ఇరవై ఏళ్ల కిందట నాన్న మాస్కో వచ్చారు. ఇక్కడి యూనివర్శిటీ క్యాంపస్‌లో 'దేవీ కెఫే అండ్ బార్' అనే రెస్టారెంట్ కమ్ బార్ ఉంది మాకు. నా చదువు పూర్తయ్యేదాకా నాన్న, అన్నయ్య ఇద్దరే దాన్ని చూసుకునే వాళ్లు. మూడేళ్ల నుంచే (ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేళ్ల క్రితమే నేను మాస్కో వచ్చాను) నేనూ ఆ పని చేస్తున్నాను. మేము ఇక్కడి మన దేశ రాయబార కార్యాలయానికి వంటకాలను సరఫరా చేస్తాం. భారతదేశం నుంచి ఏ విఐపి వచ్చినా భోజనం మా దగ్గర నుంచే వెళ్తుంది.
అద్దెలు భరించడం కష్టం
మాది రెస్టారెంట్ బిజినెస్ కనుక నిర్దిష్టమైన పని వేళలంటూ ఏమీ ఉండవు. ఉదయం ఆరింటికి మొదలైతే అర్దరాత్రి పన్నెండు దాకా మా హోటల్ తెరిచే ఉంటుంది. ఉదయం ఐదు గంటల నుంచే పనులు మొదలుపెడ్తాం. ఇల్లు క్యాంపస్‌కి దగ్గర్లోనే ఉంటుంది. ఇక్కడ ఇళ్లు దొరకడం కష్టం కాదు కాని అద్దె భరించడమే చాలా కాష్టం. ఒక గది అద్దె రెండు వేల అమెరికన్ డాలర్లు ఉంటుంది. అంటే దాదాపు లక్ష రూపాయలు. ఒక అపార్ట్‌మెంట్ తీసుకుంటే రెండు నుంచి రెండున్నర లక్షల దాకా ఉంటుంది అద్దె. ఒక్క ఇల్లే కాదు ఏదైనా ఇక్కడ ఖరీదు ఎక్కువే. ధరలు ఆకాశన్నంటుతుంటాయి. మా రెస్టారెంట్‌లో 25 మంది సిబ్బంది ఉన్నారు.
అందులో ఆరుగురు రష్యన్లు. మిగిలిన వాళ్లు భారతీయులే. వాళ్లలో విద్యార్థులే ఎక్కువ. అంటే క్యాంపస్‌లో చదువుకుంటూ పార్ట్ టైమ్ ఇక్కడ ఉద్యోగం చేస్తారన్నమాట. రష్యన్లలో నలుగురు ఆడవాళ్లు. క్లీనింగ్ సెక్షన్‌లో వెయిటర్స్‌గా పని చేస్తారు. ఒకావిడయితే పదిహేనేళ్ల నుంచీ మా దగ్గరే పనిచేస్తోంది. పని విషయంలో రష్యన్లు చాలా బాధ్యతగా ఉండటమే కాదు చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. చేయాల్సిన పని గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్టే గ్రహించి చకచకా చేసుకుపోతుంటారు. ఇద్దరు రష్యన్లున్నా హోటల్ నడిపేయొచ్చు. అంటే అంత ధీమాగా ఉండొచ్చు వాళ్లుంటే. ఇద్దరే రెస్టారెంట్ మొత్తాన్నీ ఒంటి చేత్తో మేనేజ్ చేసేయగలరు.
హారన్ మోగిస్తే పనిష్మెంటే....
మా రెస్టారెంట్‌కి కావల్సిన సరుకులు, కూరగాయల కోసం గుజరాతీలు నడిపే భారతీయ దుకాణాలకి వెళ్తాం. నిలువ ఉండే వస్తువులైతే ఇండియా నుంచే తెప్పించుకుంటాం. ప్రతి నాలుగైదు నెలలకు ఎవరో ఒకరు ఇండియా నుంచి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఫుడ్ కలర్స్, కాశ్మీరి మిర్చి, కస్తూరి మేతి, కొన్ని రకాల గరం మసాలా పదార్థాలను అక్కడి నుంచే తెప్పించుకుంటాం. ఇక్కడవి దొరకవని కాదు, ధరలు ఎక్కువని.
