ఇద్దరు సోదరులు.. ఒక కల.. ఏమిటా కల ? ఎంతో అసాధ్యమైన కల !
మనిషికి రెక్కలు పొదిగి ఆకాశంలో ఎగిరేలా చేయాలని. పక్షులు ఎగురగలుగుతున్నప్పుడు మనిషి మాత్రం ఎందుకు ఎగరలేడు ?
పోనీ మనిషి కాకపోతే. ఏదైనా యంత్రం ఎగరొచ్చు కదా !! దాంతో పాటు మనిషి కూడా ఎగరొచ్చు కదా !
ఇది ఆ సోదరుల కల. రైట్ సోదరుల కల.
మనకు రెక్కలనిచ్చి గగన యాత్ర అనుభవాన్ని అందించిన మహాశయులు రైట్ సోదరులు.
బెంగళూర్‌లో బ్రేక్‌ఫాస్ట్, లండన్‌లో లంచ్, డిన్నర్ ఢిల్లీలో నేడు మనం చేయగలుగుతున్నామంటే అది రైట్ సోదరుల కలలు, ప్రజ్ఞాపాటవాల వల్లనే మనకు అందుబాటులోకి వచ్చాయి. కలలు, గమ్యాలు, ఆ కలల సాకారానికి వినియోగపడే పద్ధతులు- అన్నీ ఏకమైతేనే వాటికో రూపం వచ్చి అవి నిజాలయ్యేవి. లేకుంటే పగటి కలలుగా నిల్చిపోతాయి.
పగటి కలల గురించి తెల్సిందే కదా మనకు. పగటి కలలు అనగానే చప్పున నా మదిలో మెదుల్తుంది ముల్లా నసీరుద్దీన్ గారి పగటి కలలు. ముల్లా నసీరుద్దీన్ హాస్యానికి, కొంటె పనులకు మారుపేరు. మన తెనాలి రామకృష్ణుడిలాగా. ముల్లా నసీరుద్దీన్ గురించి పలు కథలు, అనేక భాషల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకరోజున ముల్లా నసీరుద్దీన్ తన గాడిద మీద ప్రయాణం చేస్తూ తన పగటి కలల ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు... పంచరంగుల కలలు.
తను వ్యాపారవేత్తనవుతానని, నాలుగు దుకాణాలు కొని, వాటిల్లో చెప్పుల షాపు, కుండల షాపు, టైలర్ షాపు, జంతువుల స్వారీకి ఉపయోగించబడే సీట్లు కుట్టే షాపును పెడదామనుకున్నాడు. ప్రతి షాపులో ఇద్దరు పనివాళ్లను పెట్టి వ్యాపారాభివృద్ధి చేసి హాయిగా రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భార్యలతో, నలుగురు అబ్బాయిలతో జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుని ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు అందమైన అమ్మాయిల్ని తెచ్చి పెళ్లిళ్లు చేయాలనుకొన్నాడు.
కలలంటూ మొదలయ్యాక అవి అనంతంగా అల్లుకుపోతూనే ఉంటాయి కదా. అదే జరిగింది. మన ముల్లా నసీరుద్దీన్‌కు కూడా. కలలు అల్లుకుంటూ పోతున్నాడు. మనవలు, మనవరాళ్లు. తనను పట్టించుకోకుండా తన కలల లోకంలో విహరిస్తున్న ముల్లాను చూచింది ఆయన స్వారీ చేస్తున్న గాడిద. 'చిన్న గమ్మత్తు చేస్తేనో' అనుకుంది.
ఎదురుగా చిన్న గుంట, దాన్ని దాటటానికి ఒక చిన్న వంతెన కనబడ్డాయి.. వంతెనను వదిలి ఒక్కసారి ఆ గుంట మీద నుంచి అమాంతం దూకితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో కదా అనుకుని వెంటనే దూకేసింది. గాడిద గుర్రం కాదు కదా. పగటి కలలు నిజాలు కావు కదా.
అంతే గుంటలో పడిపోయింది గాడిద, దాంతో పాటు అనంతంగా పగటి కలలు కంటున్న మన ముల్లా నసీరుద్దీన్ గారు.
నడ్డి విరిగిందని వేరే చెప్పాలా !? పగటి కలల ప్రయోజనం ఇంతేనని మనకు ముల్లా చెబుతున్న నీతి కథ.
