Friday, April 29, 2011

రాయల్‌ వెడ్డింగ్‌.. కళ్యాణం.. కమనీయం

rayalweding1బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్‌(28) వివాహం కేట్‌ మిడిల్‌టన్‌(29)తో శుక్రవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబ్బేలో అంగరంగ వైభవంగా జరిగింది. బ్రిటన్‌ ప్రధానమంత్రి డేవిడ్‌ కామరూన్‌ దంపతులతో సహా పలువురు ప్రముఖులు ఈ రాయల్‌ వెడ్డింగ్‌కు హాజరై మురిసి సిపోయారు. ఎంతకాలంగానో వేచిచూస్తున్న ప్రిన్స్‌ విలియమ్‌ వివాహాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వివిధ టివి ఛానెల్స్‌లో తిలకించి మైమరచిపోయారు. బ్రిటన్‌ రాజవంశంలో 30 ఏళ్ల తర్వాత ఈ వివాహం జరగడం విశేషం. మూడు దశాబ్దాల క్రితం ప్రిన్స్‌ విలియమ్‌ తల్లిదండ్రులైన ప్రిన్సెస్‌ డయానా, ప్రిన్స్‌ ఛార్లెస్‌ల వివాహం తర్వాత బ్రిటన్‌ రాజవంశంలో ఇంత వైభవంగా జరిగిన పెళ్లి ఇదే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా బ్రిటన్‌లో జోరుగా పార్టీలు జరిగాయి.


శోభాయమానంగా...

rayalwedingప్రిన్స్‌ విలియమ్‌ మెరిసే స్కార్లెట్‌ మిలిటరీ వస్త్రాల్లో వివాహ వేదిక అయిన లం డన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బేకు హుందాగా నడుచుకుంటూ విచ్చేశారు. ఆయనతో పాటు అతని సోదరుడు ప్రిన్స్‌ హ్యారీ బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి వచ్చారు. అనంతరం దాదాపు 45 నిమిషాల తర్వాత పెళ్లి కూతురు కేట్‌ మిడి ల్‌టన్‌ పొడవైన లేస్‌లు, స్లీవ్స్‌తో కూడిన ఐవరీ, వైట్‌ సాటిన్‌ వెడ్డింగ్‌ డ్రెస్‌లో సిగ్గులొలికిస్తూ విచ్చేశారు.

అనంతరం ప్రిన్స్‌ విలియమ్‌, కేట్‌ మిడిల్‌
టన్‌లు ఒకరి వేలుకు మరొకరు వెడ్డింగ్‌ రింగ్‌ తొడగడంతో వారి వివాహం సంప్రదాయబద్దంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ వేడుక జరిగింది. వేయి సంవత్సరాల పురాతన భవనం వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బే ఈ వివాహంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. స్కాంట్లాం డ్‌లోని సెయింట్‌ ఆండ్రూస్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో డేటింగ్‌ చేసిన కేట్‌, విలియమ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక విలియమ్‌ తల్లి డయానాకు డిజైనర్‌గా వ్యవహరించిన దివంగత కేథరిన్‌ వాల్క ర్‌ ఒకప్పుడు డిజైన్‌ చేసిన సై్క బ్లూ ఊల్‌ కోట్‌లో వధువు కేట్‌ మిడిల్‌టన్‌ తల్లి కెరోల్‌ ఈ వేడుకకు హాజరు కావడం విశేషం.

గుర్రపు బగ్గీలో ఊరేగింపు...
rayalweding4 వివాహానంతరం కొత్త జంట విలియమ్‌, కేట్‌లు అందంగా ముస్తాబు చేసిన గుర్రపు బగ్గీలో వెస్ట్‌ మినిస్టర్‌ నుంచి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు బయల్దేరారు. దారిపొడవున వేలాదిమంది ప్రజలు వారికి చేతులు ఊపుతూ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు చేరుకున్న కొత్త జంట ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం ప్రకారం ప్యాలెస్‌లోని బాల్కనీకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ప్రజలకు దర్శనమిచ్చారు. కొత్త జంట ‘రొమాంటిక్‌ కిస్‌’తో ప్రజలను మురిపించారు.

మూడు దశాబ్దాల క్రితం...
1981, జూలై 29నలో ప్రిన్స్‌ విలియమ్‌ తల్లిదండ్రులు ప్రిన్సెస్‌ డయానా, ప్రిన్స్‌ చార్లెస్‌ల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో వ్యయంతో జరిగిన ఈ వివాహానికి ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అంతకంటే వైభవంగా ప్రిన్స్‌ విలియమ్‌, కేట్‌ మిడిల్‌టన్‌ల వివాహాన్ని నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు చార్లెస్‌, డయానాలు పెళ్ల యిన 15 సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు. 1997లో ప్యా రిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డయానా తీవ్ర గా యాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. తల్లిలేని లోటు ప్రిన్స్‌ విలియమ్‌ను ఎంతో బాధించింది.

rayalweding6 మాతృమూర్తి డయానా జీవితాంతం ప్రిన్స్‌ చార్లెస్‌ హృద యంలో నిలిచిపోయి ఉంటుందని వివాహానికి ముందురోజు ప్రిన్స్‌ చార్లెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి ప్యాడీ హార్వెర్‌సన్‌ పేర్కొన్నాడు. కేట్‌‌‌, ప్రిన్స్‌ విలియమ్‌ జీవితంలో మరచిపోలేని దినంగా ఈ వివాహ వేడుక రోజు నిలిచిపోతుందనీ, ఇద్దరి జీవితాలు ఒక్కటి చేసిన ఈ వివాహ వేడుక బ్రిటన్‌ రాజ కుటుంబంలో అందరినీ సంతోషంలో ముంచెత్తిందని హార్వెర్‌ సన్‌ తెలిపారు.

తిలకించిన రెండు బిలియన్ల ప్రజలు...

ప్రపంచంలోని దాపు మూడవ వంతు జనా భా ప్రిన్స్‌ విలియమ్‌, కేట్‌ మిడిల్‌టన్‌ల వివా హాన్ని తిలకించడం విశేషం. దాదాపు రెండు బిలియన్ల ప్రజలు ఈ వివాహ వేడుకను చూ సి మురిసిపోయారు. టివి ఛానెల్స్‌తో పాటు ఇంటర్నెట్‌లో సైతం ఈ వేడుకను చూశారు.

జీవితాంతం కలిసి ఉండాలి...
rayalweding5 విలియమ్‌, కేట్‌ మిడిల్‌టన్‌లు జీవి తాంతం కలిసి ఉండాలని బ్రిటన్‌ దేశస్థులు కోరుకుంటున్నారు. ప్రిన్స్‌ ఛార్లెస్‌, డ యానాల మాదిరిగా వారు మధ్యలోనే విడి పోకూడదని ఆశిస్తున్నారు. బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో సర్చ్‌, రెస్క్యూ హెలికాప్టర్‌ పైలెట్‌ అయిన 28 సంవత్సరాల విలియమ్‌ బ్రిటన్‌ రాజ కుటుంబానికి ఆశాకిరణంగా మారారు. ఈ కుటుంబంలో గతంలో జరి గిన వివాహ వైఫల్యాలు, కుంభ కోణాల నుం చి ఈ వివాహ వేడుక చరమగీతం పాడాలని రాజ వంశస్తులు కోరుకుంటున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రిన్స్‌ ఫిలిప్‌లు తమ మన వడు విలియమ్‌ వివాహ బంధం చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌ నలుగురి సంతానంలో ముగ్గురి వివాహబంధం విడాకులతో ముగిసింది. ఈసారి తమ మనవడి జీవితం అలా కాకూ డదని ఎలిజబెత్‌ దంపతులు కోరుకుం టున్నారు.

