అపర కుబేరుడు, పారిశ్రామిక సంపన్నుడు, రిలయన్స్ పరిశ్రమల అధిపతి వర్ధమాన భారతంలో అడుగడుగునా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్న ముకేష్ అంబానీ నిర్మిస్తున్న ఆకాశహర్మ్యం ‘‘అంటీలియా’’ తుది మెరుగులు దిద్దుకుని ప్రారంభానికి ముస్తాబవుతోంది. 173 మీటర్ల ఎత్తుతో, 27 అంతస్తులతో, 2,00,000 చదరపు అడుగుల వైశాల్యంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన అంటీలియా ప్రపంచంలో అతి పెద్ద నివాస గృహంగా రికార్డులకు ఎక్కింది. ఈ ఇంటిని చూసుకోవడానికి, నిర్వహించడానికి 600 మంది సిబ్బంది అవసరమవుతారు. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన పురాణ ప్రసిద్ధ దీవి అంటీలియా పేరునే తన ఇంటికి పెట్టుకున్నారు ముఖేష్.
చికాగోకు చెందిన అర్కిటెక్టులు పెర్కిన్స్ అండ్ విల్, మెల్‌బోర్న్‌కు చెందిన నిర్మాణ కంపెనీ లైటన్ హోల్డింగ్స్ ఈ భవన నిర్మాణాన్ని తొలుత చేపట్టి కొంతవరకు పూర్తి చేశాయి. తరువాత మరొక కంపెనీ మొత్తం భవనాన్ని నిర్మించింది. త్వరలో శుభ ముహూర్తం చూసుకుని అంబానీ దంపతులు, తల్లి కోకిలాబెన్, వారి ముగ్గురు పిల్లలు ఆకాష్, అనంత్, ఈషాలతో అంటీలియాలో గృహ ప్రవేశం చేయనున్నారు. దక్షిణ ముంబాయి టెక్ట్స్‌ఆల్టామౌంట్ రోడ్డులోని ప్రసిద్ధ కుంబల్లా హిల్స్‌పై 4,532 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఆంటీలియా సర్వ సుఖాలకు, అత్యాధునిక వసతులకు, అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే రీతిలో నిర్మితమైంది. అన్నట్లు ఇక్కడ చదరపు మీటర్ భూమి ఖరీదెంతో తెలుసా 10,000 డాలర్లు మాత్రమే. ఏంటి నోరు వెళ్ళబెట్టారా! అవును ఇది పచ్చి నిజం.
అంటీలియాలోని ఆరు అంతస్తులలో ఒకేసారి 160 కార్లను పార్క్ చేయవచ్చు. ఒక ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల నిర్వహణకు కేటాయించారు. లాబీలో 9 ఎలివేటర్లు ఉన్నాయి. రిక్టర్ స్కేల్‌పై ఎనిమిది పాయింట్ల స్థాయిలో భూ ప్రకంపనలు నమోదైనా చెక్కు చెదరని నాణ్యతలో దీనిని నిర్మించారు. భవనం టెర్రస్‌పై మూడు హెలిప్యాడ్లతో సహా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రం కూడా నిర్మించారు. ఎనిమిదవ అంతస్తులో 50 సీట్లతో కూడిన థియేటర్, హెల్త్ స్పా నిర్మించారు. బహు విధాలుగా సోయగాలు పోతూ నిర్మించిన పలు ఈత కొలనులు అంటీలియాకు ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పవచ్చు. మూడు అంతస్తులలో వేలాది పుష్ప జాతులు, క్రోటన్లతో కూడిన కృత్రిమ వనాలను ఏర్పాటు చేశారు. ఇక స్నోరూంలు, బాల్ రూముల సౌందర్య నగిషీలను ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు.
ముకేష్ అంబానీ ఇక్కడ భవంతిని నిర్మిస్తున్నారన్న వార్తలు రాగానే చుట్టుపక్కల ప్రాంతాలలో భూమి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. దాదాపు రూ.9,000 కోట్ల ఖర్చుతో అంటీలియా గర్వంగా పైకి లేచింది. 2007లో ఇక్కడ ముకేష్ భూమి కొన్నప్పుడు వివాదం చెలరేగింది. ఈ స్థలాన్ని అమ్మిన వక్ఫ్‌బోర్డుకు యాజమాన్య హక్కులు లేవని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. చివరకు ముకేష్ రూ.16 లక్షలు చెల్లించి నిరభ్యంతర పత్రాన్ని పొందగలిగారు. ముంబాయి భవంతులపై హెలిప్యాడ్ల నిర్మాణానికి నావికా దళం అభ్యంతరం పెట్టింది.
శబ్దకాలుష్యం పెరుగుతుందని పర్యావరణ శాఖ కూడా కొర్రీలు వేసింది. ఈ ఆకాశహర్మ్యం పూర్తి కావడానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది. అంబానీ టవర్ ఎంపోరియస్ అనే ముద్దుపేరు కూడా ఈ బహుళ అంతస్తుల భవనానికి ఉంది. దీని నంబర్ 301023. వెరె్సైలెస్ ప్యాలెస్ కంటే గొప్ప ఫ్లోరింగ్‌ను అలంకరించారు. అతిధుల కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తులను కేటాయించారు. ఈ భవంతి ఏ ఒక్క గది ఇంకోదానిలా కనిపించకపోవడం విశేషం.కాగా ఈ భవనం ఎక్కిచూస్తే ముంబాయి నగర సౌందర్యం కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.
