Thursday, October 21, 2010

Beach In Every House

                                                                                                                                                                                 cid:_2_0581ED400581EAEC0047F30A65257632 
cid:_2_0581F1A40581EAEC0047F30A65257632 
cid:_2_0581F1A40581EAEC0047F30A65257632 
cid:_2_0581F3EC0581EAEC0047F30A65257632 
cid:_2_0581F6340581EAEC0047F30A65257632 
cid:_2_0581F87C0581EAEC0047F30A65257632 
cid:_2_0581FAC40581EAEC0047F30A65257632 
cid:_2_0581FD0C0581EAEC0047F30A65257632 
cid:_2_0581FF540581EAEC0047F30A65257632 
 
 
 
 
 
 
Now see this.
This is taken from world's tallest building 'Burj Dubai' @ 2,620 ft / 801m!!!
 
What do you think?
 
cid:_2_058203440581EAEC0047F30A65257632 
 
 
Really amazing
 
Look at the edge (uppermost right corner) of the picture, you can almost see the turn of the earth
 
cid:_2_058206680581EAEC0047F30A65257632 
The persons who are working on the upper most Girders can see the 'ROTATION OF EARTH'
So terrifying..

Sunday, October 17, 2010

Get your home ready for fall with these decorating ideas:

Get your home ready for fall with these decorating ideas:







Wednesday, October 13, 2010

ముకేష్ అంబానీ కొత్త ఇల్లు.. అంబానీ ఆకాశ హర్మ్యం అదిగో..

ambnai-home
అపర కుబేరుడు, పారిశ్రామిక సంపన్నుడు, రిలయన్స్‌ పరిశ్రమల అధిపతి వర్ధమాన భారతంలో అడుగడుగునా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్న ముకేష్‌ అంబానీ నిర్మిస్తున్న ఆకాశహర్మ్యం ‘‘అంటీలియా’’ తుది మెరుగులు దిద్దుకుని ప్రారంభానికి ముస్తాబవుతోంది. 173 మీటర్ల ఎత్తుతో, 27 అంతస్తులతో, 2,00,000 చదరపు అడుగుల వైశాల్యంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన అంటీలియా ప్రపంచంలో అతి పెద్ద నివాస గృహంగా రికార్డులకు ఎక్కింది. ఈ ఇంటిని చూసుకోవడానికి, నిర్వహించడానికి 600 మంది సిబ్బంది అవసరమవుతారు. అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన పురాణ ప్రసిద్ధ దీవి అంటీలియా పేరునే తన ఇంటికి పెట్టుకున్నారు ముఖేష్‌.

చికాగోకు చెందిన అర్కిటెక్టులు పెర్కిన్స్‌ అండ్‌ విల్‌, మెల్‌బోర్న్‌కు చెందిన నిర్మాణ కంపెనీ లైటన్‌ హోల్డింగ్స్‌ ఈ భవన నిర్మాణాన్ని తొలుత చేపట్టి కొంతవరకు పూర్తి చేశాయి. తరువాత మరొక కంపెనీ మొత్తం భవనాన్ని నిర్మించింది. త్వరలో శుభ ముహూర్తం చూసుకుని అంబానీ దంపతులు, తల్లి కోకిలాబెన్‌, వారి ముగ్గురు పిల్లలు ఆకాష్‌, అనంత్‌, ఈషాలతో అంటీలియాలో గృహ ప్రవేశం చేయనున్నారు. దక్షిణ ముంబాయి టెక్ట్స్‌ఆల్టామౌంట్‌ రోడ్డులోని ప్రసిద్ధ కుంబల్లా హిల్స్‌పై 4,532 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఆంటీలియా సర్వ సుఖాలకు, అత్యాధునిక వసతులకు, అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే రీతిలో నిర్మితమైంది. అన్నట్లు ఇక్కడ చదరపు మీటర్‌ భూమి ఖరీదెంతో తెలుసా 10,000 డాలర్లు మాత్రమే. ఏంటి నోరు వెళ్ళబెట్టారా! అవును ఇది పచ్చి నిజం.

అంటీలియాలోని ఆరు అంతస్తులలో ఒకేసారి 160 కార్లను పార్క్‌ చేయవచ్చు. ఒక ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల నిర్వహణకు కేటాయించారు. లాబీలో 9 ఎలివేటర్లు ఉన్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై ఎనిమిది పాయింట్ల స్థాయిలో భూ ప్రకంపనలు నమోదైనా చెక్కు చెదరని నాణ్యతలో దీనిని నిర్మించారు. భవనం టెర్రస్‌పై మూడు హెలిప్యాడ్లతో సహా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కేంద్రం కూడా నిర్మించారు. ఎనిమిదవ అంతస్తులో 50 సీట్లతో కూడిన థియేటర్‌, హెల్త్‌ స్పా నిర్మించారు. బహు విధాలుగా సోయగాలు పోతూ నిర్మించిన పలు ఈత కొలనులు అంటీలియాకు ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పవచ్చు. మూడు అంతస్తులలో వేలాది పుష్ప జాతులు, క్రోటన్లతో కూడిన కృత్రిమ వనాలను ఏర్పాటు చేశారు. ఇక స్నోరూంలు, బాల్‌ రూముల సౌందర్య నగిషీలను ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు.

ముకేష్‌ అంబానీ ఇక్కడ భవంతిని నిర్మిస్తున్నారన్న వార్తలు రాగానే చుట్టుపక్కల ప్రాంతాలలో భూమి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. దాదాపు రూ.9,000 కోట్ల ఖర్చుతో అంటీలియా గర్వంగా పైకి లేచింది. 2007లో ఇక్కడ ముకేష్‌ భూమి కొన్నప్పుడు వివాదం చెలరేగింది. ఈ స్థలాన్ని అమ్మిన వక్ఫ్‌బోర్డుకు యాజమాన్య హక్కులు లేవని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. చివరకు ముకేష్‌ రూ.16 లక్షలు చెల్లించి నిరభ్యంతర పత్రాన్ని పొందగలిగారు. ముంబాయి భవంతులపై హెలిప్యాడ్ల నిర్మాణానికి నావికా దళం అభ్యంతరం పెట్టింది.

శబ్దకాలుష్యం పెరుగుతుందని పర్యావరణ శాఖ కూడా కొర్రీలు వేసింది. ఈ ఆకాశహర్మ్యం పూర్తి కావడానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది. అంబానీ టవర్‌ ఎంపోరియస్‌ అనే ముద్దుపేరు కూడా ఈ బహుళ అంతస్తుల భవనానికి ఉంది. దీని నంబర్‌ 301023. వెరె్సైలెస్‌ ప్యాలెస్‌ కంటే గొప్ప ఫ్లోరింగ్‌ను అలంకరించారు. అతిధుల కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తులను కేటాయించారు. ఈ భవంతి ఏ ఒక్క గది ఇంకోదానిలా కనిపించకపోవడం విశేషం.కాగా ఈ భవనం ఎక్కిచూస్తే ముంబాయి నగర సౌందర్యం కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.