రహస్యంగా కేట్‌ డ్రెస్‌ డిజైనింగ్‌...

rayalweding2పెళ్లి కూతురు కేట్‌ డ్రెస్‌ను చాలా రహస్యంగా డిజైన్‌ చేశారు. ఈ పెళ్లి వస్త్రాలను ఎవరు డిజైన్‌ చేశారో బయటకు చెప్పలేదు. ఇక ప్రిన్స్‌ విలియమ్‌ మిలటరీ డ్రెస్‌ అందరినీ కనువిందుచేసింది. దీంతో ఆయన ఒక మిలటరీ అధికారిగా ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించినట్లయింది. గతంలో క్లబ్‌ పార్టీ బాయ్‌గా ఉన్న ముద్ర దీంతో చెరిగినట్లయి యువతకు హీరోగా నిలిచారు.

ప్రజల కోసం స్ట్రీట్‌ పార్టీలు...
ప్రిన్స్‌ విలియమ్‌ వివాహం బ్రిటన్‌వాసులను ఆనందోత్సాహాల్లో ముంచె త్తింది. ప్రిన్స్‌ వివాహం సందర్భంగా బ్రిటన్‌లోని లండన్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ప్రజల కోసం వందలాది స్ట్రీట్‌ పార్టీలను నిర్వహించారు. తమ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఒక భాగంగా ఈ వివాహ వేడుకలను వారు జరు పుకున్నారు. విలియమ్‌ వివాహాన్ని పురస్కరిం చుకొని బ్రిటన్‌ ప్రభుత్వం శుక్రవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ప్రజలందరూ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. లండన్‌తో పాటు పలు పబ్‌లు ఉదయం నుంచే తెరుచు కున్నాయి. విలియమ్‌ వివాహ వేడుకను పుర స్కరించుకొని వీటిలో బీర్‌తో పాటు ఇంగీ్‌‌లష్‌ బ్రేక్‌ఫాస్ట్‌ను వేడి,వేడిగా సర్వ్‌చేశారు. వీటిలో బీన్స్‌, టోస్ట్‌, ఫ్రైడ్‌ ఎగ్స్‌, బెకాన్‌, సాసేజెస్‌ వంటి రుచికరమైన ఫుడ్‌ ఐటమ్స్‌ ఉన్నాయి.

బ్రిటన్‌ ప్రధాని శుభాకాంక్షలు...
rayalweding3‘ఈ వివాహ వేడుక గుడ్‌ లుకింగ్‌ ప్రిన్స్‌ విలియమ్‌, బ్యూటిఫుల్‌ ప్రిన్సెస్‌ కేట్‌ల జీవితాలను ఒక్కటి చేసింది. ఈ జంట జీవితాల్లో వెలుగులు ప్రసరించిన ఈ వేడుక బ్రిటన్‌వాసులకు జాతీయ పండుగగా నిలిచింది. కొత్త జంట కలకాలం కలిసి ఉండా లని కోరుకుంటున్నాను. ఈ వేడుక జాతినంత టినీ ఒక్కటిగా చేసింది’ అని వివాహ వేడుకకు హాజరైన బ్రిటన్‌ ప్రధానమంత్రి డేవిడ్‌ కామ రూన్‌ అన్నారు. వివాహ వేడుకకు హాజరైన సాకర్‌ క్రీడాకారుడు డేవిడ్‌ బెక్‌హామ్‌, ఆయన సతీమణి విక్టోరియాలు మాట్లాడుతూ రాయల్‌ వెడ్డింగ్‌కు హాజరుకావడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. ప్రిన్స్‌ విలియమ్‌ దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నట్టు వారు చెప్పారు. ఇ ప్రిన్సెస్‌ డయానా స్నేహితుడైన సింగర్‌ జాన్‌ ఎల్టన్‌ మాట్లాడుతూ బాలునిగా ఉన్నప్పుడే ప్రిన్స్‌ విలియమ్‌ తనకు పరిచయమని అప్పుడే అతను ఎంతో బుద్దిమంతునిగా ఉండేవాడని చెప్పారు. డయానాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు విలియమ్‌ తనతో ఎంతో మర్యాదగా మాట్లాడేవాడని అన్నారు. విలియమ్‌ వివాహానికి హాజరై ఆశీర్వదించడం తనకెంతో ఆనందం కలిగించిందని చెప్పారు.

పెళ్లికోసం అఫిషియల్‌ ఫొటోగ్రాఫర్‌...

rayalweding3-vips1 వివాహ వేడుకను అందమైన ఫొటోలుగా మలిచేందుకు విలియమ్‌, కేట్‌లు ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ హ్యూగో బర్నంద్‌ ను అఫిషియల్‌ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికచేశారు. ఆయన వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బేలోని వివాహ వేడుకతో పాటు బకింగ్‌హ్యామ్‌ ప్యాలెస్‌లోని వేడుకల ఫొటోలను అందంగా చిత్రీకరించారు. ప్రిన్స్‌ విలియమ్‌ ఫొ టోలను ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్‌గా బర్నంద్‌ పలు సార్లు తీశారు. ప్రముఖ పొర్ట్రెయిట్‌ ఫొటోగ్రా ఫర్‌గా పేరొందిన బర్నంద్‌ సెలబ్రిటీలు లూసిన్‌ ఫ్రూద్‌, లేడీ థాచర్‌, విక్టోరియా బెక్‌హామ్‌, జాన్‌ మాగ్నర్‌లకు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా చేశారు. ఆయన కాండె నస్ట్‌ పబ్లికేషన్స్‌కు చెందిన హౌస్‌ అండ్‌ గార్డెన్‌ మ్యాగజైన్‌, టాట్లర్‌లకు గత కొంతకాలంగా పనిచేస్తున్నారు.

పార్టీలతో 140 టన్నుల చెత్త...
రాయల్‌ వెడ్డింగ్‌ మూలంగా 140 టన్నుల చెత్త పేరుకుపోయింది. ప్రిన్స్‌ విలియమ్‌ వివాహానంతరం నిర్వహించిన పార్టీలలో పెద్ద ఎత్తున వ్యర్థపదార్థాలు మిగిలాయి. ఈ చెత్తను తొలగించేందుకు ప్రత్యేకంగా 130 సానిటరీ పని వాళ్ల ను 45వేల పౌండ్ల వేతనంతో ఏర్పాటుచేశారు. వివాహ పార్టీలలో దాదాపు అయిదు లక్షల మంది దేశ, విదేశాలకు చెందిన ప్రజలు పాల్గొనడం విశేషం.

హాజరైన ప్రముఖులు...
rayalweding3-vipsవివాహ వేది అయిన లండ న్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబ్బే పలువురు వివిఐపిలతో కిటకి టలాడింది. రాయల్‌ వెడ్డింగ్‌ ను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు హాజ ర య్యారు. వీరిలో బ్రిటన్‌ ప్రధా ని కామరూన్‌ దంపతులు, ్రపముఖ సాకర్‌ క్రీడాకారుడు డేవిడ్‌ బెక్‌హామ్‌, ఆయన సతీమణి అయిన ప్రముఖ డిజైనర్‌ విక్టోరియా, సింగర్‌ ఎల్టన్‌ జాన్‌, మిస్టర్‌ బీన్‌ నటుడు రొ వాన్‌ అట్కిన్‌సన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరేగా కుండా పలువురు సెలబ్రిటీలు ఇక్కడ కనువిందుచేశారు. బ్రిటన్‌ రాజ కుటుంబానికి చెందిన దాదాపు 50 మం దితో పాటు ఇతర దేశాలకు చెందిన రాజవంశస్తుల కు టుంబ సభ్యులు సైతం ఈ వివాహ వేడుకకు హాజరై కనువిందుచేశారు. ఈ వేడులో 1900మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. పలువురు అతిథులకు లండన్‌లోని స్టార్‌ హోటళ్లలో విడిది ఏర్పా టు చేశారు. ఈ సంద ర్భంగా బ్రిటన్‌ రాజవంశ స్తుల నివాస మైన బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ సీ ఆఫ్‌ యూనియన్‌ జాక్‌ జెండా లతో కళకళ లాడింది.