మన రైట్ బ్రదర్స్ కలలు పగటి కలలు కావు. చిన్నతనం నుంచి వారితో పెరిగిన ఒక గాఢమైన కోరిక. నడిచే మనిషిని విమానంలో కూర్చొపెట్టి ఎగురవేయాలనే తపన.
ఆర్‌విల్ రైట్ , విల్బర్ రైట్ .
విల్బర్ 1867లో ఆర్‌విల్ 1871లో పుట్టారు. వీరు కాక మరో ఐదుగురు సంతానం వారి తల్లిదండ్రులకి. అతి సామాన్యమైన కుటుంబం. తండ్రి మిల్టన్ రైట్ చర్చిలో బిషప్‌గా పనిచేస్తుండేవాడు. అందరిలోకి ఆర్‌విల్ చాలా అల్లరివాడు. చేస్తున్న అల్లరి పనులకు ప్రతిఫలంగా ఒకసారి స్కూల్లోంచి తీసేయబడ్డాడు కూడా.
అయితే అన్నదమ్ములిద్దరికి ఎగిరే పక్షులన్నా, అవి ఆకాశంలో ఎగురుతూ చేసే అద్భుతాలన్నా, విన్యాసాలన్నా ఎంతో మక్కువ. గంటల తరబడి రకరకాల పక్షుల ఆకాశయానాన్ని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండేవారు. ఏ ప్రక్రియ వల్ల పక్షులు నేల మీద నుంచి ఆకాశంలోకి ఎగురగలుగుతున్నాయి, ఎలా తమ రెక్కల ఉపయోగం ద్వారా దిశలు మార్చగలుగుతున్నాయో సునిశితంగా పరీక్షించేవారు. అవి ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాయో పరీక్షించేవారు. ఆకాశయానంలో ఎగురుతున్న పక్షులకు గాని యంత్రాలకు గాని వాటి బ్యాలెన్స్, క ంట్రోల్ ఎంతో ముఖ్యమని గమనించారు.
1878లో విల్బర్, ఆర్‌విల్ సోదరులకు వారి తండ్రి ఒక బొమ్మ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది ప్రతి చోట సర్వసాధారణంగా లభ్యమయ్యే బొమ్మ హెలికాప్టర్. రబ్బరు బెండు, పేపర్, వెదురు ముక్కలతో చేసిన హెలికాప్టర్. ఒక అడుగు పొడుగు మాత్రమే.
విహంగ యానం మీద ఎంతో మక్కువ పెంచుకున్న రైట్ సోదరులకు తండ్రి ఇచ్చిన ఈ సామాన్య బహుమతి వాళ్ల సృజనాత్మకను మేలుకొలిపింది. వారి కలలకు ఒక రూపం ఒక గమ్యం ఏర్పడినాయి. సైకిల్ షాపు తెరిచారు. ఆ రోజుల్లో అమెరికాలో సైకిళ్లంటే విపరీతమైన మోజు ఉండేది. సైకిళ్లను అమ్మటమే కాదు రిపేర్లు చేసే కూడా చేసేవాళ్లు. 1896లో తామే సైకిళ్లను తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారు. ఇదంతా డబ్బు సంపాదించాలనే తపనతో కాదు, తమ కల ఏరోప్లేన్‌ను కనుగొనే కలను సాకారం చేసుకోవటానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవటానికై. ఇంతేకాదు, సైకిల్‌కు ఎగిరే విమానానికి ఎన్ని పోలికలున్నాయో గ్రహించారు రైట్ సోదరులు. సైకిల్ నడపాలంటే కంట్రోల్ ఎంతో అవసరం కదా.
అలాగే విమానానికి ఎంతో అవసరం ఈ కంట్రోల్. పైగా సైకిళ్ల ఉత్పాదనలో, వాటి మరమ్మత్తులలో, యంత్రాల నిర్మాణం వాటికి అవసరమైన నేర్పును నేర్చుకున్నారు. తర్వాత కాలంలో వారు తమ గ్లైడర్సును విమానాలను తయారు చేస్తున్నప్పుడు ఈ సైకిళ్ల తయారీ అనుభవం ఎంతో మేలు చేసింది వారికి. 14 మే 1908న రైట్ బ్రదర్స్ ఎంతో కాలంగా శ్రమించిన విమానం ప్రయాణికులతో ఎగరటానికి సిద్దమైంది.