ఇటీవలే ఎంపిక చేసిన అతి కొద్ది మంది సన్నిహితులను, వివిఐపిలను ముకేష్‌ తన ఇంటికి ఆహ్వానించి చూపించారు. ముకేష్‌ పొరుగునే కుమార్‌ మంగళం బిర్లా ఉంటున్నారు. ఆయన ఆంటీలియా గురించి చెబుతూ తాను ప్రపంచంలో అనేక గొప్ప భవనాలను, నివాస గృహాలను చూశానని, చివరకు లండన్‌లోని లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ గృహాన్ని కూడా సందర్శించానని, వీటన్నింటింలో ఈ భవంతి గొప్పగా ఉందని బిర్లా కితాబునిచ్చారు. ఇక బాల్‌ రూమును చూస్తే నిర్ఘాంతపోవలసిందేనని వ్యాఖ్యానించారు. ముకేష్‌ తమ్ముడు అనిల్‌ అంబానీ దక్షిణ ముంబాయిలోని విలాసవంతమైన ప్రాంతం కుఫీ పెరేడ్‌లో నివసిస్తున్నారు.
ఆకాశహర్మ్యం పేరు : ఆంటీలియా, 
ముద్దుపేరు  : అంబానీ టవర్‌ ఎంపోరియస్‌
చిరునామా : టెక్ట్స్‌ఆల్టామౌంట్‌ రోడ్డు, నంబర్‌-301023 
  కుంబల్లా హిల్స్‌, దక్షిణ ముంబాయి-400 026
అంతస్తులు : 27
ఎత్తు : 173 మీటర్లు
నిర్మాణ వైశాల్యం : 4 లక్షల చదరపు అడుగులు
స్థల విస్తీర్ణం : 48,780 చదరపు అడుగులు
పార్కింగ్‌ లాట్‌ : 600 కార్లకు ఆరు అంతస్తులు
ఎలివేటర్లు : 9
నిర్వహాణ సిబ్బంది : 600 మంది
కృత్రిమ వనాలు : మూడు అంతస్తులు
హెలిప్యాడ్లు : మూడు ప్లస్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్‌
నిర్మాణ వ్యయం : రూ.9,000 కోట్లు
నిర్మాణ కాలం : మూడు సంవత్సరాలు
ఆర్కిటెక్టులు : పెర్కిన్స్‌ అండ్‌ విల్‌ (చికాగో), లెహ్‌టన్‌ హోల్డింగ్స్‌ (మెల్‌బోర్న్‌) 
                మరికొన్ని  

ముకేష్ గృహప్రవేశం!

దేశంలోనే అతి ధనవంతుడైన ముకేష్ అంబానీ కొత్త ఇల్లు పూర్తయింది. ఈ ఇంటి గృహా ప్రవేశం ఈ నెల 28వ తేదీన జరిగే అవకాశం ఉంది.

ఆ రోజు కొందరు ప్రముఖులను ముకేష్ తన కొత్త ఇంటికి ఆహ్వానించారు. 570 అడుగుల ఎత్తు..27 ఫ్లోర్లతో నిర్మించిన ఈ భవంతికి 'యాంటిలా' అని పేరు పెట్టారు (యాంటిలా అట్లాంటిక్ సముద్రంలో ఒక ద్వీపం).
మన దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో- అంతర్జాతీయ సంస్థలు హిర్ష్ బెడ్‌నర్ అసోసియేట్స్, పెర్కిన్స్ విల్స్- ఈ భవంతిని డిజైన్ చేశాయి.

ఈ భవంతిలో మొదటి ఆరు అంతస్థులు కేవలం పార్కింగ్ కోసం వదిలేసారు. దీనిలో మొత్తం 160 కార్లను పార్క్ చేసుకోవచ్చు. ఏడో అంతస్థులో ఉన్న లాబీల నుంచి అసలు ఇంటిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎనిమిదో అంతస్థు నుంచి 27వ అంతస్థు దాకా బాల్‌రూమ్‌లు, పౌడర్ రూమ్‌లు, లాంజ్‌లు, ఒక మిని థియేటర్ ఉంటాయి. 27వ అంతస్థును మాత్రం ముకేష్, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాష్, అనంత్, ఇషాల కోసం ప్రత్యేకంగా నిర్మించారు.

ఆ పైన హెలిపాడ్‌లు నిర్మించారు. దీని మీద మూడు హెలికాప్టర్లు దిగటానికి వీలు ఉంటుంది. ఈ భవంతిలో ఒక గదిని పోలి మరొక గది ఉండదు. "నేను లక్ష్మీ మిట్టల్ ఇంటితో సహా అనేక భవంతులు చూశాను. అయితే ముకేష్ ఇంటికి ఇవేమి సాటిరావు. ఈ ఇంటిలో ఒక పికాసో పెయింటింగ్ కూడా ఉన్నట్లు జ్ఞాపకం..'' అని ముకేష్‌కు సన్నిహితుడైన టెలికం కంపెనీ సీఈఓ ఒకరు వెల్లడించారు.

ఈ భవంతిని నిర్మించటానికి ఏడేళ్లు పట్టింది. ఎంత ఖర్చు అయిందనే విషయం ఇంకా కచ్చితంగా తెలియదు. భవంతి నిర్మాణాన్ని ముకేష్ సతీమణి నీతా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటి దాకా ముకేష్- దక్షిణ ముంబాయిలో- సీవిండ్ అనే బంగ్లాలో నివాసం ఉంటున్నారు.

కష్టే సాహస ఫలి

ఇద్దరు సోదరులు.. ఒక కల.. ఏమిటా కల ? ఎంతో అసాధ్యమైన కల !

మనిషికి రెక్కలు పొదిగి ఆకాశంలో ఎగిరేలా చేయాలని. పక్షులు ఎగురగలుగుతున్నప్పుడు మనిషి మాత్రం ఎందుకు ఎగరలేడు ?

పోనీ మనిషి కాకపోతే. ఏదైనా యంత్రం ఎగరొచ్చు కదా !! దాంతో పాటు మనిషి కూడా ఎగరొచ్చు కదా !

ఇది ఆ సోదరుల కల. రైట్ సోదరుల కల.

మనకు రెక్కలనిచ్చి గగన యాత్ర అనుభవాన్ని అందించిన మహాశయులు రైట్ సోదరులు.

బెంగళూర్‌లో బ్రేక్‌ఫాస్ట్, లండన్‌లో లంచ్, డిన్నర్ ఢిల్లీలో నేడు మనం చేయగలుగుతున్నామంటే అది రైట్ సోదరుల కలలు, ప్రజ్ఞాపాటవాల వల్లనే మనకు అందుబాటులోకి వచ్చాయి. కలలు, గమ్యాలు, ఆ కలల సాకారానికి వినియోగపడే పద్ధతులు- అన్నీ ఏకమైతేనే వాటికో రూపం వచ్చి అవి నిజాలయ్యేవి. లేకుంటే పగటి కలలుగా నిల్చిపోతాయి.

పగటి కలల గురించి తెల్సిందే కదా మనకు. పగటి కలలు అనగానే చప్పున నా మదిలో మెదుల్తుంది ముల్లా నసీరుద్దీన్ గారి పగటి కలలు. ముల్లా నసీరుద్దీన్ హాస్యానికి, కొంటె పనులకు మారుపేరు. మన తెనాలి రామకృష్ణుడిలాగా. ముల్లా నసీరుద్దీన్ గురించి పలు కథలు, అనేక భాషల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకరోజున ముల్లా నసీరుద్దీన్ తన గాడిద మీద ప్రయాణం చేస్తూ తన పగటి కలల ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు... పంచరంగుల కలలు.