వెడ్డింగ్‌ కేక్‌...
royal-wedding-cakeప్రిన్స్‌ విలియమ్‌, కేట్‌ మిడిల్‌టన్‌లు తమ వెడ్డింగ్‌ కేక్‌ తయారీకి లీసెస్టర్‌షైర్‌కు చెందిన కేక్‌ డిజైనర్‌ ిఫియోనా కెయిర్న్‌‌సను ప్రత్యేకంగా ఎంపికచేశారు. ఆమె వివాహ వేడుక కోసం భారీగా ట్రెడీషనల్‌ ఫ్రూట్‌ కేక్‌ను తయారు చేశారు. బ్రిటీష్‌ ఫ్లోరల్‌ థీమ్‌తో రూపుదిద్దుకు న్న ఈ కేక్‌ను క్రీమ్‌, వైట్‌ ఐసింగ్‌తో అందంగా తీర్చిదిద్దారు. సృజనాత్మకంగా, అందంగా కేక్‌ లను తయారుచేయడంలో పేరొందిన మిసెస్‌ కెయిర్న్‌‌స వెడ్డింగ్‌ కేక్‌ను తనదైన శైలిలో ఆకర్ష ణీయంగా రూపొందించారు. గతంలో ఫియో నా తయారుచేసిన కేకులను చూడడమే కాదు వాటి రుచి చూసిన ప్రిన్స్‌ విలియమ్‌, మిడిల్‌ట న్‌లు ఆమెను తమ వెడ్డింగ్‌ కేక్‌ను ప్రత్యేకంగా రూపొందించాలని కోరారు. ఇక కెయిర్న్‌‌స 25 సంవత్సరాల క్రితం ఇంట్లో కిచెన్‌ టేబుల్‌పై అందమైన కేక్‌లను తయారుచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె లీసెస్టరషైర్‌లో అతిపెద్ద ఆర్ట్‌ బేకరీని ప్రారంభించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. పలువురు సెలబ్రిటీల వేడుకలకు ఆమె ప్రత్యేకంగా కేక్‌లను తయారుచేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు.

వేయి సంవత్సరాల వెస్ట్‌మినిస్టర్‌లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబ్బేకి వేయి సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. పదవ శాత బ్దం మధ్య కాలంలో మొదట దీన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఇందులో వివా హ వేడుకలను నిర్వహిస్తున్నారు. 1066 నుంచి ఈ చర్చి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు, ప్రఖ్యాతులను సంపాదించింది. ప్రస్తుతం ఉన్న చర్చి నిర్మాణాన్ని హెన్రీ-3 రాజు 1245లో ప్రారం భించా రు. చర్చిలోని అరుదైన పెయింటింగ్స్‌, గ్లాస్‌ కళాఖండాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
- ఎస్‌.అనిల్‌ కుమార్‌ 
అనగనగా ఒక రాణి !
ప్రేమకు మారుపేరు... ప్రిన్సెస్‌ ఆఫ్‌ డయానా... గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె అందం.. ఫ్యాషన్‌.. హుందాతనం.. కలబోత డయానా.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. వివాహ బంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో 36 ఏళ్ల వయసుతో ప్రమాదంలో మృతిచెందింది. శుక్రవారం ఆమె కుమారుడు ప్రిన్స్‌ విలియవ్గ్సు, ప్రియురాలు ేకట్‌ల వివాహం.. జరిగింది. ఓ సాధారణ మధ్య తరగతి యువతి... దేశానికి కాబోయే రాజు... సహజంగానే అందరి దృష్టీ ేకట్‌ వైపే.. అందాల రాణి ప్రిన్సెస్‌ డయానాతో పోలికలే..

సహజసిద్ధంగా....
rayalweding2రోడ్డు ప్రమాదంలో 36 ఏళ్ల వయసులో మృతి చెందినా డయానాను ఇప్పటికీ ప్రపంచం ఆమెను మర్చిపోలేదు. ఆమె అందం, హుందాతనం కళ్లను కట్టిపడేస్తూనే వుంది. క్షణాల్లో మారిపోయే ఫ్యాషన్‌కు సైతం కొత్తగా నడకలు నేర్పిన ట్రెండ్‌ సెట్టర్‌ ప్రిన్సెస్‌ డయానా.

ఓ సాధారణ మధ్యతరగతి యువతి ేథరిన్‌ మిడిల్‌ టన్‌.. ముద్దుగా కేట్‌ మిడిల్‌ టన్‌ అని కూడా పిలుస్తారు. కేట్‌ ఎంతో సాధారణంగా కనిపిస్తారు. ఆమె కంటి చూపులు ఎంతో తీక్షణంగా వుంటాయి. అందంలో డయానాతో సరిపోల్చేం దుకు ఏ ఒక్కరు ఇష్టపడనప్పటికీ ఫ్యాషన్‌ను ఫాలో అవ్వడంలో కేట్‌ కూడా డయానాతో పోల్చదగినది. ఇప్పటికే కేట్‌ బ్రిటన్‌లో ఎంతో పేరు పొందింది. ఎక్కడికి వెళ్లినా ఆమెను గుర్తు పట్టే స్థాయికి చేరుకుంది.

ధైర్యమే ఆభరణం...
డయానా మొదటి నుండి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించేవారు. ఆమె భర్త నుండి విడిపోయి ప్రిన్సెస్‌గా ఆమెకున్న పేరును తన నుండి తొలగించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆమె ఏ మాత్రం బాధ పడలేదు. ‘నేను ప్రజల మనసుల్లో మహారాణిగా వుండాలనుకున్నాను. అది ఎప్పుడో జరిగిపోయింది’ అని ఆమె ఎంతో హుందాగా ప్రకటించింది.

Diana-Charles-weddingపది సంవత్సరాల తమ ప్రేమ జీవితంలో కొంత కాలం విలియమ్‌కు దూరంగా వున్న సమయంలోనూ కేట్‌ ఎంతో హుందాగా వ్యవహరించింది. తనకు ఎటువంటి గర్ల్‌ఫ్రెండ్స్‌ లేరు అని విలియమ్‌ చెప్పినప్పుడు కూడా ఆమె దాన్ని మామూలుగానే తీసుకుంది.

వయసు.. పరిణతి....
20 ఏళ్ల వయసులో డయానా స్పెన్సర్‌ పెళ్లి కూతురిగా మారి రాజరికపు కట్టుబాట్లలో బంగారు పంజరంలోకి చేరింది. అతి కొద్ది కాలంలోనే వివాహ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన భర్త మరో స్త్రీతో సంబంధం కలిగి వున్నాడని ప్రకటించి ఆవేదన చెందింది. ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. వివాహ బంధం నుండి విడాకులు తీసుకుని రాజకోట నుండి బయటిి వచ్చింది.

కేట్‌ ఎంతో పరిణతి కలిగిన వ్యక్తిగా హుందాగా ప్రవర్తించడంలో మెలకువలను పాటిస్తోంది. కేట్‌, విలియమ్‌ల కన్నా ఒక సంవత్సరం పెద్దది. పైగా విలియంతో పదేళ్ల పరిచయం‚.. కానీ ఎక్కడా కేట్‌ వివాదాస్సదం కాలేదు. అన్ని సందర్భాల్లోనూ నిలకడగా కనిపించింది. సుదీర్ఘ కాలం అనంతరం పెళ్లికి ముందుగానే బ్రిటన్‌ యువరాణిగా ఆమెకు గుర్తింపు లభించింది.

అడుగుజాడలు...
lady-diana-kate-middletonడయానాకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఐస్‌ స్కేటింగ్‌ కూడా ఎంతో ఇష్టం. కేట్‌కు ఈ రెండిటిలో ప్రావీణ్యం వుంది. పెళ్లికి ముందు మూడు నెలల్లో డయానా ఎంతో సన్నబడిందని ఆమె పెళ్లి డ్రెస్‌ డిజైనర్‌ ఇమ్మానుయేల్‌ తెలియజేశారు. అదే విధంగా కేట్‌ కూడా పెళ్లికి ముందు ఎంతగా సన్నగా మారింది. మరింత అందంగా కనిపిస్తోంది అని ఇమ్మానుయేల్‌ చెబుతున్నారు.

