Showing posts with label Turning Point. Show all posts
Showing posts with label Turning Point. Show all posts

Thursday, September 16, 2010

పశువులకాపరి నుంచి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దాకా.....

"ఊర్లో పశువులు కాసే వాళ్లకు అడవే ప్రపంచం. ఊర్లో ఏం జరిగినా మాకు తెలిసేది కాదు. ఎవ్వరితోనూ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. పొద్దున్నే మేతకు పశువుల్ని తీసుకెళ్లడం, సాయంత్రం ఇంటికొచ్చాక తిని పడుకోవడం. నాతోటి పిల్లలందరూ బడికి వెళుతుంటే చాలా బాధ కలిగేది. ఏం చేయాలో దిక్కుతోచేది కాదు. మా అమ్మానాన్నలకు అక్షరం ముక్క రాదు. చదువంటే వారికి ఏమీ తెలీదు.

కృష్ణా జిల్లా విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎ.కొండూరు మండలంలో కంభంపాడు అనే గిరిజన తండా మాది. తల్లిదండ్రులు చిట్టిపోతుల నాగయ్య, ముత్తమ్మలు. పండుగలప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో కొర్రన్నం తినేవాళ్లం. పూట గడవాలంటే కూలికి వెళ్లాలి. ఉన్న కాస్తోకూస్తో పొలంలో పండినవే తిండిగింజలు. ఇలాంటి కుటుంబంలో పుట్టిన నాకు చదువుకునే భాగ్యం పదకొండేళ్ల వయస్సులో కలిగింది.

అమ్మ చేర్పించింది..
విస్సన్నపేటకు చెందిన కోటేశ్వరరావు అనే విద్యార్థి రోజూ మా ఇంటిదగ్గరికి స్నానానికి వచ్చేవాడు. ఒకరోజు వాణ్ణి చూసి 'ఒరే నువ్వు కూడా ఎలాగైనా చదువుకోవాలి..' అంటూ అమ్మ గట్టిగా చెప్పింది. వెంటనే తీసికెళ్లి బళ్లో ఒకటో తరగతిలో చేర్చింది. తర్వాతి సంవత్సరం 2, 3, 4 తరగతులు ఒకేసారి పూర్తి చేశాను. మా ఊర్లోనే ఉన్న మూర్తి మాస్టారు ట్యూషన్ చెప్పి, నన్ను బాగా ప్రోత్సహించారు.

ఆరో తరగతికి వచ్చేలోగా తోటి విద్యార్థులతో సమానంగా చదివేవాణ్ణి. ఏడోతరగతిలో పబ్లిక్ పరీక్షరాసి జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచాను. గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకోవడం గొప్ప అనుభవం. అప్పటికే నా చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు. వాళ్లను చూసి నాలో పట్టుదల పెరిగింది. పదోతరగతి అయ్యాక ఇంటర్‌కు ఏపీ రెసిడెన్షియల్‌లో సీటు సంపాదించాలనుకున్నాను. రిజల్టు అలాగే వచ్చింది. పులిగడ్డ ఏపీ రెసిడెన్షియల్‌లో ఇంటర్‌లో చేరి 83 శాతం మార్కులతో పాసయ్యాను.

ఆంధ్రాయూనివర్శిటీలో ఎంటెక్ పూర్తిచేసేసరికి, మా అమ్మానాన్న నా కోసం 25 పశువుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. మాకున్న ఒకేఒక్క ఆధారం పశువులే. నా చదువుకు అవసరమైనప్పుడల్లా కొన్ని పశువులను అమ్మేసి నాకు డబ్బులు పంపించేవారు. నా కష్టానికి ఫలితం అన్నట్లు పాండిచ్చేరిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైంటిస్టుగా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఏడాదిపాటు చేశాను.

పనికొచ్చే పరిశోధనతో...
ఉద్యోగం ఏదైనా సమాజం కోసం పనికొచ్చే పరిశోధన చేయాలన్న లక్ష్యం రోజురోజుకూ బలపడింది. అదే సమయంలో కాకినాడలోని జెఎన్‌టియులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. పీహెచ్‌డీ చేసే సమయంలోనే 'హ్యూమన్ ఫేస్ రికగ్నైజేషన్' సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశా. యూనివర్శిటీలో చేరాక అదే కొనసాగించాను. ఒక వ్యక్తి లక్షమందిలో ఉన్నా గుర్తుపట్టే సాఫ్ట్‌వేర్ అది.