యూనివర్శిటీ మాస్కో సిటీ సెంటర్‌లోనే ఉంటుంది. ఆ క్యాంపస్‌లోనే మా రెస్టారెంట్ కనక ఏ దుకాణమైనా అరగంట దూరంలోనే ఉంటుంది. కాని ఇక్కడ ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. అరగంట ప్రయాణానికి కనీసం రెండు గంటలు... ఆపైన ఎంతైనా పట్టొచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు, సాయంత్రం ఆరు తర్వాతయితే మరీ దారుణం. ఐదేసి గంటలు కూడా జామ్ అవుతుంది. ఇంకో విషయమేంటంటే... హారన్ మోగించకూడదు. మోగిస్తే ఫైన్.. లేదంటే పనిష్మెంట్. ట్రాఫిక్ నియమాలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. తాగి వాహనాలు నడిపే వాళ్లు పట్టుబడితే... ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో పదోపరకో పెట్టి తప్పించుకోవడం వంటి పప్పులేమీ ఉడకవు . ఫైన్‌తోపాటు పనిష్మెంట్లే కాక డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు క్షణాల్లో.
లంచం అంటే ఏమిటో తెలియదు వీళ్లకు. అందుకే ఇక్కడేదైనా తప్పు చేస్తే తప్పించుకోవడం కుదరదు. అలాగే ప్రజల అవసరాలకు ఏ చిన్న అంతరాయం కలిగినా ఆయా విభాగాలు క్షణాల్లో స్పందిస్తాయి. ఉదాహరణకు.. మనింట్లో టెలిఫోన్ డెడ్ అయినా... స్ట్రీట్ లైట్ వెలగట్లేదని ఫిర్యాదు చేసినా... తక్షణమే స్పందించి బాగు చేస్తారు. అంతేకాదు సమాజం ఆస్తుల పట్ల ప్రతివాళ్లూ బాధ్యతగా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం... చెత్త పారబోయడం కుదరదిక్కడ. చెత్తను కూడా దేనికదే (ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్, నూనె పదార్థాలు ఇలా) వేరు చేసి డస్ట్‌బిన్‌లో వేయాలి. వీళ్ల జీవన విధానంలో అడుగడుగునా క్రమశిక్షణ కనిపిస్తుంది. స్వంత వాహనాలు ఉన్నా ప్రజారవాణా సౌకర్యాలను.. అంటే బస్సులనే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. (బస్సులు కాక టాక్సీలు కూడా ఉంటాయి). విద్య నుంచి వైద్యం దాకా ప్రజల మౌలిక అవసరాలన్నింటిలో అత్యుత్తమ ప్రమాణాలుంటాయి.
ఎన్ని రకాల వోడ్కాలో..!
వారానికి అయిదు రోజులే పనిదినాలు. శని, ఆదివారాలు సెలవులు. కాని మాకు మాత్రం నో హాలిడేస్. సెలువుదినాల్లోనే పని ఎక్కువగా ఉంటుంది. వీకెండ్స్‌కి బయటకు వచ్చే వాళ్లు ఎక్కువ కాబట్టి మా రెస్టారెంట్ ఆ రోజుల్లో కిటకిటలాడుతుంది. భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తులే కాక రష్యన్స్ కూడా వస్తుంటారు మా రెస్టారెంట్‌కి. నిజానికి వాళ్లు మాంసాహార ప్రియులు. పోర్క్, ల్యాంబ్ అంటే చాలా ఇష్టపడతారు. కాని మా రెస్టారెంట్‌లో శాకాహారం, చికెన్ తప్ప మిగతావేమీ ఉండవు. అయినా వస్తారు. పోర్క్‌లాంటి వాటి కోసం డిమాండ్ చేయకుండా మన వంటకాలనే చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఇడ్లీ, వడ, దోసెలాంటి టిఫిన్లంటే ప్రాణం పెడ్తారు.
పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటారు. వారికి అన్నిటికన్నా ప్రధానమైన పానీయం వోడ్కా. దీనికి రష్యానే పుట్టిల్లు. ఇక్కడున్నన్ని వోడ్కా వెరైటీలు ఇంకెక్కడా ఉండవు. ఇక్కడ అందరూ దీన్ని ఆస్వాదిస్తారు. ఇంటకి వచ్చిన అతిథులకు వోడ్కా ఇవ్వడం కనీస మర్యాద. అలాగే ఎవరినైనా హలో అని పలకరించడం కనీస మర్యాద. హలో అని చిరునవ్వుతో పలకరించకపోతే బయటకి ఏమీ అనకపోయినా అనాగరికులుగా చూస్తారు.
మొన్నటిదాకా కమ్యూనిస్టు దేశమైనా పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లే సరదా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. వీకెండ్ అనే కాదు... రోజంతా పనిచేసి రాత్రుళ్లు పబ్బులలో తుళ్లే యూత్ ఎక్కువే. సరదాలు, వినోదాలు, సంతోషాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. మన పండగలు, పబ్బాలు అన్నిటినీ ఇండియన్ ఎంబసీలో నిర్వహిస్తుంటారు. భారతీయులందరం అక్కడికే వెళ్తుంటాం. ఆసక్తి ఉన్న రష్యన్లు కూడా పాలుపంచుకుంటుంటారు.
పిల్లుల్ని పిల్లల్లా చూసుకుంటారు..
ఇక్కడ భారతీయులే కాక పాకిస్తానీ, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్లు కూడా ఎక్కువగా కనిపిస్తారు. రష్యన్లు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. వాళ్ల పద్ధతులు, ఆచారాలు, మతానికి సంబంధించిన నమ్మకాలు వాళ్ల వరకే పరిమితం చేసుకుంటారు. చాలా గుంభనంగా ఉంటారు. ఏ విషయంలోనూ బయటపడరు. వీళ్ల అలవాట్లు కొన్ని మనకు చిత్రంగా అనిపిస్తాయి. రష్యన్లకు పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ. పిల్లుల్ని బాగా పెంచుతారు.
ప్రతి ఇంట్లో పెంపుడు పిల్లులుంటాయి. మనకు వింతగా అనిపించే ఇంకో సంగతేంటంటే.. పిల్లలు లేని వాళ్లు పిల్లుల్నే స్వంత పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు. రష్యా రావాలనుకునే వాళ్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం... రష్యన్లకు ఇంగ్లీష్ అంతగా రాదు. బస్సుల మీద, ఇతరత్రా సైన్ బోర్డులన్నీ రష్యన్ భాషలోనే ఉంటాయి. కనుక రష్యన్ భాష వచ్చుంటే మంచిది. ఇక్కడ చదువు చాలా చవక. ముఖ్యంగా మెడిసిన్. ఉద్యోగాలకు మాత్రం అంతగా అవకాశాలు లేవు. పైగా వీసా అనుమతులు చాలా తక్కువగా ఉంటాయి.
విదేశీయుల వల్ల ఇక్కడి శాంతిభద్రతలకు, జన జీవనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు పాటిస్తుంటారు. రష్యాలో చదువుకున్న చాలామంది ఉద్యోగాల కోసం లండన్ వెళ్తుంటారు. మాస్కో నుంచి లండన్‌కి రోడ్డు దారి ఉంది. ఐదుగంటలే ప్రయాణం. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం... క్రైమ్ రేట్ చాలా చాలా తక్కువ. అమ్మాయిలను ఏడిపించడం, రేప్‌లు లాంటి సంఘటనలు అసలు వినిపించవు. ఆడా, మగా అందరూ సమానమే ఇక్కడ.

జూ సరస్వతి రమ
No comments:
Post a Comment