సేవా మార్గంలో...
డయానా సేవా మార్గంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అనేక దేశాల్లో ఆమె పర్యటించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కేట్‌ ఇప్పటికీ వరకు సేవా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన లేదు. ఆమె తన విద్య, ప్రిన్స్‌ విలియంతో ప్రేమ విషయాల్లోనే ఎక్కువగా ఫోకస్‌ అయ్యారు.

ఎవరికి వారే...

rayalweding1డయానా చనిపోయినా ఆమె ఇప్పటికీ బతికే వున్నట్లుగా ఆమె అభిమానులు భావిస్తారు. ఓ సినిమా తారకన్నా ఎక్కువగా ఆమెను బ్రిటన్‌ ప్రజలు ఆరాధించారు. ఆమె అందానికి వారు ఎప్పటికీ అభిమానులే. కానీ కేట్‌ కూడా అందుకు తగిన విధంగా మార్కులుసాధించడంలో చాలా వరకు సఫలమైంది. బ్రిటన్‌ అందాల రాణుల జాబితాలో చేరే అవకాశాన్ని అందుకుంది. రాజ కుటుంబాల్లో 3వ అందెగత్తెగా ఆమె స్థానం సంపాదించుకుంది.

ఎంతో ప్రత్యేకం...
మిడిల్‌ టన్‌, విలియం తల్లి డయానాలను ప్రతి సందర్భంలోనూ పోల్చి చూసే వారే ఎక్కువ. డయానా పెళ్లి సమయంలో వేసుకున్న దుస్తులను, కేట్‌ డ్రెస్‌ను పోల్చి చూస్తే ఎంతో పరిణతి కనిపిస్తోంది అని డయానా డిజైనర్‌ డేవిడ్‌ ఇమ్మానుయేల్‌ చెబుతున్నారు. ‘1981లో డయానా చార్లెస్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు 20. అప్పటికి ఫ్యాషన్‌ పై ఆమెకు అంతగా అవగాహన కలిగే అవకాశం లేదు. ఆమె వయసుకు తగిన విధంగా అప్పటి ఫ్యాష న్‌ ప్రకారం ఆమె డ్రెస్‌ రూపొందించాం. కానీ కేట్‌ ఎంతో పరిణతి చెందిన యువతి. ఆమెకు ఫ్యాషన్‌ మీద అవగాహన వుంది. డయానా కన్నా పెళ్లి నాటికి వయసులోనూ పెద్దదే. కాబట్టి కేట్‌ తనకు ఏది సరిపోతుందో దాన్ని ఎంపిక చేసుకుంది.’ అని అంటున్నాడు.

కొత్త పేరుతో కుస్తీ..
the-signatureమొదటిసారిగా విలియం భార్యగా... రాజ కుటుంబంలోకి అధికారికంగా అడుగు పెట్టేందుకు కేట్‌ ఎంతో సాధన చేసిం ది. స్కూలు పిల్లలా పేపరు పెన్ను పట్టు కుని దిద్దింది. ఎందుకంటే.. అధికారికంగా సంత కం చేసేందుకు... విలియం పెళ్లి రోజున కేట్‌ సంతకం ఎంతో విలువైనది. ఇదే కాదు మరోవైపు ఆమె విలియంతో కలిసి మొదటి సారి డాన్స్‌ చేసేందుకు కూడా ఎంతో సాధన చేసినట్లు సమాచారం. ‘మొదటి సారి ఆమె తన పేరును వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బేలో సంతకాన్ని చేసింది. ఇది చారిత్రాత్మకంగా చరిత్రలో ఆమె పేరు చేరే సంతకం. అందుకే స్కూలు పిల్లల మాదిరి సంతకం చేయడం ప్రాక్టీస్‌ చేసింది’ అని రాచకుటుంబానికి చెందిన వారు చెప్పారు.

ప్రిన్స్‌ విలియం కూడా కేట్‌తో వివాహ అనంతరం మొదటి సారి డాన్స్‌ చేసేందుకు కఠిన మైన సాధననే చేశాడు. ఇందుకు శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. ‘విలియం దృష్టంతా ఇప్పుడు డాన్స్‌ మీద వుంది. పెళ్లికూతురుతో కలిసి డాన్స్‌ చేయడం కోసం అతను ఎంతగానో సాధన చేశాడు’ అని సన్నిహితులు అంటున్నారు. దీనికి తోడు విలియంను రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌లోని ఆయనతోపాటు పనిచేసేవారు దీనిపై ఆటపట ి్టస్తున్నారు కూడా.

కేట్‌ బ్లౌజ్‌ సందడి ..!
Gettylఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమానికి కేట్‌ ధరించిన క్రీం కలర్‌ బ్లౌజ్‌ ఇప్పు డు మార్కెట్లో సందడి చేస్తోంది. ఆమె ధరిం చిన బ్లౌజ్‌ను ఇప్పుడు అధికారికంగా 203 డాలర్లకు విక్రయించనున్నట్లు సమాచారం. సిల్క్‌తో తయారయిన కొల్లార్‌లెస్‌ స్కర్ట్‌, లేసులను వుపయోగించి రూపొందించిన ఈ బ్లౌజ్‌ను2008 బ్రిటిష్‌ క్లాతింగ్‌ స్లోర్‌ కలెక్షన్‌లో తీసుకుంది. కానీ ఈ ఫ్యాషన్‌ ఇప్పుడు అందు బాటులో లేదు. కేట్‌ ధరించిన అనంతరం డిజై నర్లు తిరిగి ఆ తరహా వస్త్రాలను రూపొం దించేం దుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి కూడా రానుంది. ఈ తరానికి కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌ రెడీ అయిందన్నమాట.


పెళ్లికి ముందు ఒంటరి..!
rayalweding12రాచరిక కుటుంబ సంప్రదాయాల మేరకు పెళ్లి కూతురు కేట్‌ పెళ్లికి ముందు రోజు రాత్రి ఒంటరిగా లండన్‌లోని ఓ హోటల్‌లో గడిపింది. కేట్‌ లండన్‌లోని గోరింగ్‌ హోటల్‌ విలాసవంతమైన రాయల్‌ సూట్‌లో వుంది. మిడిల్‌టన్‌ కుటుంబమే దీన్ని ఎంచు కున్నట్లు సమాచారం. విలియంకూడా పెళ్లి రోజు ముందు రాత్రి క్లారెన్స్‌ హౌస్‌లో తన సోద రుడు హారీతో గడిపాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేట్‌ వివాహం ఖరారు కావడంతో కార్యక్రమాలు ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభించారు. విలియం క్లారెన్స్‌ హౌస్‌ నుండి ఉదయం 10.48కి బయల్దేరాడు.


అందగత్తెల సరసన..
diana-kate-redఅన్నిటిలోనూ కేట్‌ను డయానాతో పోల్చి చూస్తూ ఆమె అందాన్ని కూడా అదే విధంగా పోల్చారు. కానీ కేట్‌ డయానాను వెనుకకు నెట్టి రాజకుటుంబాలకు చెందిన అంద గత్తెలలో మూడవ స్థానంలో నిలిచింది. ప్రిన్సెస్‌ డయానా మూడవ స్థానం నుండి నాలుగవ స్థానానికి చేరుకుంది. ‘బ్యూటిఫుల్‌.కామ్‌’ చేపట్టిన సర్వేలో 127,000 మంది దీనిపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇందులో 29 ఏళ్ల కేట్‌కు 84 శాతం మంది అందెగత్తెగా మద్దతునిచ్చారు. మొదటి స్థానంలో మోనాకో ప్రిన్సెస్‌, ఆస్కార్‌ విన్నర్‌ గ్రేస్‌ కెల్లి 91 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచింది. జోర్డాన్‌ రాణి రానియా 90 శాతం మద్దతుతో రెండవ స్థానం లో వుంది. ఇక రాజకుటుంబాల్లోని మగవారికి సంబంధించి స్వీడన్‌ ప్రిన్స్‌ చార్ల్‌ పిలిప్‌ రాజ కుమారుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ప్రిన్స్‌ హారీ, విలియం నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు. వీరి తండ్రి ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ 10వ స్థానంలో (బెస్ట్‌ లుకింగ్‌) నిలి చారు.