తను వ్యాపారవేత్తనవుతానని, నాలుగు దుకాణాలు కొని, వాటిల్లో చెప్పుల షాపు, కుండల షాపు, టైలర్ షాపు, జంతువుల స్వారీకి ఉపయోగించబడే సీట్లు కుట్టే షాపును పెడదామనుకున్నాడు. ప్రతి షాపులో ఇద్దరు పనివాళ్లను పెట్టి వ్యాపారాభివృద్ధి చేసి హాయిగా రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భార్యలతో, నలుగురు అబ్బాయిలతో జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుని ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు అందమైన అమ్మాయిల్ని తెచ్చి పెళ్లిళ్లు చేయాలనుకొన్నాడు.

కలలంటూ మొదలయ్యాక అవి అనంతంగా అల్లుకుపోతూనే ఉంటాయి కదా. అదే జరిగింది. మన ముల్లా నసీరుద్దీన్‌కు కూడా. కలలు అల్లుకుంటూ పోతున్నాడు. మనవలు, మనవరాళ్లు. తనను పట్టించుకోకుండా తన కలల లోకంలో విహరిస్తున్న ముల్లాను చూచింది ఆయన స్వారీ చేస్తున్న గాడిద. 'చిన్న గమ్మత్తు చేస్తేనో' అనుకుంది.

ఎదురుగా చిన్న గుంట, దాన్ని దాటటానికి ఒక చిన్న వంతెన కనబడ్డాయి.. వంతెనను వదిలి ఒక్కసారి ఆ గుంట మీద నుంచి అమాంతం దూకితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో కదా అనుకుని వెంటనే దూకేసింది. గాడిద గుర్రం కాదు కదా. పగటి కలలు నిజాలు కావు కదా.

అంతే గుంటలో పడిపోయింది గాడిద, దాంతో పాటు అనంతంగా పగటి కలలు కంటున్న మన ముల్లా నసీరుద్దీన్ గారు.

నడ్డి విరిగిందని వేరే చెప్పాలా !? పగటి కలల ప్రయోజనం ఇంతేనని మనకు ముల్లా చెబుతున్న నీతి కథ.

మన రైట్ బ్రదర్స్ కలలు పగటి కలలు కావు. చిన్నతనం నుంచి వారితో పెరిగిన ఒక గాఢమైన కోరిక. నడిచే మనిషిని విమానంలో కూర్చొపెట్టి ఎగురవేయాలనే తపన.

ఆర్‌విల్ రైట్ , విల్బర్ రైట్ .
విల్బర్ 1867లో ఆర్‌విల్ 1871లో పుట్టారు. వీరు కాక మరో ఐదుగురు సంతానం వారి తల్లిదండ్రులకి. అతి సామాన్యమైన కుటుంబం. తండ్రి మిల్టన్ రైట్ చర్చిలో బిషప్‌గా పనిచేస్తుండేవాడు. అందరిలోకి ఆర్‌విల్ చాలా అల్లరివాడు. చేస్తున్న అల్లరి పనులకు ప్రతిఫలంగా ఒకసారి స్కూల్లోంచి తీసేయబడ్డాడు కూడా.

అయితే అన్నదమ్ములిద్దరికి ఎగిరే పక్షులన్నా, అవి ఆకాశంలో ఎగురుతూ చేసే అద్భుతాలన్నా, విన్యాసాలన్నా ఎంతో మక్కువ. గంటల తరబడి రకరకాల పక్షుల ఆకాశయానాన్ని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండేవారు. ఏ ప్రక్రియ వల్ల పక్షులు నేల మీద నుంచి ఆకాశంలోకి ఎగురగలుగుతున్నాయి, ఎలా తమ రెక్కల ఉపయోగం ద్వారా దిశలు మార్చగలుగుతున్నాయో సునిశితంగా పరీక్షించేవారు. అవి ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాయో పరీక్షించేవారు. ఆకాశయానంలో ఎగురుతున్న పక్షులకు గాని యంత్రాలకు గాని వాటి బ్యాలెన్స్, క ంట్రోల్ ఎంతో ముఖ్యమని గమనించారు.

1878లో విల్బర్, ఆర్‌విల్ సోదరులకు వారి తండ్రి ఒక బొమ్మ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది ప్రతి చోట సర్వసాధారణంగా లభ్యమయ్యే బొమ్మ హెలికాప్టర్. రబ్బరు బెండు, పేపర్, వెదురు ముక్కలతో చేసిన హెలికాప్టర్. ఒక అడుగు పొడుగు మాత్రమే.

విహంగ యానం మీద ఎంతో మక్కువ పెంచుకున్న రైట్ సోదరులకు తండ్రి ఇచ్చిన ఈ సామాన్య బహుమతి వాళ్ల సృజనాత్మకను మేలుకొలిపింది. వారి కలలకు ఒక రూపం ఒక గమ్యం ఏర్పడినాయి. సైకిల్ షాపు తెరిచారు. ఆ రోజుల్లో అమెరికాలో సైకిళ్లంటే విపరీతమైన మోజు ఉండేది. సైకిళ్లను అమ్మటమే కాదు రిపేర్లు చేసే కూడా చేసేవాళ్లు. 1896లో తామే సైకిళ్లను తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారు. ఇదంతా డబ్బు సంపాదించాలనే తపనతో కాదు, తమ కల ఏరోప్లేన్‌ను కనుగొనే కలను సాకారం చేసుకోవటానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవటానికై. ఇంతేకాదు, సైకిల్‌కు ఎగిరే విమానానికి ఎన్ని పోలికలున్నాయో గ్రహించారు రైట్ సోదరులు. సైకిల్ నడపాలంటే కంట్రోల్ ఎంతో అవసరం కదా.

అలాగే విమానానికి ఎంతో అవసరం ఈ కంట్రోల్. పైగా సైకిళ్ల ఉత్పాదనలో, వాటి మరమ్మత్తులలో, యంత్రాల నిర్మాణం వాటికి అవసరమైన నేర్పును నేర్చుకున్నారు. తర్వాత కాలంలో వారు తమ గ్లైడర్సును విమానాలను తయారు చేస్తున్నప్పుడు ఈ సైకిళ్ల తయారీ అనుభవం ఎంతో మేలు చేసింది వారికి. 14 మే 1908న రైట్ బ్రదర్స్ ఎంతో కాలంగా శ్రమించిన విమానం ప్రయాణికులతో ఎగరటానికి సిద్దమైంది.

అయితే 17 సెప్టెంబర్‌న ఓ విమాన ప్రమాదం జరిగింది. ఆర్‌విల్ రైట్ ఆ ప్లేనుకి పైలట్. ఆ విమానంలో ఒక ప్రయాణికుడు సిగ్నల్ కార్ప్స్ లెఫ్టినెంట్ థామస్ సెల్ఫ్‌రిడ్జ్ ఉన్నారు. విమానం కూలిపోయింది. ఆర్‌విల్ బతికి బట్టకట్టాడు. థామస్ సెల్ఫ్‌రిట్జ్ మరణించాడు.

