అందగత్తెల పోటీల్లో సౌందర్యరాశులంతా మాటల్లో ‘సేవాభావం’ కురిపిస్తారు.తరువాత బాలీవుడ్ లోనో, హాలీవుడ్ లోనో ప్రత్యక్షమవుతుంటారు. మరికొంత మంది వాణిజ్య ప్రకటనల షూటింగ్‌లతో, షోరూంల ప్రారంభోత్సవాలతో తీరిక లేకుండా ఉంటారు. అయితే బ్రిటిష్ యువరాణి డయానా వంటి వారు బహు అరుదుగా మాత్రమే సమాజసేవలో నిమగ్నమవుతారు. ఇటువంటి వారి కోవలోకే జోర్డాన్ రాణి రానియా చేరుతారు. మహిళల, బాలల హక్కుల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. కేవలం మాటలతో కాదు.. కట్టుబాట్లను ఎదిరించి చిన్నారులకు చేయూతనిస్తున్నారు.మహిళలను ఆదుకునేందుకు తనవంతు సాయం అందిస్తున్నారు.
అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్న రానియా రాజుల కుటుం బంలో జన్మించలేదు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచే వచ్చారు. కువైట్‌లో స్థిరపడిన పాలస్తీనీయుల కుటుంబంలో పుట్టింది రానియా.తండ్రి వైద్యుడు.చిన్న ప్పటి నుంచే చదువులో అమిత ప్రతిభపాటవాలు చూపిన ఆమె కైరోలోని అమెరికన్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొన్నాళ్లు సిటీ బ్యాంకులో ఉద్యోగం చేశాక యాపిల్ కంపెనీకి మారింది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక పార్టీకి వెళ్లడమే రానియా జీవితాన్ని మార్చేసింది. ఆపార్టీకి వచ్చిన జోర్డాన్ యువ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్‌తో కలిసింది.సరిగ్గా ఐదునెలలు తిరిగే సరికి వాళ్ళ పెళ్లయి పోయింది. తర్వాత కొద్ది రోజులే అబ్దుల్లాకు జోర్డాన్ రాజుగా పట్టాభిషేకం జరిగింది. అలా మూడుపదుల వయసు నిండక ముందే ఒక దేశానికి మహారాణి అయింది రానియా.
చిన్నప్పటి ఆలోచనలు...
అరబ్ దేశాలలో మహిళలూ చిన్నపిల్లల కష్టాలను చూస్తూ పెరిగిన రానియాలో బాల్యం నుంచే ఎన్నో ఆలో చనలు. రాణి అవగానే తన ఆలోచనలు అమల్లో పెట్టేం దుకు గొప్ప అవకాశం వచ్చిందని అర్థమైందామెకు. వెం టనే జోర్డాన్‌లోని అన్ని పాఠశాలల్లోనూ విద్యాసంస్కరణలు ప్రారంభించేలా రాణి హోదాలో చర్యలు తీసుకుం దామె. భర్త కూడా అందుకు సహకరిం చడంతో రానియాకు మరింత ప్రోత్సాహం లభించినట్ట యింది. మహిళల హక్కును కాలరాసే కట్టుబాట్లకు వ్యతిరేకంగా గొంతెత్తింది.‘జోర్డాన్ రివర్ షౌండే షన్’ పేరుతో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించి మహిళల, పిల్లల సంక్షేమం దిశగా కృషిచేస్తోంది.
బెదిరింపులు వచ్చినా...
ఎంత మహారాణి అయినా, సంప్రదాయాలనూ కట్టు బాట్లనూ దాటి ఒక మహిళ ఇలా నలుగుర్లోకీ రావడం, వాటికి విరుద్ధంగా గొంతెత్తడం అక్కడి మతఛాందసవా దులకు నచ్చలేదు. వారి బెదిరింపులను ఖాతరు చేయ కుండా ధైర్యంగా తాను ఎంచుకున్నబాటలోనే నడుస్తోం ది రానియా. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్దెనిమి ది అంతర్జాతీయ సంస్థల్లో సభ్యురాలిగా కీలక పాత్ర పోషిస్తోంది. యునైట్‌డ్ నేషన్స్ ఫండ్, యునిసెఫ్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, ఇంటర్నే షనల్ యూత్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అసిస్టెన్స్ వంటి ప్రముఖ సంస్థల్లో ఇప్పుడు రానియా సేవలు కీలకం. ఆమె సేవలకు మెచ్చి జోర్డాన్ ప్రభుత్వం గౌరవ కల్నల్‌హోదా కూడా ఇవ్వడం విశేషం.
మంచి తల్లిగా...
అంతర్జాతీయంగా ఎన్నో సంస్థల్లో సభ్యురాలైనా ఆ వ్యవహారాల్లో ఎంత మునిగినా, తన పిల్లల విషయంలో మాత్రం తల్లిగా అన్ని బాధ్యతలూ చక్కగా నిర్వహిస్తుంది రానియా. ‘ఒక దేశానికి రాణి అనే హోదా కన్నా నా పిల్లలకు గోరుముద్దలు పెట్టడం, వాళ్లతో ఆడుకోవడం, జోకొట్టి నిద్రపుచ్చడం.. .వీటిలో ఉండే ఆనందం నాకెంతో అపురూపంగా అనిపిస్తుంది’ అని రానియా చెబుతుంది. ఇలా చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో కనిపించే మెరుపులకు వెలకట్టడం అసాధ్యం.
వెబ్‌సైట్‌తో శ్రీకారం...
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తాలూకూ సౌకర్యా లను అందిపుచ్చుకోవడంలోనూ వాటిని ఉపయో గిం చుకుని తన భావాలను ప్రపంచానికి చాటడంలోనూ రానియాది ఎప్పుడూ ముందంజే. దీనికి సొంత వెబ్ సైట్‌తో శ్రీకారం చుట్టిన రానియా గతేడాది యూట్యూబ్ లోనూ ఓ వెలుగు వెలిగింది. యూట్యూబ్‌లో ఆమె వీడి యోలను 30 లక్షల మందికి పైగా చూడటం అందుకు నిదర్శనం. ఫేస్‌బుక్‌లోనూ రానియాకు ఎంతో ఆదరణ. ఇక ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్త ఆదరణ పొందు తున్న మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లోనూ అడుగు పెట్టిం దామె. అందులో నిత్యం ఆమె రాసే పోస్టులకు చూసేవారి సంఖ్య తొమ్మిది లక్షల యాభైవేలకు పైమాటే!
No comments:
Post a Comment