చిన్న ఫోటో ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్‌తో సులువుగా, నిమిషాల్లో గుర్తుపట్టవచ్చు. డీఆర్‌డీవో సైంటిస్టుల సహాయం తీసుకొని దీన్ని రూపొందించాను. ఈ సాఫ్ట్‌వేర్ సామాజిక భద్రతకు పనికొస్తుంది. నేరస్తులను పట్టుకొనేందుకు తోడ్పడుతుంది. వాయిస్ రికగ్నైజేషన్, స్పీచ్ రికగ్నైజేషన్ కూడా దీనికి జోడిస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఈ సాఫ్ట్‌వేర్‌ను వారికి ఇవ్వమని అడిగారు. పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తాం.

ప్రస్తుతం నాకు సహాయపడిన డీఆర్‌డీవో సైంటిస్టులు నా దగ్గరే పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పుడు కాకినాడ జెఎన్‌టియులోనే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు 35 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. 'పదకొండేళ్ల వయసులో బడికి వెళ్లి ఏం సాధించగలనని..' భావించి ఉంటే ఇప్పటికీ పశువులకాపరిగానే అడవులు పట్టుకు తిరుగుతుండేవాణ్ణి.

- వై.రమేష్‌బాబు

Wednesday, September 15, 2010

బిజీ ఉద్యోగానికి 9 సూత్రాలు

9. ఉట్టి చేతులతో ఎప్పుడూ నడవకండి : ఎప్పుడూ చేతిలో ఒక పుస్తకంగానీ, ఫైలుగానీ పట్టుకుని నడవండి. సహోద్యోగి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నా ఓ ఫైల్ పట్టుకోండి. చూసేవాళ్లు ఏదో చర్చిస్తున్నారనుకుంటారు.

8. కంప్యూటర్‌పై బిజీగా కూర్చోండి : ఎప్పుడూ కంప్యూటర్ ముందే ఉండండి. చూస్తున్నవారికి మీరేదో పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు పర్సనల్ ఇమెయిల్స్ పంపుతున్నా, ఛాటింగ్ చేస్తున్నా పెద్దగా పట్టించుకోరు.

7. చిందర వందర డెస్క్ : మీ డెస్క్‌లో గానీ, టేబుల్‌పై గానీ ఏ వస్తువులూ లేకుంటే మీరు పెద్దగా పనిచేస్తున్నట్లు కనిపించరు. అందుకే నాలుగైదు ఫైల్స్, రెండు మూడు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లతో చిందరవందరగా ఉంచండి.

6. నో ఫోన్ కాల్స్ : మీ బాస్ వింటున్నప్పుడు కాల్స్ వస్తే తర్వాత చేస్తాను ఫోన్ పెట్టేయమని చెప్పండి. దాంతో మీ స్నేహితులు, బయటి వాళ్లు కూడా ఆఫీసులో మనం ఎంతో బిజీగా ఉంటాం అనుకుంటారు.

5. చిరాగ్గా ఉండండి : చాలా పని చేసి అలసిపోయినట్లు నీరసంగా ఉండండి. పని ఒత్తిడితో చిరాకు పెరిగినట్లు ప్రవర్తించండి. మధ్య మధ్యలో తలపట్టుకుని ఆలోచిస్తుండండి. చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు బిల్డప్ అన్నమాట.

4. ఆఫీసు నుండి ఆలస్యంగా వెళ్లండి : ఆఫీసు సమయం అయిపోయిన చాలా సేపటి తర్వాత ఇంటికి వెళ్లండి.(బాస్ లేకుంటే పనిచేయకుండా ఖాళీగానే కూర్చోవచ్చు కదా) ముఖ్యంగా మీ బాస్ ఉన్నప్పుడు. మీరు ఇంట్లో చదవలేకపోతున్న బుక్స్ ఎంచక్కా ఈ టైమ్‌లో చదువుకోవచ్చు.

3. దేవుడ్ని తలచుకోండి : 'ఓ.. గాడ్' అని అప్పుడప్పుడు బిగ్గరగా అనండి. అప్పుడు అందరూ మీరు చాలా పని ఒత్తిడిలో ఉన్నారనుకుంటారు.
2. తరచూ సంప్రదించండి : ఊరికే మీ బాస్ గదిలోకి వెళ్లి మాట్లాడుతుండండి. మీకు తెలిసిన చిన్న చిన్న విషయాలు కూడా 'ఇది ఎలా చేస్తే బాగుంటుంది?' అని సలహా అడుగుతూ ఉండండి.
1. అన్నింటికంటే ముఖ్యమైంది : ఇవన్నీ ఓ పేపర్‌పై రాసుకుని ఎప్పుడూ పాటిస్తూ ఉండండి. కానీ ఓ ముఖ్య విషయం. పొరపాటున కూడా ఇది మీ బాస్ చేతికి దొరక్కుండా చూసుకోండి.