ఈ దుర్ఘటన వారిలోని పట్టుదలను ధృడపరిచింది . మరెంతో శ్రమించారు.
1909లో అమెరికా ప్రభుత్వం తమ మొదటి విమానాన్ని కొనుగోలు చేసింది. అది రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం. ఆ రోజుల్లో ఆ విమానం ధర 25 వేల డాలర్లు.

ఇక అక్కణ్ణుంచి అన్నీ విజయాలే.
1911లో ఖండాంతర ప్రయాణం చేయగలిగిన విమాన సృష్టి. అమెరికాని దాటటానికి ఆ విమానానికి 84 రోజులు పట్టింది. 70 సార్లు ఆగింది.

1912లో మెషిన్‌గన్‌ను అమర్చిన ప్లేన్‌ను ఆవిష్కారం.
1914లో ఆర్మీలో ఒక చిన్న ఎయిర్‌ఫోర్సు విభాగం ఏర్పాటు జరిగింది.
ఒక్కసారి ఆలోచించండి...
ఎక్కడి ఆటబొమ్మ హెలికాప్టర్ !!
ఎక్కడి ఎయిర్‌ఫోర్స్ విభాగం !!
కేవలం 30 ఏళ్లలో మనిషి ఎగ రటం మాత్రమే నేర్చుకోలేదు. తాను ఎగిరే విమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకోగలిగాడు. జయహో రైట్ సోదరులారా ! ప్రపంచానికి ఒక కొత్త వేగాన్ని ఒకే జీవిత కాలంలో ఎన్నో జీవితాల అనుభవాన్ని పొందుపరుచుకునే శక్తిని మానవ జాతికి ఇచ్చారు రైట్ సోదరులు.

కలలు కనటమే కాదు... ఆ కలల సాకారానికై స్ఫూర్తి, శ్రమే కాకుండా డబ్బు కావాలి. దీన్ని రైట్ సోదరులకి వారి సైకిళ్ల వ్యాపారం చేకూర్చింది. కలలు కనే ప్రతి వారికి వాటి సాకారానికై కొన్ని సూత్రాలు పద్ధతులు ఎంతో అవసరం. గత వారాల్లో నిర్మా కర్సన్ భాయ్, సర్ సివి రామన్, ధీరూభాయ్, ముద్రా గురించి ముచ్చటించుకొన్నాం. వీరి విజయాలు, ఇతరుల విజయాలను పరిశీలించగా, వీరందరూ క్రింద పొందుపర్చిన అన్ని పద్ధతులను కాని లేక వాటిలో కొన్నింటినైనా గాని అమలు పరచి వారివారి కలలను సాధించగలిగారు.

పెద్దపెద్ద కలలు కనటం
ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా మారటం
పాజిటివ్ థృక్పధం అలవరుచుకోవటం
అసాధ్యాలంటూ ఏదీ ఉండవనే నమ్మకం పెంచుకోవటం
పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు అనే ధృడ విశ్వాసం
కలలను, గమ్యాలను విడనాడక పోవటం
సహచరులపై ధృడమైన నమ్మకం, విశ్వాసాలను పెంచుకోవటం
సవాళ్లను ఆహ్వానించటం
సర్వేజనా సుఖినోభవంతుపై నమ్మకం
ఇది ఒకే జీవితం, ఒకే అవకాశం అనే థృక్పధం
-ఎజి కృష్ణమూర్తి

Sunday, October 3, 2010

సంద్రం చూడని సముద్రయానం

సముద్రంలోపల సబ్‌మెరైన్లలో పనిచేసేవాళ్లకు రంగురంగుల చేపలు, రకరకాల జీవులు, తిమింగలాలు కనిపిస్తాయనుకుంటాం. నీళ్లలో ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేయగల ఉద్యోగమనుకుంటాం.

కానీ అలాంటి అనుభూతులేవీ ఉండవంటున్నారు సబ్‌మెరైన్‌లో 20 ఏళ్లపాటు పనిచేసిన ఈ కెప్టెన్. కూర్చునే కుర్చీ దగ్గర నుంచి తిండితినే టేబుల్ వరకు అన్నీ ఇరుకిరుకేనట. సముద్రం లోపల వెళుతూ, సముద్రాన్ని తిలకించలేని ఆ జీవితం గురించి కెప్టెన్ నగిర్‌రెడ్డి పంచుకున్న అనుభవాలు...


అది 1982 అనుకుంటా. సముద్రంలో 50 మీటర్ల లోతులో మా సబ్‌మెరైన్ వెళుతోంది. నాతోపాటు వందమంది నేవీ సిబ్బంది అందులో ఉన్నారు. మేమంతా రష్యా వెళుతున్నాం. అప్పుడు సముద్రంలో భయంకరమైన చలిగాలులు వీస్తున్నాయి. హాంకాంగ్ సమీపానికి చేరుకున్నాం. సముద్రం మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంది. మేమంతా సబ్‌మెరైన్‌లోనే చిక్కుకుపోయాం.

ఒడ్డుకు వద్దామనుకుంటే రాతిపలకల్లాంటి మంచు. వెంటనే హార్బర్‌లోని ఇండియన్ నేవీ అ«ధికారులకు మెసేజ్ పంపించాం. వాళ్లు హాంకాంగ్ నేవీ వాళ్లకు కబురు పెట్టారు. వెంటనే హాంకాంగ్ నేవీ వాళ్లు మంచును తొలగించే నౌకను తీసుకొచ్చారు. కట్టర్ల సాయంతో సముద్రం మీద గడ్డకట్టిన మంచును ముక్కలు చేశారు. అప్పటి వరకు మేం సముద్రంలోపలే సబ్‌మెరైన్‌లోనే ఉన్నాం.

అందరి మనసుల్లో ఆందోళన. కాసేపటి తరువాత మంచు విడిపోయిందని మెసేజ్ వచ్చింది. అప్పుడు బయటపడ్డాం. సబ్‌మెరైన్లలో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఒక్కసారి లోపలికి వెళ్లాక మళ్లీ బయటికి వచ్చే వరకు ఎప్పుడు, ఏం జరుగుతుందో ఊహించలేం. ఇదొక ఛాలెంజింగ్ జాబ్.

నీళ్లలో కాపలా...
భూభాగంలో గస్తీ తిరిగే సైన్యంలాగే, సముద్రంలోపల కూడా నిఘా తప్పనిసరి. నీళ్లలో ఆ పని చేసేది సబ్‌మెరైన్లే! మన దేశ సముద్ర తీరం ఏడువేల కిలోమీటర్లకుపైనే ఉంది. భూభాగం మీద అయితే అనుమతి లేకుండా సరిహద్దులు దాటే వాళ్లను సైన్యం అడ్డుకుంటుంది. అదే, సముద్రం లోపల్నించి వచ్చే వాళ్లను ఎలా గుర్తుపడతారు? ఏ సమయంలోనైనా శత్రువు రహస్యంగా మన దేశంలోకి రావచ్చు

. అందుకే సముద్రజలాల్లో కూడా నిఘాపెడుతుంది నావికాదళం. సబ్‌మెరైన్‌లు ఒక్కోసారి రెండు నెలలపాటు నీటిలోపలే ఉండిపోవాల్సి వస్తుంది. బయటి నుంచి చూస్తే సబ్‌మెరైన్లు చాలా పెద్ద ఆకారంలో కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉంటాయి. అందులోనే వందమందికిపైగా సిబ్బంది ఉంటారు.