ఇటీవలే ఎంపిక చేసిన అతి కొద్ది మంది సన్నిహితులను, వివిఐపిలను ముకేష్ తన ఇంటికి ఆహ్వానించి చూపించారు. ముకేష్ పొరుగునే కుమార్ మంగళం బిర్లా ఉంటున్నారు. ఆయన ఆంటీలియా గురించి చెబుతూ తాను ప్రపంచంలో అనేక గొప్ప భవనాలను, నివాస గృహాలను చూశానని, చివరకు లండన్‌లోని లక్ష్మీ నివాస్ మిట్టల్ గృహాన్ని కూడా సందర్శించానని, వీటన్నింటింలో ఈ భవంతి గొప్పగా ఉందని బిర్లా కితాబునిచ్చారు. ఇక బాల్ రూమును చూస్తే నిర్ఘాంతపోవలసిందేనని వ్యాఖ్యానించారు. ముకేష్ తమ్ముడు అనిల్ అంబానీ దక్షిణ ముంబాయిలోని విలాసవంతమైన ప్రాంతం కుఫీ పెరేడ్‌లో నివసిస్తున్నారు.
ఆకాశహర్మ్యం పేరు : ఆంటీలియా,
ముద్దుపేరు : అంబానీ టవర్ ఎంపోరియస్
చిరునామా : టెక్ట్స్‌ఆల్టామౌంట్ రోడ్డు, నంబర్-301023
కుంబల్లా హిల్స్, దక్షిణ ముంబాయి-400 026
అంతస్తులు : 27
ఎత్తు : 173 మీటర్లు
నిర్మాణ వైశాల్యం : 4 లక్షల చదరపు అడుగులు
స్థల విస్తీర్ణం : 48,780 చదరపు అడుగులు
పార్కింగ్ లాట్ : 600 కార్లకు ఆరు అంతస్తులు
ఎలివేటర్లు : 9
నిర్వహాణ సిబ్బంది : 600 మంది
కృత్రిమ వనాలు : మూడు అంతస్తులు
హెలిప్యాడ్లు : మూడు ప్లస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్
నిర్మాణ వ్యయం : రూ.9,000 కోట్లు
నిర్మాణ కాలం : మూడు సంవత్సరాలు
ఆర్కిటెక్టులు : పెర్కిన్స్ అండ్ విల్ (చికాగో), లెహ్‌టన్ హోల్డింగ్స్ (మెల్‌బోర్న్)
మరికొన్ని
ముకేష్ గృహప్రవేశం!
దేశంలోనే అతి ధనవంతుడైన ముకేష్ అంబానీ కొత్త ఇల్లు పూర్తయింది. ఈ ఇంటి గృహా ప్రవేశం ఈ నెల 28వ తేదీన జరిగే అవకాశం ఉంది.
ఆ రోజు కొందరు ప్రముఖులను ముకేష్ తన కొత్త ఇంటికి ఆహ్వానించారు. 570 అడుగుల ఎత్తు..27 ఫ్లోర్లతో నిర్మించిన ఈ భవంతికి 'యాంటిలా' అని పేరు పెట్టారు (యాంటిలా అట్లాంటిక్ సముద్రంలో ఒక ద్వీపం).
ఆ రోజు కొందరు ప్రముఖులను ముకేష్ తన కొత్త ఇంటికి ఆహ్వానించారు. 570 అడుగుల ఎత్తు..27 ఫ్లోర్లతో నిర్మించిన ఈ భవంతికి 'యాంటిలా' అని పేరు పెట్టారు (యాంటిలా అట్లాంటిక్ సముద్రంలో ఒక ద్వీపం).
మన దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో- అంతర్జాతీయ సంస్థలు హిర్ష్ బెడ్‌నర్ అసోసియేట్స్, పెర్కిన్స్ విల్స్- ఈ భవంతిని డిజైన్ చేశాయి.
ఈ భవంతిలో మొదటి ఆరు అంతస్థులు కేవలం పార్కింగ్ కోసం వదిలేసారు. దీనిలో మొత్తం 160 కార్లను పార్క్ చేసుకోవచ్చు. ఏడో అంతస్థులో ఉన్న లాబీల నుంచి అసలు ఇంటిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎనిమిదో అంతస్థు నుంచి 27వ అంతస్థు దాకా బాల్‌రూమ్‌లు, పౌడర్ రూమ్‌లు, లాంజ్‌లు, ఒక మిని థియేటర్ ఉంటాయి. 27వ అంతస్థును మాత్రం ముకేష్, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాష్, అనంత్, ఇషాల కోసం ప్రత్యేకంగా నిర్మించారు.
ఆ పైన హెలిపాడ్‌లు నిర్మించారు. దీని మీద మూడు హెలికాప్టర్లు దిగటానికి వీలు ఉంటుంది. ఈ భవంతిలో ఒక గదిని పోలి మరొక గది ఉండదు. "నేను లక్ష్మీ మిట్టల్ ఇంటితో సహా అనేక భవంతులు చూశాను. అయితే ముకేష్ ఇంటికి ఇవేమి సాటిరావు. ఈ ఇంటిలో ఒక పికాసో పెయింటింగ్ కూడా ఉన్నట్లు జ్ఞాపకం..'' అని ముకేష్‌కు సన్నిహితుడైన టెలికం కంపెనీ సీఈఓ ఒకరు వెల్లడించారు.
ఈ భవంతిని నిర్మించటానికి ఏడేళ్లు పట్టింది. ఎంత ఖర్చు అయిందనే విషయం ఇంకా కచ్చితంగా తెలియదు. భవంతి నిర్మాణాన్ని ముకేష్ సతీమణి నీతా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటి దాకా ముకేష్- దక్షిణ ముంబాయిలో- సీవిండ్ అనే బంగ్లాలో నివాసం ఉంటున్నారు.

No comments:
Post a Comment