ఇందులో మరో విషయాన్ని ప్రస్తావిస్తూ... కేట్‌ మిడిల్‌టన్‌ మిగిలిన వారిలా గొప్ప అందం కాకపోయినా ఆమె స్టైల్‌, నడవడిక ఇవన్నీ కూడా ఆమెను ప్రిన్సెస్‌ గ్రేస్‌, క్వీన్‌ రాని యాల సరసన నిలిపాయి అని విశేషకులు అంటున్నారు. అలాగే ‘బ్రిటీష్‌ రాజరికంలో వచ్చే భవిష్యత్తు తరాలలో మార్పుకు కేట్‌ను సూచకంగా భావించొచ్చు అని కూడా వారు అభిప్రా యపడుతున్నారు.

ఉంగరానికి సవరింపులు...!

ringప్రిన్సెస్‌ డయానా ధరించిన వేలి ఉం గరం కేట్‌ మిడిల్‌టన్‌కు వేలికి పె ద్దగా కావడంతో సఫైర్‌ పొదిగిన వజ్రపు టుంగరానికి మెరుగులు దిద్ది.. కేట్‌ వేలికి సరిపోయే విధంగా మార్చు కుంది. అదనం గా ప్లాటినం బీడ్స్‌ను జత చేయించుకుంది. డయానాకు గౌరవాన్ని ఇస్తూనే తనదైన ముద్రను ఇందులో కేట్‌ చూపించింది. ఆగస్టు 28 1996లో ప్రిన్స్‌ చార్లెస్‌ డయానా వేలికి ఉం గరాన్ని తొడిగారు. సఫైర్‌ పొదిగిన ఈ ఉంగరం ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. అదే ఉంగరాన్ని అమ్మ జ్ఞాపకంగా రాజకుటుంబీకులు వ ద్దని చెబుతున్నా విలియం కేట్‌కు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌గా బహూకరించాడు. ఇది కేట్‌ వేలికి పెద్దది కావడంతో ఆమె నగల తయారీదారులు జి.కొల్లిన్స్‌ అండ్స్‌ సన్స్‌ను ఆ రింగుకు ప్లాటినం బీడ్స్‌ను జత చేసి చిన్నదిగా చే యాల్సిందిగా కోరారు. తన వేలికి తగిన విధంగా మార్పు చేసుకున్నారు. ‘కేట్‌కు ఆ ఉంగరం అంటే ఎంతో గౌరవం వుం ది. దానివల్ల ఎటువంటి పొరపాటు జర గకూడదనే వుద్దేశంతోనే దాన్ని మార్పు చేయించింది’ అని కుటుంబీకులు చెబు తున్నారు. ‘లండన్‌కు కాబోయే రాజుకు భార్యగా ఆమె ఎంతో హుందాగా దాన్ని మార్చారు.’ అని వారు చెప్పారు. ఈ రింగ్‌ విలువ డయానాకు బహుకరించినప్పుడు 32 మిలియన్‌ పౌం డ్స్‌గా వుంది.

ఇప్పుడు దాని విలువ చాలా పెరిగి వుంటుంది. ఈ ఉంగరానికి సంబంధించి విలియం ఒక సారి మాట్లా డుతూ ‘ఈ గొప్ప సందర్భంలో అమ్మ కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో కేట్‌కు బహూకరించాను’ అని తెలిపారు.

కేట్‌ డిజైనర్‌ అలెగ్జాండర్‌ ..!

alexander-mcqueenరాచ పెళ్లి కూతురికి గౌన్‌ను డిజైన్‌ చేసిన వ్యక్తి పేరు తెలిసిపోయింది. మొదటి నుండి అతని వివరాలను బయటికి తెలియ జేయకుండా రహస్యంగా వుంచారు. కానీ కేట్‌ కారు నుండి బయటకు ది గగానే డిజైనర్‌ అలెగ్జాండర్‌ మెక్వ్‌న్స్‌ సారాహ్‌ బర్టన్‌ అని తెలిసిపోయింది. శతాబ్ద కాలంగా ఫ్యాషన్‌ రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ప్రత్యేకంగా, కేట్‌కు తగిన విధంగా డ్రెస్‌ చేశా డని ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసలు కూడా అందుతున్నట్లు తెలుస్తోంది. వస్త్రాలను తయారు చేసేందుకు చేతితో త యారు చేసిన లేస్‌ను వుపయోగించారు. దీని కి ఐవరీ కలర్‌ లోని బొడీస్‌ను వుపయోగించి సిల్క్‌, శాటిన్‌ వస్త్రాన్ని వుపయో గించి స్కర్ట్‌ తయారు చేశారు.

పెళ్లి వార్త బయటికి వచ్చి నప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికలు, ఫ్యాషన్‌ ప్రియు లు కేట్‌ వెడ్డింగ్‌ డ్రెస్‌ పైనే దృష్టి సారిం చారు. దీనిపై ఎంతో మంది పేర్లు కూడా వెలికివచ్చాయి కానీ అసలు వ్యక్తిని మాత్రం తెలుసుకోలేకపోయారు. గత కొంత కాలంగా కేట్‌ వస్తధ్రార ణపైనే ఫ్యాషన్‌ ప్రియులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఫాలో అవుతున్న ట్రెండ్‌ను ఇప్పుడు ఎక్కువగా బ్రిటన్‌ యువతులు అనుసరిచేం దుకు ఇష్టపడటమే దీనికి కారణమట.

Saturday, April 23, 2011

జపాన్‌.. పడుతూ.. లేస్తూ..!! ఎదగడం.. కిందపడటం.. మళ్ళీ లేవడం.. అలవాటు చేసుకున్న దేశం.


japan

japan-5 
జపాన్‌ ఆటు పోట్లను అలవాటు చేసుకున్న దేశం. ఎదగడం.. కిందపడటం.. మళ్ళీ లేవడం.. ఈ ప్రవృత్తి వారి నిత్యదైనందిన జీవితంలోనూ ప్రతిఫలిస్తుంటుంది. జపనీయులు భవనాల మెట్లు ఎక్కడం.. దిగడం ఒక హాబీగా చేస్తారు. అందుకే అధికారిక కార్యక్రమాల్లో సైతం కొన్ని మీటింగులు ఒక ఫ్లోర్‌లో, మరికొన్ని సమావేశాలు మరో ఫ్లోర్‌లో పెట్టుకుంటారుట. లిఫ్ట్‌ వాడకుండా మెట్లు ఎక్కుతూ, దిగుతూ... ఆడుతూ, పాడుతూ విధులు నిర్వర్తిస్తుంటారని ప్రతీతి. వారి ఈ ప్రవృత్తి విధి రూపంలో వారితో ఆడుకుంటున్నదని అంటారు. అభివృద్ధిలో ఆకాశపుటంచులకు వెళ్లడం.. మానవ ప్రకోపమో.. ప్రకృతి ప్రకంపనమో.. వారిని అధఃపాతాళానికి తోసెయ్యడం.. మళ్ళీ కొండంత బలంతో పైకెదగడం.. జపాన్‌కు ఇదొక నిరంతర జీవన క్రీడగా మారిపోయింది.


japan1కనీసం అయిదు నిమిషాలకు ఒకసారి జపాన్‌లో భూమి కంపిస్తూ ఉంటుంది. అలాగే జపాన్‌ చుట్టుపక్కల కనీసం 200 అగ్ని పర్వతాలున్నాయి. ఇవి ఇరవై నాలుగ్గంటలూ కుతకుతలాడుతూ ఉంటాయి. ఇన్ని ఉపద్రవాల కుంపట్ల మీద జపాన్‌ పడుతూ లేస్తూ ప్రపంచ పరుగు పందెంలో ముందుకు సాగుతుంటుంది. పసిఫిక్‌ మహా సముద్రంలో 6,852 ద్వీపాలున్న ద్వీప సమూహం జపాన్‌. పసిఫిక్‌ మహాసముద్రంలోని సున్నితమైన ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఉన్న జపాన్‌ భూకంపాలకు పెట్టింది పేరుగా ముద్రపడింది. అగ్నిపర్వతాల అంచున ఉంటుంది. విశేషమేమిటంటే ప్రపంచంలోనే అత్యధిక మెట్రోపాలిటన్‌ జనాభా గల ప్రాంతంగా గ్రేటర్‌ టోక్యో పేరు గాంచడం. అంతేనా, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఆయుఃప్రమాణమే కాక అతితక్కువ శిశు మరణాలు కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన దేశం జపాన్‌. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా, అత్యంత కొనుగోలు శక్తి ఉన్న పౌరులు గల దేశంగా జపాన్‌ ముందుంది.

