Saturday, September 4, 2010

సరస్సుపై సంసారాలు

కాసేపు వర్షం పడితేనే - ఏ చెట్టు నీడకో చేరతాం. లేకుంటే పరుగులతో ఇంటికి చేరతాం. ఎప్పుడూ నీటిలోనే తడుస్తూ ఉండటానికి ఇష్టపడం. అటువంటిది జీవితాంతం - ఒక సరస్సు మధ్యన ఇంట్లో కాపురం ఉండాలంటే? బెనిన్ ప్రాంతంలోని పల్లెటూరు గెన్‌వియా. తీర ప్రాంతానికి కొద్ది మైళ్ల దూరం. ఇలా సరస్సు మధ్యలో ఇళ్లు కట్టుకోవటం వెనుక సీరియస్ నేపథ్యం ఉంది. క్రీ.శ.18వ శతాబ్దంలో ఆఫ్రికన్ తెగలైన తోఫినూ.. బానిస తెగలైన డోమ్ హోమెకి మధ్య తరచూ అంతర్యుద్ధాలు జరిగేవి. వందల కొద్దీ ప్రాణాలు పోయాయి. డోమ్ హోమె తెగ వారు ఆ దాడులను తట్టుకోవటం కోసం సరస్సులో ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగించారు. తోఫినూ తెగ వారికి నీళ్లంటే భయం. అందుకే ‘డోమ్’ తెగ ప్రజలు ఇలా నీటిలో ఉండిపోయారు. సంవత్సరాలు గడిచినా - ఆనాటి జ్ఞాపకాలను మరచిపోలేక కొంతమంది ఆ సరస్సులోనే ఉండిపోతే.. మరి కొంతమంది భూమీదికి చేరుకున్నారు. ‘డోమ్’ తెగవారి జీవన విధానం విభిన్నంగా ఉంటుంది. ఆధునిక నాగరికతకు వీరు దూరంగా ఉంటూ తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు.

No comments: