చాలా ఏళ్లుగా మండేలాను నేను ఆరాధనా భావంతో చూస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో స్పష్టంగా కనిపించే నిరాశా, నిస్పృహలకు ధీటుగా నిలిచి గెలిచిన జీవితం ఆయనది. ఒక ఖైదీ స్వేచ్ఛాజీవి అయ్యాడు.
చరిత్రను ప్రభావితం చేసి మార్చగలిగే నేతలు ఈ ప్రపంచంలో అతి కొద్దిమంది. వారి జీవితాలు లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. అలాంటి వారిలో మండేలా ఒకరు. జాత్యహంకార ధోరణికి వ్యతిరేకంగా మండేలా చేసిన పోరాటం- దక్షిణాఫ్రికా దేశ చరిత్రనే మార్చేసింది. ప్రపంచంలోని కోట్లాది నల్లజాతీయులకు స్ఫూర్తిగా నిలిచింది. మండేలా జైలులో ఉన్న రోజులలో రాసిన ఉత్తరాలు, స్నేహితులతో జరిపిన సంభాషణలను గుదిగుచ్చి అందించిన పుస్తకమే- 'నెల్సన్ మండేలా : కన్వర్జేషన్స్ విత్ మైసెల్ఫ్'. దీనిలోని కొన్ని భాగాలను మీకు అందిస్తున్నాం..
(అమెరికా అధ్యక్షుడు ఒబామా రాసిన ముందుమాట నుంచి..)
"ప్రపంచంలో అనేక మంది మాదిరిగానే, మండేలా రాబిన్ ద్వీపంలోని జైలులో ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. మనలో చాలా మందికి మండేలా ఒక వ్యక్తి కాదు. దక్షిణాఫ్రికాలో న్యాయం కోసం, సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రతీక. ఆయన త్యాగం- మానవాభివృద్ధి కోసం ఏం చేయగలరో అది చేయండని ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చిన ఒక పిలుపు.. ఆ పిలుపును అందుకున్నవారిలో నేను ఒకడిని. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో- దక్షిణాఫ్రికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నేను పాల్గొన్నాను.
రాజకీయంగా నా తొలి అడుగు అదే. జాత్యహంకార బాధితులు ప్రతి రోజూ అనుభవించే బాధలతో పోలిస్తే వ్యక్తిగతంగా నాకు ఎదురయిన అడ్డంకులు చెప్పుకోదగ్గవి కావు. ఒక జైలు గదిలో అంత కాలం మగ్గుతూ, ధైర్యం కోల్పోకుండా పోరాడటం కేవలం మండేలాకు మాత్రమే సాధ్యం. అయితే ఆయన జీవితం నాకో దారి చూపించింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా సత్యం వైపే నిలబడటం నేర్పింది. తాను తీసుకున్న నిర్ణయాల ద్వారా- ఈ ప్రపంచం ఎలా ఉందో అలాగే దానిని అంగీకరించాల్సిన అవసరం లేదని- మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగ మార్చవచ్చని మండేలా నిరూపించాడు.
చాలా ఏళ్లుగా మండేలాను నేను ఆరాధనా భావంతో చూస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో స్పష్టంగా కనిపించే నిరాశా, నిస్పృహలకు ధీటుగా నిలిచి గెలిచిన జీవితం ఆయనది. ఒక ఖైదీ స్వేచ్ఛాజీవి అయ్యాడు. స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తి అందరినీ కలుపుకుపోవాలని వాదించాడు. ఒక పార్టీ నేత దేశాధ్యక్షుడయ్యాడు. పదవి నుంచి వైదొలగిన తర్వాత కూడా స్వేచ్ఛ, సమానావకాశాలు, ఆత్మగౌరవం కోసం కూడా పోరాడుతున్నాడు. ఈ ప్రపంచాన్ని, తాను పుట్టిన దేశాన్ని మార్చటానికి ఆయన ఎంతో చేశాడు. మండేలా లేని కొన్ని దశాబ్దాలను మనం ఊహించలేం.
కాలిఫోర్నియాలో విద్యార్థిగా దక్షిణాఫ్రికా జాత్యాహంకారంపై ఉద్యమించిన నేను.. అప్పటి నుంచి రెండు దశాబ్దాల తర్వాత రాబిన్ ద్వీపంలో మండేలా జైలు గదిలో నిలబడ్డాను. అంతకు ముందే నేను సెనేటర్‌గా ఎన్నికయ్యాను. అప్పటికే- మండేలా జైలుగది త్యాగానికి ఒక చిహ్నంగా మారిపోయింది. ఆ గదిలో నిలబడి- మండేలా ఖైదీ 466-44 గా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదా అని ఊహించుకోవటానికి ప్రయత్నించాను. ఆ సమయంలో ఆయన విజయం ఒక అనిశ్చితి మాత్రమే. చరిత్రను మార్చిన మండేలా ఆ జైలు గదిలో ఎలా ఉండేవాడో తల్చుకోవడానికి ప్రయత్నించా.''
...ఈ పుస్తకంలో మండేలా తన జీవితంలో ఏ విషయాన్నీ దాచటానికి ప్రయత్నించలేదు. తాను పూర్తి ఫర్‌ఫెక్ట్ కాదని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు. మనలాగానే ఆయనలో కూడా కొన్ని తప్పులున్నాయి. అయితే ఆ తప్పులు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. మనకు మనం నిజాయితీగా ఉంటే- జీవితంలో చిన్నవో, పెద్దవో- సంఘర్షణలు ఉంటాయని తెలుసు. ఈ సంఘర్షణల ఫలితం ఎలా ఉంటుందో తెలియనప్పుడు కూడా పోరాడటం మండేలా మనకు నేర్పుతాడు. ఈ పుస్తకంలో ఉన్న కథ- మండేలా జీవితం మనకు చెప్పే కథ- ఎటువంటి తప్పులు చేయని వ్యక్తిది కాదు.
విజయం తప్పనిసరిగా వరిస్తుందని భావించే వ్యక్తిది కాదు. తాను నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని ఫణంగా పెట్టిన వ్యక్తి కథ ఇది. ఈ ప్రపంచాన్ని అందరికి నివాసయోగ్యంగా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి కథ ఇది. అదే మనకు మండేలా ఇచ్చే సందేశం. మార్పు అసాధ్యం అనిపించే రోజులు మనందరి జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. మన ప్రత్యర్థులు, మనలో ఉండే బలహీనతలు- బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి సులభమైన మార్గాలను అవలంభించాలని ఊరిస్తూ ఉంటారు. మండేలా జీవితంలో కూడా అలాంటి రోజులు ఉన్నాయి. రాబిన్ ద్వీపంలోని జైలు గదిలో ఉదయాన్నే కొద్దిపాటి కాంతి కనిపించగానే- తాను చేస్తున్న త్యాగం వ్యర్థం కాదు అనిపించేలా ప్రకాశవంతమైన భవిష్యత్తు మండేలాకు కనిపించేది. ప్రతీకారం తీర్చుకొనే అవకాశం వచ్చినప్పుడు కూడా సర్దుబాటు ధోరణినే ఆయన అవలంభించాడు..''
జైలు గదిలో అంతర్ముఖుడు
మన గురించి మనం తెలుసుకోవటానికి, అంతర్ముఖులమై మన ఆలోచనలను, మన భావనలను వాస్తవిక అంచనా వేసుకోవటానికి జైలుగది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. సామాజికంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాం, మన పరపతి, పరువు ప్రతిష్టలు, సంపద, విద్యార్హతలు- మొదలైన అంశాల ఆధారంగా ఒక వ్యక్తిగా ఎంత అభివృద్ధి చెందామనే విషయాన్ని మనం మదింపు వేసుకుంటూ ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి విజయాన్ని అంచనా వేయటానికి ఇవన్నీ అవసరమైనవే. వీటిని పొందటానికి వ్యక్తుల ఆతృత, వారు పడే తపన కూడా అర్థం చేసుకోదగినవే.
అయితే ఒక మనిషిగా మనం ఎంత ఎదిగాం అనే విషయాన్ని అంచనా వేయాలంటే మాత్రం- మన లోపలి విషయాలను మదింపు వేయాల్సిందే. నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, నిగర్వం, వితరణ, నిరహంకారం, సేవ- మొదలైన లక్షణాలన్నీ అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితానికి ఇవే పునాదులు. తీవ్రమైన అంతర్మథనం జరిగి- మనని మనం తెలుసుకొని, మన బలహీనతలను కనుగొని, మన తప్పులను తెలుసుకున్నప్పుడే పై లక్షణాలను పెంపొందించుకోగలం. ఒక వేళ ఇవేవీ గుర్తించలేదనుకుందాం.
అప్పుడు కూడా మనం ప్రతి రోజు ఎలా ప్రవర్తిస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవటానికి జైలు గది ఉపయోగపడుతుంది. మనలో ఉన్న చెడును తొలగించుకోవటానికి.. మంచిని పెంచుకోవటానికి దోహదపడుతుంది. ఉదయాన్నే పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన జీవితంలో ఉన్న ప్రతికూలాంశాలను గమనించటం మొదట్లో చాలా కష్టంగా ఉండొచ్చు. కాని పదే పదే ప్రయత్నిస్తే మాత్రం మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. మంచి లక్షణాలు అలవరచుకోవాలనుకుంటే పాపి కూడా యోగి అవుతాడనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు..

(విన్ని మండేలాకు 1975, ఫిబ్రవరి1 నాడు రాసిన లేఖలో..)
నెల్సన్ మండేలా : కన్వర్జేషన్స్ విత్ మైసెల్ఫ్
పేజీలు : 454
ప్రచురణ : మాక్‌మిలన్

No comments:
Post a Comment