పెద్ద ఇనుప పెట్టెలాంటి క్యాబిన్లు, ఒక మనిషి పడుకుంటే మరొక మనిషి వచ్చేందుకు వీలులేని పడగ్గదులు. తిండీతిప్పలకు అంతంత మాత్రమే జాగా ఉంటుంది. హార్బర్‌లతో తప్ప బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఇలాంటి సబ్‌మెరైన్‌లోనే ఇరవై ఏళ్లు పనిచేశాను నేను. ప్రస్తుతం మర్చంట్ నావీ కెప్టెన్‌గా పనిచేస్తున్నాను.

సబ్‌మెరైన్‌లోనే...
మాది తూర్పుగోదావరి జిల్లాలోని పెనుగొండ ప్రాంతం. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. వర్ధమాన సినీనటి కలర్స్ స్వాతి నా కూతురే. నా గురించి చెప్పాలంటే.. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో సీటొచ్చింది నాకు. ఆ తర్వాత పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాను. అక్కడి నుంచి నేరుగా ఇండియన్ నేవీలోకి ప్రవేశించాను.

1977 నుంచి సబ్‌మెరైన్‌లోనే ఉద్యోగం. ఇరవై ఏళ్లలో కమాండర్, కెప్టెన్‌గా దేశమంతా తిరిగే భాగ్యం కలిగింది. విశాఖపట్టణం సముద్ర తీరంలో సందర్శనార్థం ఉంచిన 'కుర్‌సురా' సబ్‌మైరెన్‌కు అయిదేళ్లు కెప్టెన్‌గా పనిచేశాను. అప్పట్లో భారత్‌కు అది రెండో సబ్‌మెరైన్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. 1969లో దాన్ని సముద్రంలో ప్రవేశపెట్టారు. నాకు తెలిసి 31 సంవత్సరాలు సేవలు అందించింది 'కుర్‌సురా'. వైజాగ్‌లో దాన్ని చూసినప్పుడల్లా అందులో ఉద్యోగం చేసిన రోజులే గుర్తొస్తుంటాయి.

- సముద్రంలో 50 మీటర్ల లోతులో ప్రయాణిస్తున్నా, బయట ఏమీ కనిపించదు.
- రెండ్రోజులకు ఒకసారి డిస్పోజబుల్ డ్రెస్సులు మారుస్తుంటాం.
- ఆహ్లాదం కోసం సబ్‌మెరైన్‌లలో టీవీ, సినిమాలు చూడొచ్చు.
- మందు, సిగరెట్లు పూర్తిగా నిషేధం. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు.
మన సముద్రజలాల్లో నావికాదళం గస్తీ తిరిగినట్లే, ఇతర దేశాల వాళ్లూ సముద్రంలో గస్తీ నిర్వహిస్తుంటారు. ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నప్పుడు మాకు మరికొంత దూరంలో ఒక సబ్‌మెరైన్ వస్తున్నట్లు సంకేతాలొచ్చాయి. ఉద్యోగులందరూ అలర్ట్ అయ్యారు. కొంతసేపటికి ఆ సబ్‌మెరైన్ దూరం వెళ్లిపోయింది. ఆ రోజు ఏమీ జరగలేదు.
యుద్ధాల్లో కీలకపాత్ర.
మన దేశంలోని ప్రధాన నౌకా కేంద్రాలలో సబ్‌మెరైన్లను నిలుపుతుంటారు. అక్కడి నుంచి ప్రతి రోజూ నేవీ అధికారులు నిర్దేశించిన దూరం వరకు సముద్రంలోకి వెళ్లి వస్తాయి. ఒక్కో సబ్‌మెరైన్ సామర్థ్యాన్ని బట్టి కొన్నేసి రోజులు నీళ్లలో ఉంటాయి. రీఛార్జి కోసం సముద్ర పైభాగానికి వచ్చి కావాల్సినంత ఆక్సిజన్‌ను నింపుకొని మళ్లీ లోపలికి వెళతాయి. దీన్ని 'స్నాటింగ్' అంటారు.

సాధారణ సమయాల్లో గస్తీకి ఉపయోగించే ఈ సబ్‌మెరైన్లను యుద్ధాలు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి వాడుకుంటారు. ఇన్నేళ్ల నా ఉద్యోగ జీవితంలో యుద్ధాలు మాత్రం జరగలేదు. వెనకటి రోజుల్లో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు వైజాగ్‌లోనే ఒక సంఘటన జరిగింది. ఇండియాకు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ అనే సబ్‌మెరైన్‌ను ముంచేయాలని పాకిస్తాన్ వ్యూహం పన్నింది. నిజానికి విక్రాంత్ అప్పుడు వైజాగ్‌లో లేదు.

అక్కడే ఉందనుకొని పొరబడిన పాకిస్తాన్ సబ్‌మెరైన్ ఘాజీ నీళ్లలోపలే రహస్యంగా వైజాగ్ చేరుకుంది. నిఘా పెట్టిన ఇండియన్ నేవీ నీటి లోపలే ఘాజీని పేల్చేసింది. మన దేశంలో సబ్‌మెరైన్లకు సంబంధించి ఇదే తొలి సంఘటన.

రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కూడా సబ్‌మెరైన్స్‌ను బాగా ఉపయోగించాడు. ఫాక్‌లాండ్ కోసం ఇంగ్లండ్, అర్జెంటీనాల నడుమ యుద్ధం జరిగినప్పుడు అర్జెంటీనాకు చెందిన రెండే రెండు సబ్‌మెరైన్లు ఇంగ్లండ్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి. ఆఖరికి ఆ యుద్ధంలో ఎంతో నష్టపోయాకగానీ ఇంగ్లండ్ గెలవలేదు. అదీ సబ్‌మెరైన్లకున్న పవర్.

అన్నీ ఇరుగ్గానే...
నిత్యం నీళ్లలోపల ఉండే సబ్‌మెరైన్ ఉద్యోగులు ఏం తింటారు..? ఎప్పుడు పడుకుంటారు..? స్నానాలు గట్రా ఎలా? ఇలాంటి ప్రశ్నలే చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని. అచ్చు మనం ఇంట్లో వండుకుని తినే ఆహారమే సబ్‌మెరైన్‌లోనూ వండుతారు. ప్రత్యేకంగా వంటమనిషి ఉంటాడు. అన్నం, పప్పు, రోటీ, కూరలు అన్నీ వేడిగా వండిపెడతారు.

చిన్న క్యాంటీన్‌లో డైనింగ్‌హాల్ మీదే అందరం భోంచేస్తాం. ఒక్క భోజన సమయంలో తప్పిస్తే సరదా సంభాషణలు ఎప్పుడూ వినిపించవు. షిప్టుల్లో పనిచేస్తాం. నిద్ర నాలుగైదు గంటలే ఉంటుంది. మిగతా సమయంలో కొందరు పుస్తకాలు చదువుకుంటుంటారు. సబ్‌మెరైన్ లోపల ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఒక్కసారి సముద్రంలోకి దిగాక, ట్రాన్స్‌మిటర్స్ ద్వారా నేవీ హెడ్‌క్వార్టర్స్‌కు మెసేజ్‌లు వెళుతుంటాయి.