japan-3ప్రపంచం ఎగుమతులలోనూ, దిగుమతులలోనూ కూడా నాలుగవ స్థానంలో ఉన్నది. సాంకేతికంగా ఎంతో వృద్ధిని సాధించినా నిరంతరం ప్రకృతి ధాటికి భయపడుతూనే ఉంటారు జపనీయులు. ప్రపంచ పురాతన నాగరికతలలో జపాన్‌ ఒకటి. పాత రాతియుగంలోనే జపాన్‌లో మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నట్టు చారిత్రిక ఆధారాలున్నా యి. అంటే 30,000 బి.సి.లోనే అక్కడ మనుషులు ఉన్నారు. అంతటి పురాతన చరిత్ర, నాగరికత కలిగిన జపాన్‌ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్ర జాస్వామిక ఒరవడిలోకి అడుగిడేందుకు నిర్ణయించుకుని 1947లో నూతన రాజ్యాంగాన్ని ప్రకటించుకుంది. ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన రాచరికపు వ్యవస్థగా కొనసాగుతున్నది. రాజు దేశాధిపతి అయినా అలంకారప్రాయమే.. అధికారాలన్నీ డైట్‌ (పార్లమెంటు) ఎన్నుకున్న ప్రధాని చేతిలోనే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా అమెరికాలోని పెర్ల్‌ హార్బర్‌పై దాడి చేసి ఆ దేశాన్ని కూడా యుద్ధంలోకి లాగిన జపాన్‌.. హిరోషిమా, నాగసాకిపై దాడి అనంతరం యుద్ధం జోలికి వెళ్ళరాదని ఒట్టు పెట్టుకున్నది. అయినప్పటికీ అత్యంత ఆధునికమైన సైన్యాన్ని జపాన్‌ కలిగి ఉండటం విశేషం.

japan-4హిరోషిమా, నాగసాకి దాడి, పునర్నిర్మాణం: రెండవ ప్రపంచ యుద్ధ చివరి దశలో అంటే 1945 జులై 26న చేసిన పాట్స్‌ డామ్‌ ప్రకటనలో లొంగిపోవలసిందిగా జపాన్‌ను అమెరికా హెచ్చరించింది. అ యితే జపాన్‌ ప్రభుత్వం ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో నాటి అమెరికా అధ్యక్షడు హారీ ఎస్‌. ట్రూమన్‌ ఉత్తర్వుల మేరకు అమెరికా దళాలే 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమాపై ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణు బాంబును వేశాయి. మూడు రోజుల అనంతరం అంటే ఆగస్టు 9వ తేదీన ‘ఫ్యాట్‌మాన్‌’ అనే అణ్వాయుధాన్ని నాగసాకిపై విడిచారు. ఈ దాడులకు ఆరు నెలల ముందు దాదాపు 67 జపాన్‌ నగరాలపై అమెరికా ఉధృతంగా బాంబు దాడులు నిర్వహించింది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణు బాంబు దాడులు జరిపిన మొదటి నాలుగు నెలలోనే హిరోషిమాలో 90 వేల నుంచి 1లక్ష 66వేల మంది మరణించగా, నాగసాకిలో 60వేల నుంచి 80 వేల మంది మరణించారని, ఇందులో సగానికి సగం మంది దాడులు జరిగిన తొలి రోజే మరణించారని అంచనా. ఆ రోజు మరణించిన వారిలో 60శాతం మంది బాంబు దాడుల కారణంగా చెలరేగిన మంటల బారిన పడి మృతి చెందగా, 30 శాతం మంది భవనాలు కూలిపోయి, 10 శాతం మంది ఇతర కారణాల చేత మరణించినట్టు హిరోషిమా ఆరోగ్య శాఖ తేల్చింది. తర్వాత మరణించిన వారు కాలిన గాయాలు సెప్టిక్‌ అయ్యి, రేడియేషన్‌ సిక్‌నెస్‌కు గురైనవారు.

నాగసాకిపై దాడి జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే ఆగస్టు 15వ తే దీన సంకీర్ణ శక్తులకు లొంగిపోతున్నట్టుగా జపాన్‌ ప్రకటించడం ద్వారా పసిఫిక్‌ యుద్ధానికి అంతిమంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిం ది. ఈ బాంబు దాడుల దుష్ఫలితాలను చవి చూసిన జపాన్‌ మూడు అణ్వేతర సూత్రాలను పాటించాలని నిర్ణయించుకుని, అణ్వాయుధాలను నిషేధిం చింది. ఈ బాంబు దాడి నుంచి బయటపడిన వారిని జపనీస్‌లో హిబకుష అంటారు. అంటే పేలుడుతో ప్రభావితమైన వ్యక్తులు అని అర్థం.

japan-6 2010 మార్చి 31 నాటి లెక్కల ప్రకారం 2 లక్షల 27వేల 565మంది హిబకషులు జీవిస్తున్నారని జపాన్‌ ప్రభుత్వం లెక్కలు కట్టింది, అలాగే రెండు చోట్ల బాంబు దాడులను ఎదుర్కొ ని సజీవంగా ఉన్నవారిని ‘నిజు హిబకషు’గా పేర్కొం టారు. గత సంవత్సరం మరణించిన ట్సు టుమో యమగూచి ఒక్కడే నిజ హిబకషుగా జపాన్‌ ప్రభుత్వం గుర్తించింది. అతడు హిరోషిమాపై దాడి జరిగినప్పుడు ఈ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దాడిలో కాలిన గాయాలైన అతడు ఆ రాత్రి హిరో షిమాలో గడిపి ఆగస్టు 8 నాటికి నాగసాకి చేరుకున్నాడు. మరునాడే అక్కడ బాంబు దాడి జరిగింది. తన బంధువుల కోసం వెతుకుతూ అతడు రెసిడ్యువల్‌ రేడియేషన్‌కు గురయ్యాడు.యుద్ధానంత రం హిరోషిమా, నాగసాకి పట్టణాల వైపు కొన్ని నెలల పాటు తొంగి చూసేందుకు కూడా వీలులేనంతగా ధ్వంసమవడమే కాక రేడియో యాక్టివేషన్‌ నెలకొంది. అయితేనేం పట్టబట్టి ఐదు సంవత్సరాలలో దానిని పునర్నిర్మించారు. పారిశ్రామిక నగరంగా నేడు హిరోషిమా అలరారుతోంది. ప్రముఖ కార్ల, మోటార్‌ సైకిళ్ళ ఉత్పత్తిదారు మజ్దా ప్రధాన కేంద్రం ఇక్కడే ఉన్నది.

japan-7 భూకంపాలు, సునామీలు: ప్రపంచంలోనే భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతం జపాన్‌. అగ్నిపర్వతాలు, సముద్రపు అగడ్తలు కలిగిన ప్రాంతంలో ఉన్న జపాన్‌లో కనీసం ఐదు నిమిషాలకు ఒకసారి అయినా భూమి కంపిస్తుంది. ప్రపంచంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 కన్నా ఎక్కువగా నమోదయ్యే భూకంపాలలో 20 శాతం ఇక్కడే సంభవిస్తుంటాయి. కోటి ఇరవై లక్షలమంది జనాభాకు పైగా కలిగిన టోక్యో నగరం యురేసియా, ఉత్తర అమెరికా, ఫిలిప్పీన్‌, పసిఫిక్‌కి సంబంధించిన నాలుగు టెక్టోనిక్‌ ప్లేట్ల కూడలిలో ఉంది. ఈ పొరలు ఏదైనా ఒకటి ఏ మాత్రం వంగినా, కదిలినా, విరిగినా వెంటనే భూకంపం సంభవిస్తుంది. గత నెలలో జపాన్‌ ఈశాన్య ప్రాంతంలో సంభవించిన భూకం పం తదనంతర సునామీలు 1995లో సంభవించిన కోబె భూకంపం కన్నా పెద్దది కావడమే కాక నాడు సంభవించిన దానికన్నా అధిక ప్రాణ నష్టం, ధన నష్టం సంభవించాయి.

