సొంత ఇంటి కల నిజం ఒకప్పుడు నగరాల్లో నివసించే మధ్యతరగతివారు సొంత ఇల్లు ఉండాలని కలలు కనేవారు. ఆ కలలను నెరవేర్చుకునేవారుకూడా. కానీ రెండుమూడు దశాబ్దాలుగా దాదాపు అన్ని నగరాల్లో అపార్ట్‌మెంట్లు వచ్చేశాయి. కనుక ఇల్లు కొనుక్కోవడం అంటే ఒక చిలకపంజరం కొనుక్కోవడంగా తయారయ్యింది. ఈ ఫ్లాట్ల సంస్కృతి నగరాలనుంచి చిన్న చిన్న పట్నాలకు సైతం వ్యాపించింది. ఈ నేపథ్యంలోనే నగరానికి దగ్గర్లో, నగరం పొలిమేరల్లో విల్లా సంస్కృతి ప్రవేశపెట్టారు రియల్టీ వ్యాపారవేత్తలు. సొంత ఇల్లు కావాలని కలలు గనే ధనమున్నవారు ఆపై వర్గంవారు తమ కలలను నిజం చేసుకోవచ్చు.
పెద్దపెద్ద నగరాల్లో విల్లాల కథనం.....
చెన్నైలో, ఏడాది క్రితం ప్రాపర్టీ డెవలపర్లు మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. వారి ఫ్లాట్లు అమ్ముడు పోలేదు. నిర్మాణంలో ఉన్న పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. కానీ 2010లో ఉన్నట్టుండి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఫ్లాట్లు చాలా మేరకు అమ్ముడుపోయాయి. మిగతావి బుక్ అయ్యాయి. ముఖ్యంగా నగరంలోని ఓఎంఆర్ ప్రాంతంలోని ఐటి కారిడార్‌లో నివాసగృహాల అపార్ట్‌మెంటులు, ఐటి ఆఫీసుల భవనాలు మొత్తంగా అమ్ముడు పోయాయి. ఐటి ప్రదేశం ఇప్పటికీ ఖాళీగానే ఉన్నప్పటికీ ఓఎంఆర్‌లో కొత్త నివాస గృహాల పథకాలు ప్రారంభించాలని చాలామంది బిల్డర్లు భావిస్తున్నారు. సుందరమైన ఇసిఆర్(ఈస్ట్‌కోస్ట్ రోడ్), దీనికి సమాంతరంగా ఉన్న ఓఎంఆర్ లలో గత కొద్దినెలలుగా వివిధ బిల్డర్లు ఉన్నత స్థాయి విల్లా (భవంతులు)పథకాలు చేపట్టారు. ఈ రెండురోడ్లలో నివాసగృహాల పథకాలకంటే కొత్తగా తలపెట్టిన విల్లా పథకాలు ఎక్కువసంఖ్యలో ఉన్నాయి. ఈరెండు రోడ్ల మధ్య దూరం ఒక కిలోమీటరే. విశ్రాంతి హోమ్స్, చైతన్య బిల్డర్స్, క్రిష్ణ కన్స్‌ట్రక్షన్స్, ఒలంపియా గ్రూపు, అరిహంత్ ెఫౌండేషన్స్, ఇండస్ ఫౌండేషన్స్, శ్రీ ప్రొమోటర్స్, సాగాస్ ప్రమోటర్స్ వంటి అనేక ప్రాపర్టీ డెవెలపర్స్ కనీసం ఒక విల్లా పథకాన్ని ఇసిఆర్ లోగానీ ఓఎంఆర్‌లో గానీ ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు శ్రీపెరంబదూర్-ఒరగడమ్ రోడ్డులో విల్లా పథకాలు ప్రారంభించాయి. ఈ రెండురోడ్లలో ప్రారంభించిన విల్లా పథకాల సంఖ్య అనూహ్యమైంది. చెనై్నలో ఎన్నో అపార్ట్‌మెంటు పథకాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ సగటు చెనై్నవాసి సొంత ఇల్లు ఉండాలనే కోరుకుంటాడు. కనుక విల్లాస్ లేక ఇళ్ళ వరుసకు విపరీతమైన డిమాండు ఉందని స్కౌలైన్స్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, ప్రమోటర్ సంజయ్ ఛుగ్ అంటున్నారు. నగరం లోపల భూవిలువ అనూహ్యంగా ఉన్నందువల్ల నగరం పొలిమేరల్లో విల్లా పథకాలు వస్తున్నాయని ఆయన ఆన్నారు. ఈ విల్లాలు ఒకే కాంపౌండ్‌లో నిర్మిస్తారు. రోడ్లు, లైట్లు, క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్, పార్టీహాల్, జిమ్- అన్ని సదుపాయాలూ ఉంటాయి.
