పావురం మన నేస్తం. శాంతి చిహ్నం. మతపరంగా విశిష్టత కలది. పావురం మనకు ఎన్నో రూపాల్లో సేవలందించింది. అందిస్తూనే ఉంది.
- కొన్ని దేశాల్లో పావురాల పెంటకు భలే గిరాకీ. దీన్ని ఎరువుగా పంటలకు ఉపయోగిస్తూ ఉంటారు. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో పావురాల పెంటతో సాల్ట్‌పీటర్‌ను తయారు చేసేవారు. ఈ సాల్ట్‌పీటర్ గన్‌పౌడర్ తయారీలో ప్రధాన మూలకం.
- మొదటి, రెండవ ప్రపంచయుద్ధాల్లో ఎంతో మంది సైనికుల ప్రాణాలను పావురాలు రక్షించాయి. శత్రుదేశాలకు సమాచారాన్ని చేరవేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషించాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో చెర్అమి అనే పావురం అందించిన సేవలను చాలా విలువైనవిగా చెబుతారు. వందల మంది ఫ్రెంచ్ సైనికుల ప్రాణాలను అది కాపాడింది. శత్రుదేశానికి సమచారం అందించి తిరిగి వస్తుండగా తీవ్రంగా గాయపడింది. అయినా 25 నిమిషాలు అలాగే ప్రయాణించి స్వదేశానికి సమాచారాన్ని చేరవేసింది. ఇందుకు గుర్తింపుగా క్రాక్స్ డీ గ్వెర్ అనే పురస్కారాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రదానం చేసింది.
- యుద్ధ సమయాల్లో సైనికులు పావురాలను తమతోపాటుగా ఓడల్లో తీసుకెళ్లేవారు. ఎక్కడైనా ఓడ మునిగిపోయే పరిస్థితి ఉంటే ఇవి ముందుగానే తె లియజేసేవి.
- క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో పావురాలను సమాచార పంపిణీకి వారధులుగా సిరియా, పర్షియా, ఈజిప్టుల్లో ఉపయోగించారు. చాలా దేశాల్లో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేంతవరకూ పావురాలను సమాచారా బట్వాడాకు వినియోగించారు.
ఈ రేసింగ్ పావురాలకు మార్కెట్లో భలే గిరాకీ ఉంది. ఇరవై ఒక్కవేల పావురాలను ఓడించి లక్ష్యాన్ని చేరుకున్న ఓ పావురాన్ని కొంత కాలం క్రితం ఓ బ్రిటిష్ కంపెనీ సుమారుగా అరవైలక్షల తొంబైఐదువేల రూపాయలు పెట్టిమరీ కొనుగోలు చేసింది.
- గతంలో పావురాలు అడవుల్లో మాత్రమే ఉండేవి. తర్వాత అవి మనకు దగ్గరయ్యాయి.
- పావురాలు చాలా తెలివైన పక్షులు. ఒకే మనిషికి సంబంధించిన రెండు చిత్రాల మధ్య తేడాలను ఇవి గుర్తించగలవు. ఇంగ్లిష్‌లో ఉన్న 26 అక్షరాలను కూడా గుర్తుపట్టగలవు.

No comments:
Post a Comment