రిక్టర్‌ స్కేల్‌పై 8.9గా నమోదైన భూకంపానంతరం సంభవించిన సునామీలో 10 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడి తీరప్రాంతంలోని పట్టణాలను, నగరాలను మింగివేసాయి. జపాన్‌ ఈశాన్య తీరంమైన సెందాయ్‌ సహా అనేక నగరాలు, దాదాపు పదకొండు పట్టణాలతోపాటు అనేక గ్రామాల ప్రజలు భూకంప తాకిడికి గురయ్యారు. హకై్కడో, ఆవ్‌మొరీ, ఇవా టే, మియోగి, యమగట, ఫుకుషిమా, ఇబరకి, తొచి గి, గుమ్మ, చిబ, కనగవ పట్టణాలలో మొత్తం 13,540 మంది మరణించగా, 16,963 మంది కనుపించకుండా పోయారు. ఇందుకు తోడుగా 5,253 మంది గాయపడ్డారు. సుమారు లక్షా 38 వేల మంది వ్యక్తులు పునరావాస కేంద్రాలలో ఉన్నారు. సునామీ కారణంగా ఉవ్వెత్తున లేచిన అలల కోరలు నౌకలను, కార్లను మింగివేయగా, ప్రధాన విమానాశ్రయాలను ముంచి వేశాయి. ఈ భూకంప సునామీలో 59వేల ఇళ్ళు నేలమట్టం కాగా, 17 వేల ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

japan-8ఇవి ప్రస్తుతానికి లెక్క తేలినవే. లెక్కించవలసినవి ఇంకా మిగిలే ఉన్నాయి. విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిన్నది. ఫుకుషిమా, దాయిచీ అణు విద్యుత్‌ కేంద్రాలలో రియాక్టర్ల పేలుడు సంభవించడంతో జపాన్‌లో మరోసారి రేడియేషన్‌ భయాలు పట్టుకున్నాయి. ఆ ప్రాంతానికి 30 కి.మీ. దూరం లో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా జపాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నష్టాన్ని నివారించే ప్రయత్నం చేసింది. జపాన్‌ యుద్ధానంతర 65 ఏళ్ళ చరిత్రలో ఇది అత్యంత తీవ్రమైన సంక్షోభమని ప్రధాన మంత్రి నవాటో కాన్‌ పేర్కొనడం గమనార్హం. అయితే ఈ సంక్షోభాన్ని అధిగమించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్పడం ద్వారా జపనీయుల ఆత్మవిశ్వాసపు స్థాయిని ప్రదర్శించారు. జపాన్‌ ప్రజల క్రమశిక్షణ ఎటువంటిదో ఈ సందర్భంగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఆహారం, మంచినీరు వంటివి రోజుల తరబడి లభ్యం కావని తెలిసి కూడా అక్కడ తోపులాటలు కానీ గొడవలు కానీ జరుగలేదు. వారు షాపులో ఉండగానే కరెంటు పోయినప్పటికీ ఒక్క వస్తువు అదృశ్యం కాలేదు. లూటీలు, గొడవలు, గందరగోళాలు మచ్చుక కూడా కానరాకపోవడం జపాన్‌ ప్రజలలో ఉన్న ఐక్యతా స్ఫూర్తికి చిహ్నంగా చెప్పుకోవచ్చు.

జపాన్‌లో దాదాపు 55 అణు విద్యుత్‌ రియాక్టర్లు ఉన్నాయి. 61 శాతం ఇంధనం ఈ ‚రియాక్టర్ల నుంచే ఉత్పత్తి అవుతుంది. సునామీ అనంతరం ఫుకుషిమాలోని దాయిచీ అణుకేంద్రంలో సంభవించిన ప్రమాదంతో జపాన్‌లో ఆరింటిని నిలిపివేశారు. తొలిసారి జపాన్‌లో అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సునామీ కారణంగా దాయిచీతో పాటుగా మరి కొన్ని రియాక్టర్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒకవైపు భూకంపం కారణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినగా మరోవైపు ఉత్పాదన లేకపోవడం వల్ల కూడా అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దాదాపు 4,50,000 గృహాలకు విద్యుత్‌ లేక అల్లాడుతున్నారు. ఒకవైపు అణు విద్యుత్‌ కేంద్రాలు సునామీకి దెబ్బతినగా విద్యుత్‌ టరె్బైన్లు మాత్రం ఏ మా త్రం చెక్కు చెదరలేదు.

japan-9 2010 చివరి నాటికి జపాన్‌ 2304 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 1746 విండ్‌ టరె్బైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వాయు టరె్బైన్లు జాతీయ విద్యుత్‌ సరఫరాకు తోడ్పడుతున్నాయి. అణువిద్యుత్‌కన్నా విండ్‌ ఎనర్జీపై ఆధారపడడం అన్ని రకాలా శ్రేయస్కరమనే వాదనలు వినిపిస్తున్నాయి. జపాన్‌ అణు సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తం గా అక్కడ గ్యాస్‌కు డిమాండ్‌ పెరుగుతుందని దీనితో సహజవాయువు ధరల రెండేళ్లలో మొదటిసారి చుక్కలనంటుతాయని నిపుణు లు ఇప్పుటికే హెచ్చరిస్తుండడంతో యుకె సహా పలు దేశాలు కలవరం చెందుతున్నాయి. సునామీ ప్రభావిత ప్రాంతంలో ఉన్న టయో టా, నిస్సాన్‌, హోండా వంటి ఆటోమొబైల్‌ కంపెనీల కేంద్రాలతో పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉత్పత్తి చేసే సోనీ సహా నిప్పన్‌, పానాసోనిక్‌, ఫుజి వంటి అనేక కంపెనీల ఉత్పత్తి కేంద్రాలు అనేకం దెబ్బతినడంతో ఆయా చోట్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. జపాన్‌ ఆర్థిక వ్యవస్థకు అధికంగా దోహదం చేస్తున్న పరిశ్రమలు ఇవి.

పునర్నిర్మాణం: గత నెల 11న సంభవించిన భూకంపం తీ వ్రత దాదాపు 140 ఏళ్ళలో ఇదే తొలిసారి. 1995లో కోబె నగరంలో సంభవిం చిన భూకంప విధ్వంసం, నష్టాన్ని వందబిలియన్‌ డాలర్లుగా లెక్కకట్టారు. మొన్నటి వరకూ ప్రపం చంలో నే అతిఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా దానిని అభిర్ణించారు. కానీ దానిని ఇది మించిపోయింది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పునర్నిర్మాణానికి సుమారు 309 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని జపాన్‌ అంచనా వేసింది. పునర్నిర్మాణానికి, ఈ నష్టం నుండి తేరుకోవడానికి జపాన్‌కు కనీసం మరో ఐదేళ్ళు పడుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఫుకుషిమా రియాక్టర్లలో రేడియేషన్‌ను అంచనా వేసేందుకు జపాన్‌ ప్రస్తుతం రిమోట్‌ కంట్రోల్‌ రోబోలను వాడుతున్నది.

japan-10అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే జపాన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని ఉ న్నది. గత సంవత్సరం చివరి మూడు నెలలలో దాని ఆర్థిక వృద్ధి రేటు 1.3శాతం కుం గిన నేపథ్యంలో చైనా దానిని అధిగమించి ప్రపం చంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దెబ్బ మీద దెబ్బలా సునామీ కారణంగా ఏర్పడిన నష్టం నుంచి తేరుకోవడానికి జపాన్‌కు ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రజలపై పన్నుల భారం తీవ్రంగానే పడనుంది. 1997 తర్వాత తొలిసారి పన్నుల పెంపు గురించి ప్ర భుత్వం ఆలోచిస్తున్నప్పటికీ 70శాతం మంది ప్రజలు పన్నులు కట్టేందుకు సిద్ధం గానే ఉ న్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. సంక్షోభం వచ్చింది కనుక ప్రభుత్వమే తమ ను ఆదుకోవాలి తప్ప తామేం చే యమనే తత్వం జపాన్‌ ప్రజలలో లేకపోవడం అభినందనీయం. క్రమశిక్షణకు మారుపేరై న జపనీయులు అవసరమైతే ఎంతటి కఠిన శ్రమ కైనా ఓర్చి తమ కు వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకోగలరని రెండవ ప్రపంచయుద్ధానం తరం నుంచీ రుజువు చేస్తూనే ఉన్నారు. ఈసారీ అదే జరుగుతుందని ఆశిద్దాం.

వారోత్సవాలతో ఎనలేని ఉత్సాహం
radiation-burnsజపాన్‌ చక్రవర్తి పుట్టిన రోజు ఈ నెల 29న. ప్రతి ఏడాది ఆయన జన్మ దినాన్ని జాతీయ దినోత్సవంగా అధికారికంగా జరిపేవారు. కొన్నేళ్ల క్రితం దాన్ని మార్చారు. ఏప్రిల్‌ 29 నుంచి మే నెల మూడో తేదీ దాకా స్వర్ణ వారోత్సవం (గోల్డెన్‌ వీక్‌ )గా జరుపుతున్నారు. జపాన్‌ దేశాన్ని స్వర్ణయు గంలోకి తీసుకెళ్లే ఏకైక ధ్యేయంతో ఈ వారోత్సవాలకు రూపకల్పన చేశా రు. నిత్యం భూకంపాలతో, అగ్నిపర్వతాల భయోద్వేగాలతో గడిపే జపనీ యుల్లో దేశభక్తి స్ఫోరక భావాలను నింపడం ద్వారా వారిని ఆ భయోత్పా తాలు దరి చేరకుండా ఉండేందుకే వీటిని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 29వ తేదీని జపాన్‌ చక్రవర్తి పుట్టిన రోజు గుర్తుగా జాతీయ దినోత్సవంగా జరు పుతారు. అలాగే మే మూడో తేదీని రాజ్యాంగ పరిరక్షణ దినంగాను, నాలుగో తేదీని గ్రీనరీ డే గా జరుపుతా రు. జపాన్‌ చక్రవర్తులు ప్రకృతి ప్రేమికులన్న దానికి గుర్తింపుగా దీన్ని జరుపు తారు. ఇక అయిదో తేదీని బాలల దినోత్సవం. తల్లిదండ్రులు త మ పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తారు.

సునామీ తర్వాత ఇప్పుడి ప్పుడే కోలుకుంటున్న జపాన్‌ ఈ స్వర్ణ వారోత్సవాలను జాతి పునర్నిర్మా ణానికి సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సునామీకి దారు ణంగా దెబ్బతిన్నామని దీనంగా దైన్యం గా కూర్చోకుండా ఈ ఉత్సవాల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకుని, పని చేయాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా జాతి జనులనుసమాయత్తపరుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అతిపెద్ద భూకంపాలు, సునామీలు
2001 జూన్‌: పెరూ దక్షిణ ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 8.4 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా వచ్చిన సునామీలో వందల మిలియన్‌ డాలర్ల మేరకు నష్టం సంభవించింది.
2004 డిసెంబర్‌ 26: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీల కారణంగా భారత్‌తో సహా పలు దేశాలలో వేలాది మంది మరణించారు. తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 9.0గా నమోదైంది.
2006, జులై: ఇండొనేషియాలోని పడమర జావాలో సంభవించిన భూకంపం తదనంతర సునామీలో 668 మంది మృతిచెందగా, 74వేల మంది నిర్వాసితులయ్యారు.
2007, జనవరి: జపాన్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ, రష్యాలోని కురిల్‌ ద్వీపంలోనూ సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ఆ ప్రాంతాలను విడిచి పారిపోయారు. నాటి భూకంప తీవ్రత 8.3.
2007, ఏప్రిల్‌: సాలమన్‌ ద్వీపంలో సంభవించిన భూకంపం అనంతర సునామీలో 50మంది మరణించగా, వేలాదిమంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 8.0.
2009, సెప్టెంబర్‌: పసిఫిక్‌ ద్వీపమైన సుమోవాలో భూకంపం కారణంగా సంభవించిన సునామీలో 184మంది మరణించారు. భూకంప తీవ్రత 8.0.
2010, జనవరి: సాలమన్‌ ద్వీపంలోని పశ్చిమ ప్రాంతంలో సంభవించిన బలమైన భూకంపాల కారణంగా సునామీ సంభవించిన వెయ్యిమంది నిర్వాసితులయ్యారు. భూకంపాలు రిక్టర్‌ స్కేల్‌పై 6.5, 7.2లుగా నమోదయ్యాయి.
2010, ఫిబ్రవరి: చిలీలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా పసిఫిక్‌ తీర ప్రాంతాలలో హెచ్చరికలు జారీ అయ్యాయి.
2010, అక్టోబర్‌: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీలలో 509మంది మృతి చెందగా వేలాది మంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.

జపాన్‌కు సంబంధించి కొన్ని విశేషాలు
- గుర్రం పచ్చి మాంసాన్ని జపాన్‌లో ఇష్టంగా తింటారు. దీనిని వండకుండా పచ్చిగానే తింటారు. దీనిని బసాషీ అని పిలుస్తారు.

-జపాన్‌ భూభాగంలో 70 శాతం కొండలు, పర్వతాలు ఉంటాయి. అంతేకాదు దేశంలో సుమారు 200 అగ్నిపర్వతాలు ఉన్నాయి.

-జపాన్‌లో అక్షరాస్యతా రేటు దాదాపు 100శాతం

-అక్కడ బీర్‌ కోసం ప్రత్యేకంగా వెండింగ్‌ మెషిన్లు ఉంటాయి.

-క్షమాపణను తెలిపేందుకు కొందరు పురుషులు గుండు గీసుకుంటారు.

-జపాన్‌ నుంచి 15మంది నోబెల్‌ గ్రహీతలు (కెమిస్ట్రీ, మెడిసిన్‌, ఫిజిక్స్‌), ముగ్గురు ఫీల్‌‌డ్స మెడల్‌ పొందిన వారు ఉన్నారు.

-జపాన్‌కు చెందిన సినీ నిర్మాత, దర్శకుడు తకహి మీకె తన కెరీర్‌ ఉచ్ఛదశలో దశాబ్దకాలంలో 50 సినిమాలు తీశాడు.

-ప్రపంచంలో యానిమేషన్‌కి సంబంధించిన వినోద చిత్రాలలో 60శాతం జపాన్‌ నుంచ వచ్చినవే.

- జపాన్‌లో 21శాతం జనాభా వృద్ధులే. ప్రపంచంలో ఇది అత్యధిక శాతం
1900 సం నుంచి జపాన్‌లో సంభవించిన భూకంపాలు- సునామీ
సంవత్సరం నగరం మృతుల సంఖ్య తీవ్రత సునామీ
 1995 కోబె  5,502   6.9 సునామీ
 1948 పుకుయి 3769  7.3  సునామీ
 1948 నంకైదో 1362  8.3 సునామీ
 1945 మికావా 1961  7.1 సునామీ
 1944 తొనంకాయ్‌ 998  8.1 సునామీ
 1943 టిట్టోరి 1,190  7.7 సునామీ
 1933 సన్‌రికు 3000  8.4 సునామీ
 1927 టాంగో 3020 7.6 సునామీ
 1926 కాంటో 1,42,800 7.9 సునామీ

-జి.పాంచజన్య

Tuesday, April 19, 2011

Sailboats

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Sailboats - Phani Kiran: World Informatives

Thank You !
Received this from Mr.Chandra Shekhar, Hyderabad