ఈ భావన ఢిల్లీలో, జాతీయ రాజధాని ప్రాంతంలో జనాదరణ పొందింది. చెన్నైలో కూడా మెల్లిగా ఊపందంకుంటోంది. ఈ విల్లాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం, ఈ పథకాలు సమాజంలో ఉన్నత వర్గాలవారికోసం నిర్మిసున్నారు. ఒక్కో విల్లా 2,000 చదరపుటడుగులునుంచి 4,000 చదరపుటడుగులు కలిగివుంటుంది. . 3లేక 4 బెడ్‌రూంలుంటాయి. ఒక్కో విల్లా ధర రూ.1.0 కోట్లనుంచి రూ.3.0 కోట్ల వరకూ ఉంటుంది. ప్రతిభారతీయుడు కనీసం ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని కలలు కంటాడు. ఈ దృష్ట్యా చాలా కాలంగా చెనై్నవాసులు సొంత ఇల్లు కొనడానికే ఇష్టపడతారు. కానీ జీతంతో బతికే మధ్యతరగతివారు ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో గత కొద్ది దశాబ్దాలుగా అపార్ట్‌మెంటులు నగరమంతటా వెలిశాయి. ఒక మార్కెట్‌గా మద్రాసు చిరకాలంగా సొంత ఇల్లే కోరుకుంది. నగరంలో చాలామంది అపార్ట్‌మెంటు కొనాలని భావించినప్పటికీ ఇప్పుడు రెండవ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని అరిహంత్ ఫౌండేషన్స్ వారి కమల్ లూనావత్ అంటున్నారు.
ఇల్లుకొనాలనుకుని ఫ్లాటు కొనుక్కున్నవారు ఇపుడు సొంతింటి కోర్కె తీర్చుకోవడంకోసం నగరం పొలిమేరల్లో విల్లా కొనాలని భావిస్తున్నారు. కొత్తగా ఆవిర్భవించిన ధనిక వర్గం వల్ల విల్లాలకు డిమాండ్ వచ్చిందని ఒలింపియా గ్రూపువారి అజిత్ చోర్డియా అంటున్నారు. విల్లాలో ఏకాంతం, భద్రత, అన్ని సదుపాయాలూ ఉంటాయని ఆయన అంటున్నారు. మరోవైపు, విల్లాస్(జి1) తీసుకుంటే ఒక ఎకరం భూమిలో ఏడు విల్లాలు నిర్మించవచ్చని, 18నెలల్లో నిర్మాణం పూర్తిచేయవచ్చనీ ఆయన అంటున్నారు. విల్లాలకు డిమాండు ఒక్క చెనై్నకి మాత్రమే పరిమితమై లేదని బెంగళూరు, కోల్‌కతా నగరాలు కూడా ఈరంగంలోకి ప్రవేశించాయనీ, బెంగళూరులో కూడా నగరం పొలిమేరల్లో నిర్మించిన విల్లాలు చప్పున అమ్ముడుపోతాయనీ చోర్డియా తెలియజేస్తున్నారు. బెంగళూరులో విల్లాలకు 25నుంచి 30శాతం డిమాండు ఎన్‌ఆర్‌ఐల వల్ల ఏర్పడుతోంది. రమారమి 60శాతం విల్లాలు వ్యక్తిగతమైన వాడుక కోసం అంటే పదవీవిరమణ చేసిన తరువాత స్థిరపడ్డానికి కొంటున్నారు. కాగా40 శాతం విల్లాలు పెట్టుబడి రూపేణా కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాలు మునపటి ఇన్ఫోసిస్ ఉద్యోగి, ప్రస్తుతం ఎడిఫిస్ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ థార్డ్ తెలియజేస్తున్నారు. బెంగళూరులో ఎం.జి రోడ్డు నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో బెంగళూరులో విల్లాలకు అనూహ్యమైన డిమాండ్ ఉండగా సప్లై చాలా పరిమితంగా ఉంది. నగరం విస్తరించే కొద్దీ పొలిమేరల్లో విల్లాల కుండే డిమాండ్ పూర్తవుతుంది.