మేం ఎక్కడున్నాం..? ఎంత లోతులో ఉన్నాం..? భూభాగానికి ఎంత దూరంలో వెళుతున్నాం..? సురక్షితంగా ఉన్నామా, లేక ప్రమాదంలో ఉన్నామా..? అనే విషయాలన్నీ మెసేజ్‌ల రూపంలో ఎప్పటికప్పుడు పంపిస్తుంటాం. మెసేజ్‌లు వెళ్లకపోతే సబ్‌మెరైన్ ప్రమాదంలో ఉన్నట్లేనని నేవీ హెడ్‌క్వార్టర్స్ వెంటనే అలర్ట్ అవుతుంది. వెంటనే 'ఫలానా సబ్‌మెరైన్ మిస్సింగ్' అంటూ అన్ని హార్బర్లకు సమాచారం పంపిస్తుంది

దాంతో వెంటనే నావికాదళానికి చెందిన నౌకలు వెతకడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సంఘటన ఒకటి మా సబ్‌మెరైన్‌లో కూడా జరిగింది. అప్పుడు మేం విశాఖకు దగ్గర్లోనే సముద్రం లోపల ఉన్నాం. నేవీ హెడ్ క్వార్టర్స్‌కు మెసేజ్ ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో వాళ్లు అలర్ట్ అయ్యారు. అసలు అంత చురుగ్గా స్పందిస్తారని మేం ఊహించలేదు. వెంటనే 'సబ్‌మెరైన్ సేఫ్' అంటూ మెసేజ్ పంపించాం.
అప్పుడు ఊపిరిపీల్చుకున్నారు వాళ్లు. ఇలాంటి అనుభవాలు సబ్‌మెరైన్లలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంటాయి. అందరి జీవితాలు మట్టిమీద నడుస్తుంటే, మా జీవితాలు మాత్రం నీళ్లలో నడుస్తుంటాయి..'' అంటూ ముగించారు నగిర్‌రెడ్డి.  
జూ ఆది మల్లెంపూటి
ఫొటోలు : రజనీకాంత్

ఎర్త్ ఫ్రెండ్లీ * 'సన్‌పవర్' టెక్నాలజి

 
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మనిషి సౌరశక్తి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. తప్పదు మరి. పత్ర హరితం నుంచి విద్యుచ్ఛక్తి వరకు భాస్కరుడి ప్రమేయం లేకుండా బయటకు రాదుగా! ఎక్కడి 'టెక్నాలజీ' అయినా పరోక్షంగా సూర్యుడి మీద ఆధారపడాల్సిందే కదా. ఇప్పటిదాకా అధికశాతం సౌరశక్తిని పరోక్షంగా ఉపయోగించుకుంటున్నా, ఇక ముందు నేరుగా ఉపయోగించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణలు... నిత్య జీవితంలో అత్యంత అవసరమైన వస్తువులైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏటీఎమ్‌లు, వాటర్‌హీటర్ వంటివన్నీ సోలార్‌పవర్‌తో తయారుకానుండడమే.

ఇటీవలే చెన్నై ఐఐటీ వాళ్లు సోలార్ ఏటీఎమ్‌లు తయారు చేసి, ఉపయోగంలోకి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా మూడు వేల ఐదువందల సోలార్ ఏటీఎంలు స్థాపించాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. చెన్నై ఐఐటీ వాళ్లు ఇప్పుడు ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఈ ఏటీఎమ్‌ల వల్ల పర్యావరణానికే కాదు బ్యాంకు వాళ్లకు కూడా లాభమే. ఏడాదికి 20,000 రూపాయలు కరెంటు బిల్లులు మిగులుతాయని వారి అంచనా. మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే వాచీలు, వాటర్ హీటర్‌లు, కుకర్‌లు, ఇప్పుడిప్పుడే కంప్యూటర్‌లు, సెల్‌ఫోన్‌లు, ఏటీఎమ్‌లు... ఇలా ప్రతీది సోలార్ బాట పడుతున్నాయి. అలాంటి ఉత్పత్తుల తయారీకి పెద్ద కంపెనీలు సైతం సిద్ధమవుతున్నాయి. మొట్టమొదట 1970లో రోగర్ రిచెల్ అనే అమెరికన్ సోలార్ పవర్ రిస్ట్‌వాచ్‌ను తయారు చేశాడు. వాటిని తయారు చేయని ఒక్క వాచీ కంపెనీ కూడా లేదిప్పుడు. సోలార్ పవర్డ్ ల్యాప్‌ట్యాప్‌ను మొదట తయారు చేసింది ఒక స్పానిష్ కంపెనీ. దాని సామర్థ్యం 64 జీబీ. ఇప్పుడు సామ్‌సంగ్ కంపెనీ కూడా సోలార్‌పవర్ ల్యాప్‌ట్యాపుల్ని తయారు చేస్తోంది. ఇక మొబైల్స్ విషయానికొస్తే సోలార్ మొబైల్స్ గతేడాది జూన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రెండ్‌ను ప్రారంభించింది కూడా సామ్‌సంగ్ కంపెనీయే. 'సోలార్ గురు' పేరుతో వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా సోలార్ మొబైల్ ఫోన్లను తయారుచేసే యోచనలో ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఐదేళ్ల క్రితం గుజరాత్‌లోని ఒక సోలార్ కంపెనీ తయారు చేసిన సోలార్‌కుకర్ బాగా ప్రచారం పొందింది. అది సైనికుల కోసం తయారు చేసింది. ఆ సోలార్‌కుకర్‌లో ఒకేసారి 500 మందికి సరిపోయే ఆహారాన్ని వండవచ్చు. అదే కంపెనీ గత ఏడాది (2009) తయారు చేసిన మరో సోలార్ కుకర్‌లో 20,000 మందికి సరిపోను ఆహారం వండొచ్చు. ఈ కుకర్‌ను షిర్డీలోని 'శ్రీసాయిబాబా సంస్థాన ట్రస్టు' కోసం తయారు చేశారు. 2009లో ముంబయిలో జరిగిన 'వెస్ట్రన్ ఇండియా సైన్స్‌ఫేర్'లో మొదటి బహుమతి అందుకున్న విద్యార్థి తయారు చేసింది కూడా 'సోలార్‌వాటర్ హీటర్'నే.
మనరాష్ట్రంలోని బైసానివారిపల్లె గ్రామం దేశంలోనే మొదటి 'సోలార్ విలేజ్'గా ఖ్యాతి పొందింది. ఆ ఊళ్లో అందరూ సోలార్ కుకర్లే ఉపయోగిస్తారు. అంతేకాదు స్మోక్ ఫ్రీ విలేజ్‌గా కూడా ఆ గ్రామానికి పేరుంది.