అయితే 17 సెప్టెంబర్‌న ఓ విమాన ప్రమాదం జరిగింది. ఆర్‌విల్ రైట్ ఆ ప్లేనుకి పైలట్. ఆ విమానంలో ఒక ప్రయాణికుడు సిగ్నల్ కార్ప్స్ లెఫ్టినెంట్ థామస్ సెల్ఫ్‌రిడ్జ్ ఉన్నారు. విమానం కూలిపోయింది. ఆర్‌విల్ బతికి బట్టకట్టాడు. థామస్ సెల్ఫ్‌రిట్జ్ మరణించాడు.
ఈ దుర్ఘటన వారిలోని పట్టుదలను ధృడపరిచింది . మరెంతో శ్రమించారు.
1909లో అమెరికా ప్రభుత్వం తమ మొదటి విమానాన్ని కొనుగోలు చేసింది. అది రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం. ఆ రోజుల్లో ఆ విమానం ధర 25 వేల డాలర్లు.
ఇక అక్కణ్ణుంచి అన్నీ విజయాలే.
1911లో ఖండాంతర ప్రయాణం చేయగలిగిన విమాన సృష్టి. అమెరికాని దాటటానికి ఆ విమానానికి 84 రోజులు పట్టింది. 70 సార్లు ఆగింది.
1912లో మెషిన్‌గన్‌ను అమర్చిన ప్లేన్‌ను ఆవిష్కారం.
1914లో ఆర్మీలో ఒక చిన్న ఎయిర్‌ఫోర్సు విభాగం ఏర్పాటు జరిగింది.
ఒక్కసారి ఆలోచించండి...
ఎక్కడి ఆటబొమ్మ హెలికాప్టర్ !!
ఎక్కడి ఎయిర్‌ఫోర్స్ విభాగం !!
కేవలం 30 ఏళ్లలో మనిషి ఎగ రటం మాత్రమే నేర్చుకోలేదు. తాను ఎగిరే విమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకోగలిగాడు. జయహో రైట్ సోదరులారా ! ప్రపంచానికి ఒక కొత్త వేగాన్ని ఒకే జీవిత కాలంలో ఎన్నో జీవితాల అనుభవాన్ని పొందుపరుచుకునే శక్తిని మానవ జాతికి ఇచ్చారు రైట్ సోదరులు.
కలలు కనటమే కాదు... ఆ కలల సాకారానికై స్ఫూర్తి, శ్రమే కాకుండా డబ్బు కావాలి. దీన్ని రైట్ సోదరులకి వారి సైకిళ్ల వ్యాపారం చేకూర్చింది. కలలు కనే ప్రతి వారికి వాటి సాకారానికై కొన్ని సూత్రాలు పద్ధతులు ఎంతో అవసరం. గత వారాల్లో నిర్మా కర్సన్ భాయ్, సర్ సివి రామన్, ధీరూభాయ్, ముద్రా గురించి ముచ్చటించుకొన్నాం. వీరి విజయాలు, ఇతరుల విజయాలను పరిశీలించగా, వీరందరూ క్రింద పొందుపర్చిన అన్ని పద్ధతులను కాని లేక వాటిలో కొన్నింటినైనా గాని అమలు పరచి వారివారి కలలను సాధించగలిగారు.
పెద్దపెద్ద కలలు కనటం
ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా మారటం
పాజిటివ్ థృక్పధం అలవరుచుకోవటం
అసాధ్యాలంటూ ఏదీ ఉండవనే నమ్మకం పెంచుకోవటం
పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు అనే ధృడ విశ్వాసం
కలలను, గమ్యాలను విడనాడక పోవటం
సహచరులపై ధృడమైన నమ్మకం, విశ్వాసాలను పెంచుకోవటం
సవాళ్లను ఆహ్వానించటం
సర్వేజనా సుఖినోభవంతుపై నమ్మకం
ఇది ఒకే జీవితం, ఒకే అవకాశం అనే థృక్పధం

-ఎజి కృష్ణమూర్తి
No comments:
Post a Comment