దీనికి సుమారు ౫ ఏళ్ళుపట్టవచ్చు. ఇప్పటి పరిస్థితులను బట్టిచూస్తే యెలహంకాలో విల్లా పథకాలకు మంచి డిమాండు వుంది. ఇప్పటికే నగరం సరిహద్దులోనే ఒలింపియా వారివి రెండు విల్లా ప్రాజెక్టులున్నాయి. అవి పూర్తయ్యేనాటికి వాటి ధర మరో 20శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. కలకత్తా మాటకొస్తే, అక్కడ విల్లా సంస్కృతి రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. గంగ ఒడ్డున రైచక్ లో అంబుజా రియాల్టి(అప్పుడు బెంగాల్ అంబుజా)విల్లా పథకం ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఒక లక్షరీ రిసార్ట్, 7స్టార్ హోటల్, శ్యామొలిమా,పఖిరాలయ, నివాస బంగళాలు, బంగ్లా కుటీర్ నిర్మించింది. ఎఫ్ ఫోర్ట్ ఒక్కొక్కటీ ఏడాది తరువాత ఏడాది నిర్మితమయ్యాయి. కలకత్తాలో ప్రధాన కార్యాలయం ఉన్న అంబుజా రియాల్టీ, గంగా ఆవాస్ విల్లా పథకాన్ని తలపెట్టింది. ఇందులో 90 విల్లాలుంటాయి. బంగళాలు, అపార్టుమెంటులు ఉంటాయి. ఈ పథకం నిర్మాణం కోసం అంబుజా రూ.30 కోట్లు వెచ్చించనుంది. తన విల్లా పథకం గురించి అంబుజా ఉత్సాహంగా ఉన్నప్పటికీ మరో రియాల్టీ డెవెలపర్ బ్లూచిప్ ప్రాజెక్ట్‌స మాత్రం కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. కలత్తాలో స్థలం లేదు. ముంబై, చెనై్న లాగా సముద్రతీరంగానీ కొండప్రాతంగానీ లేదు.
ఇతర ఆకర్షణీయమైన స్థావరాల్లేవు. కార్పొరేట్ సంస్థలు తమ ఉన్నతాధికారులకోసం విల్లాలను లీజుకు తీసుకుంటాయి. వారు కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకోవడం కోసం విల్లాలు ఎంతగానో ఉపయోగపడతాయని బ్లూ చిప్స్ ప్రాజెక్ట్‌స మేనేజింగ్ డైరెక్టర్ రిత్విక్ దాస్ అంటున్నారు. ఇతర నగరాల్లో కంటే ముందే కోల్‌కతాలో విల్లా పద్ధతి మొదలైంది. కలకత్తాలో గతంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఝార్‌గ్రాం,శాంతినికేతన్, దేవ్‌ఘర్ వంటి ప్రాంతాల్లో విశాలమైన విల్లాలు కలిగివుండేవారు. కానీ ఈ ప్రాంతాల్లో మునుపున్నంత భద్రత లేదని తెలుస్తోంది.

No comments:
Post a Comment