జర్మనీలో సోలార్ పవర్‌తో నడిచే ఒక పెద్ద షిప్పు ఉంది. 30 మీటర్ల వెడల్పు, 15.2 మీటర్లు వెడల్పుతో ఉండే ఆ షిప్పు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరో ఆసక్తి కలిగించే సోలార్ వార్త.... ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో 'వరల్డ్ సోలార్ చాలెంజ్' పేరుతో కార్‌రేస్ పోటీలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కార్లు పోటీలకు వస్తాయి. ఇందులో సోలార్ పవర్‌తో నడిచే కార్లనే ఉపయోగించాలి. ఈ సోలార్ కార్ రేస్ ట్రాక్ డార్విన్ నుంచి ఎడిలైడ్ మధ్య 3000 కిలోమీటర్లు ఉంటుంది. 2009 నుంచి 'వరల్డ్ గ్రీన్ చాలెంజ్'గా దీని పేరు మార్చారు.
వాంగార్డ్ 1.. ఇది అమెరికాలో తయారైన సోలార్ పవర్డ్ శాటిలైట్. 17 మార్చి 1958లో ప్రయోగించారు. అయితే 1964 తర్వాత దీని నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. ఫలితం ఆశించిన విధంగా లేకపోయినా ప్రయత్నానికి మంచి పేరు వచ్చింది. ఒక మంచి ప్రయత్నం మంచి ఫలితానికి దారి లాంటిదే. అది వెంటనే రావచ్చు... కాస్త సమయమూ పట్టవచ్చు.

టెక్నాలజీ కారణంగా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న సమయంలో అధునాతన టెక్నాలజీకి సౌరశక్తిని అనుసంధానిస్తుండడం ఎంతైనా అభినందనీయం. విద్యుత్‌తో పనిచేసే వస్తువుల హవా కొనసాగుతోంది కాబట్టి ప్రజల నుంచి భారీ స్పందన వస్తే గానీ మనిషి జీవితంలో భాగమైపోయిన సెల్‌పోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఏటీఎంలు 'ఎర్త్ ఫ్రెండ్లీ'గా మారే అవకాశం లేదు.

మట్టిలో మెరిసిన ఐడియాలు ..... మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం తట్టని ఎకోఫ్రెండ్లీ ఐడియా!

మట్టీ నేషనల్ కంపెనీ 'మిట్టీకూల్'

ఫ్రిజ్‌లొచ్చాక కుండలు పోయాయి. కుక్కర్లొచ్చాక మట్టిపాత్రలు కనిపించనే కనిపించడం లేదు. ఇక, వీటిని తయారుచేసే కుమ్మర్లు కనుమరుగవ్వక మరేమవుతారు..? ఆ మాటేదో కుమ్మరి కుటుంబానికే చెందిన మన్‌సుక్‌బాయ్‌కి చెప్పండి. అరికాలి మీద లేచొస్తాడు. ఐడియా తట్టాలేకానీ, మట్టి కలిపే చేతులతోనే మల్టీ నేషనల్ కంపెనీలను కొట్టొచ్చంటాడు.

ఆ కంపెనీలకన్నా భిన్నంగా ఆలోచిస్తే, పాత వృత్తులన్నీ మళ్లీ బట్టకడతాయని కుండబద్దలుకొట్టి మరీ చెబుతాడు. 'మిట్టీకూల్' కంపెనీ పెట్టి ఆ పనే చేశాడీయన. మట్టి ఫ్రిజ్, మట్టి కుక్కర్, మట్టి వాటర్ ఫిల్టర్‌లను తయారుచేస్తూ పెద్ద పెద్ద కంపెనీలకే ముచ్చెమటలు పట్టిస్తున్న మన్‌సుక్‌బాయ్‌ది... గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా మోర్బి..

"నువ్వయ్యా, అసలైన శాస్త్రవేత్తవంటే..!'' అబ్దుల్ కలాం అంతటాయన భుజంతట్టి మరీ చెప్పాడు.
"నీ ఆలోచన వల్ల ఎంతోమంది ఆరోగ్యంగా ఉంటారు..'' రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సైతం మెచ్చుకున్నారు.

పదో తరగతే గట్టెక్కలేని మన్‌సుక్‌బాయ్ ఇంతకూ ఏమంత గొప్ప పని చేశాడు..? ఆయన చేసిందల్లా ఒట్టి మట్టిపని. మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం తట్టని ఎకోఫ్రెండ్లీ ఐడియా! నిజంగానే ఆ ఐడియా మన్‌సుక్‌బాయ్ జీవితాన్నే మార్చేసింది.

ఆయన గురించి తెలుసుకున్నాక ఈ మాటను మనం సులువుగా అనేయవచ్చు. కానీ, మన్‌సుక్‌బాయ్ మాత్రం అంత ఈజీగా ఒప్పుకోడు. 'మట్టి ఐడియా' వెనుక తను ఎన్ని తిప్పలు పడిందీ తెలుసుకోవాలంటాడు. అప్పుడే- ఐడియా తన జీవితాన్ని మార్చిందా..? లేక తన పేదరికమే తనకు ఆ ఐడియాను ఇచ్చిందా..? అర్థమవుతుందంటాడు.

గాడి తప్పిన చదువు...
"ఏందిరా వెధవా, పదోతరగతి ఫెయిలయ్యావు. చదువు బొత్తిగా రాదు. ఇంకేం పని చేస్తావ్..? ఎట్ల బతుకుతావ్...?'' ఏ తల్లిదండ్రులైనా ఇంతకంటే ఇంకేమంటారు. ఫెయిలైనందుకు కాదు. అందరూ ఎత్తిపొడుస్తుంటే మన్‌సుక్‌బాయ్ మనసు చివుక్కుమంది.

'ఇప్పుడు ఏం చేయాలి' చిట్టి బుర్ర చేయని ఆలోచన లేదు. కొన్నాళ్లకు ఇంట్లోవాళ్లు కూడా పట్టించుకోవడం మానేశారు. ముందు నుంచి కుమ్మరి వృత్తిని నమ్ముకొని బతికే కుటుంబం వాళ్లది. సంప్రదాయబద్ధంగా కుండలు, కూజాలు, ప్రమిదలు చేసి అమ్ముకొనేవారు. వచ్చిన కాసింత డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు.

మన్‌సుక్‌బాయ్ కూడా మట్టి తవ్వుకురావడం, సారెతిప్పి కుండలు చేయడం, ఎండిన కుండలను కాల్చడం..అన్ని పనుల్నీ అవలీలగా చేసేవాడు. దేశంలో కొన్ని ప్రాంతాలలోనే దొరికే ఒక రకం ఎర్రమట్టి గుజరాత్‌లో కూడా దొరుకుతుంది. ఆ మట్టితో కుండచేస్తే ఉక్కుబిందెలాంటి గట్టిదనం వస్తుంది. ఇవన్నీ కుండలు చేసిన అనుభవంతోనే గమనించాడు మన్‌సుక్‌బాయ్. ఆయన తల్లిదండ్రులు మాత్రం 'ఒరే, కొన్ని తరాలుగా కుండలు చేస్తున్నా మన కుటుంబాలు బాగుపడింది ఏమీ లేదు.

నువ్వు ఈ వృత్తిని నమ్ముకోకు. ఎక్కడన్నా చిన్న ప్రైవేటు ఉద్యోగమేదైనా చూసుకొని బతుకు'' అనేవాళ్లు. ఇంట్లోవాళ్ల మాట కాదనలేక ఇటుకల బట్టీల్లో పని చేశాడు. భవననిర్మాణాల్లో రాళ్లు ఎత్తాడు. బండచాకిరీ చేస్తున్నా పైసా మిగల్లేదు. అందుకే- ఓ రోజున 'ఇది కాదు నా జీవితం... ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలి..' అనుకొని సొంతూరు తిరిగొచ్చాడు మన్‌సుక్‌బాయ్.

