్నాడు.
'బిర్యానీ కూడా తిందువు గాని. ఇది కూడా తిను బాగుంటుంది. జీడి పప్పు ఉంటుంది తెల్సా చాలా బావుంటుంది. టేస్ట్ చూడు' అంటూ తినిపించే ప్రయత్నం చేయసాగాడు తండ్రి.
'యాక్... నాకొద్దు. బిర్యానియే కావాలి' పట్టుదలగా పిల్లాడు.
'తిననంటే వాడు తినడు భాస్కర్. వదిలేయ్. వెళ్తూ వెళ్తూ బిర్యానీ ప్యాక్ చేయించుకుందాం' తాను హలీం తింటూ చెప్పింది వీళ్లకు కాస్త దూరంలో ఉన్న ఒకావిడ (బహుశా భాస్కర్ భార్యనుకుంటా)
*** ఇంతలోకే వర్షం కాస్త ఎక్కువడంతో ఆ పక్కనే ఉన్న ఇరానీ కేఫ్ చూరుకిందికి చేరారు చాలామంది. కొంతమంది ఛాయ్ తాగుతూ.. రంజాన్ వేడుకల గురించి మాట్లాడుకుంటుంటే.. మరికొంత మంది రేట్లు పెరిగిన డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇంకొంత మంది మగవాళ్లు తాము కుట్టించుకోబోయే షేర్వాని డిజైన్ గురించి, సతాయిస్తున్న టైలర్ల గురించి, విదేశాల నుంచి రంజాన్‌కి గెస్ట్‌లుగా వస్తున్న తమ హిందూ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నారు. కాని లేటెస్ట్ రాజకీయాల గురించి మాత్రం ఎవరూ మాట్లాడలేదు. అవన్నీ విన్నాక, చూశాక రంజాన్ హైదరాబాద్ మొత్తానికే ఈద్ అనిపించింది. వాహ్... హైదరాబాద్.. ఈద్ ముబారక్!

* * *
జూ సరస్వతి రమ, బీరెడ్డి నగేష్‌రెడ్డి ఫోటోలు: శివ, చార్మినార్
No comments:
Post a Comment