మట్టిలో మెరిసిన ఐడియాలు...
మారుతున్న కాలానికి తగ్గట్టు కుమ్మరి వృత్తికూడా ఎందుకు మారడం లేదు..? తనలోతాను పరి విధాలుగా ఆలోచించాడు. చాలామంది పేదోళ్లు వాటర్‌ఫిల్టర్‌లు కొనలేరు. ఫ్రిజ్‌లు కొనలేరు. కుక్కర్లు కొనలేరు. పాన్‌లు కూడా కొనలేరు. ఇప్పటికే ఫ్రిజ్‌లు ఉన్నవాళ్లకు కరెంటు బిల్లులు భారమై కూర్చుంటున్నాయి. ఫ్రిజ్‌లో పెట్టిన కూరగాయలు వండుకు తింటుంటే రుచీపచి లేదంటున్నారు మరికొందరు.

సరిగ్గా ఇక్కడే ఐడియా పండింది. ఆ ఐడియాను మట్టిలో ముంచితీశాడు మన్‌సుక్‌బాయ్. మట్టి వాటర్ ఫిల్టర్ కనిపించింది. మట్టి ఫ్రిజ్ మెరిసింది. మట్టి కుక్కరు, మట్టి పాన్ అదరహో అనిపించాయి. ఇంకేముంది..? కుమ్మరి చేతుల్లో మట్టిపడితే ఏ రూపమైనా ప్రాణం పోసుకోదూ..! అదే జరిగింది. ఎర్రమట్టితో వాటర్ ఫిల్టర్ తయారుచేశాడు. అదే మట్టితో అచ్చుగుద్దినట్లు ఫ్రిజ్ చేశాడు.

ఆయన వాలకం చూసి 'నీకేమన్నా పిచ్చారా భయ్, ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల ఫ్రిజ్‌లు మార్కెట్‌లో తక్కువరేటుకే దొరుకుతుంటే, బోడి నీ మట్టిఫ్రిజ్ ఎవ్వడు కొంటాడు..' అన్నారు ఇరుగుపొరుగు వాళ్లు. అవేమీ పట్టించుకోలేదు అతను. చేస్తున్న పని కొనసాగిస్తూ.. మట్టితో కుక్కర్, పాన్ చేశాడు. అంతాబాగుంది కానీ, మార్కెట్ ఎలా చేయాలో అర్థం కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. బ్యాంకోళ్లను బతిమాలి బామాలి రూ.30 వేలు లోన్ తీసుకున్నాడు. చిన్న ఫ్యాక్టరీ 'మిట్టీకూల్' బోర్డు పెట్టాక మన్‌సుక్‌బాయ్ కళ్లు వెలిగిపోయాయి.

తొలి విజయం...
మట్టి ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎనిమిది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇవన్నీ సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోవు. రుచి కూడా తగ్గదు. అందులోనూ కరెంటు అవసరమే లేదు. మట్టి వాటర్ ఫిల్టర్ కూడా అంతే. అందులో పోసిన నీళ్లు శుభ్రంగా, చల్లగా ఉంటాయి. మట్టికుక్కరు, మట్టిపాన్ మీద వంట చేయమని భార్యకు చెప్పాడు మన్‌సుక్‌బాయ్.

ఎంతో సౌకర్యంగా ఉందని చెప్పింది ఆవిడ. అంతటితో ఊరుకోకుండా ముంబయిలోని 'టాటా కెమికల్స్' వాళ్ల చేత పరీక్ష చేయించాడు. వాళ్లు ఓకే అన్నారు. అంతలో ఓ రోజు నైరోబి దేశస్థుడు మిట్టీకూల్‌ను సందర్శించి, అక్కడికక్కడే 500 మట్టి వాటర్‌ఫిల్టర్లు కావాలని ఆర్డర్ ఇచ్చేశాడు. అదే మన్‌సుక్‌బాయ్‌కి తొలి విజయం. తనమీద తనకు విశ్వాసం కలిగించిన అమ్మకం. ఒక్కో ఫిల్టర్ రూ.400 చొప్పున అమ్మేశాడు.

ఆ వార్త గుజరాత్ పత్రికల్లో పడింది. మిట్టీకూల్‌కు పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్‌నే తెచ్చిపెట్టింది. దాన్ని చూసి ముంబయి, పాట్నా, పూణెల నుంచి కుప్పలుతెప్పలు ఆర్డర్లు వచ్చాయి. డిమాండ్ ఎంత వరకూ వెళ్లిందంటే 50 వేల మట్టిపాన్‌లు అమ్మే వరకూ వెళ్లింది. మట్టిఫ్రిజ్ రూ.2,500 ధరపెట్టినా చాలామంది ఉత్సాహంగా కొనుక్కెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్‌లు చేసి తెప్పించుకున్నారు. మిట్టీకూల్ మన్‌సుక్‌బాయ్ పేరు గుజరాత్ అంతటా మార్మోగింది.

నడిచొచ్చిన సంస్థలు..
ఎల క్ట్రానిక్, ప్లాస్టిక్ వస్తువులతో పర్యావరణానికి హాని పెరుగుతున్న ఈ రోజుల్లో 'ఎకో ఫ్రెండ్లీ' వస్తువులను తయారుచేయడం మన్‌సుక్‌బాయ్‌కి కలిసొచ్చింది. పెద్ద పెద్ద సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. 'గుజరాత్ గ్రాస్‌రూట్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్', 'నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్' మన్‌సుక్‌బాయ్ కనిపెట్టిన వస్తువులకు పేటెంట్ ఇప్పించాయి.

అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ప్రొఫెసర్లు కార్పొరేట్ మార్కెటింగ్, ప్యాకింగ్, టెస్టింగ్‌లలో సలహాలు ఇచ్చారు. గుజరాత్ ఎగ్జిబిషన్, న్యూఢిల్లీలో జరిగిన 'ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్' వాళ్ల నుంచి ఆహ్వానాలు అందాయి. మిట్టీకూల్ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శనకు పెట్టి అంతర్జాతీయ శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించాడు మన్‌సుక్‌బాయ్. అంతర్జాతీయ సంస్థలైన బోస్, సీమెన్స్‌లాంటి కంపెనీలు ఆసక్తి చూపాయి.

'సెంటర్ ఫర్ ఇండియా అండ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్', యూకేలోని 'యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్' కాన్ఫరెన్సులకు కూడా పిలిచారు. అక్కడ తన ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తుల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు మన్‌సుక్‌బాయ్. ఇప్పుడు మిట్టీకూల్ గుజరాత్ గల్లీ కంపెనీ కాదు. ఇంటర్నేషనల్ లోకల్ కంపెనీ. మన్‌సుక్‌బాయ్ యానికి ముచ్చటపడిన మల్లికా సారాబాయ్ మిట్టీకూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తానంది.

ఇంత చేసింది పదోతరగతి ఫెయిలైన మన్‌సుక్‌బాయ్. తనకు ఎలాగూ చదువుకొనే అదృష్టం లేదు. అందుకే కొడుకును సిరామిక్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. హ్యాట్సాఫ్ మన్‌సుక్‌బాయ్.