Thursday, September 9, 2010

ప్రపంచం మీ గుప్పిట్లో

గ్రీక్‌ తత్వవేత్త అరిస్టాటిల్‌ సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌ని బాగా వెలుగులోని తెచ్చిన వ్యక్తి. చాలా మంది గొప్పవారు కూడా వీటికి సంబంధించి ఎన్నో గొప్ప రచనలు కూడా చేశారు. వారిలో ప్రసిద్ధ సైకాలజిస్ట్‌‌స ఆల్‌ఫ్రెడ్‌ ఆడ్లర్‌, కార్ల్‌యంగ్‌ సైకాలజీకి, స్వయం అభివృద్ధికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. స్వయం అభివృద్ధికి పాటుపడే ముందు వాటికి కావలసిన విషయాలను కూలంకషంగా పరీక్షించుకోవల్సిన అవసరం ఎంతెైనా ఉంది అంటున్నారు.
worldస్వయం పరిజ్ఞానం.. అంటే మీరేమిటి అన్నది.. మీ ఫీలింగ్స్‌, ఆలోచనలు, దౌర్బల్యాలు, బలాలు, అన్నీ ఇందులోకి వస్తాయి. రూపురేఖల్ని ప్లాస్టిక్‌ సర్జరీ సహకారం లేకుండా ఎంత మాత్రం మార్చలేరుగానీ, ప్రవర్తనని మార్చుకోవడం ద్వారా పబ్లిక్‌ సోషల్‌ ఇమేజ్‌ని మార్చుకోగలరు. బాగా ఏమేమి చెయ్యగలరు? ఎన్ని స్కిల్స్‌ వచ్చు? పదిమందితో ఈజీగా మనగలిగితే మార్కెటింగ్‌, మంచి బుద్ధికుశలత వాక్చాతుర్యం ఉంటే లాయర్లు, ట్రైనర్స్‌, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ లాంటి ఫెైనార్ట్‌‌స బాగా వచ్చే వారెైతే ఒక డిజెైనర్‌ స్టోర్‌ బొటీక్‌ లేదా ట్రైనింగ్‌ సెంటర్‌ ఇలా ఆలోచిస్తూ పోతే మీ టాలెంట్‌కి తగ ్గప్రొఫెషన్‌ని ఎంచుకోగల్గుతారు. అలా మీరు ఏమేం చెయ్యగలరు? మీ సామర్థ్యం ఏ లెవల్లో ఉంది? అన్నవి తరచి చూసుకుంటే, ఈ పెైన ఇంేమేమి నేర్చుకోవాలో అర్థమవుతుంది. దానికి తగ్గ కోర్స్‌లు చేయవచ్చు. ట్రైనింగ్‌ తీసుకోవచ్చు.

workingచదువు వల్ల, అనుభవజ్ఞానం వల్ల వచ్చిన విజ్ఞానాన్ని సానపట్టేవి సాఫ్ట్‌ స్కిల్స్‌, తద్వారా మన పర్సనాలిటీని వెలికి తెచ్చి చూపించే ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌కి మరింత పదునుపెట్టి, జీవితంలో అంచెలంచెలుగా పెైకెడుతూ, దినదిన ప్రవర్థమానమవ్వడానికి చేసే ప్రయత్నాన్నే స్వయం అభివృద్ధి అంటారు. తద్వారా విద్యా, ధన సంపదలు అభివృద్ధి చెందడమేకాదు, మన ఆశయాలని, కలలని నిజం చేసుకోగల సమర్థత, చాకచక్యం వస్తాయి. ఆత్మవిశ్వాసం విజయాలకి దారి తీస్తుంది. అందువల్ల దాన్ని పొందించుకోవాల్సిన ఆవశ్యకత వుంది. సాఫ్ట్‌ స్కిల్స్‌ అన్నీ ఒకే దండలోని పూవుల్లా అమరి వుంటాయి. ఒకదానితో మరొకటి అనుసంధానం అయి వుంటాయి. కాబట్టి ఒకదాన్ని నేర్చుకోవాలంటే మరొకటి తప్పకుండా నేర్చుకోవాలి.

ఆత్మవిశ్వాసం..
ఆత్మ గౌరవం ఎంత అవసరమో, ఎలా వాటని పెంపొందించుకోవాలో తద్వారా ఎలా ఆత్మవిశ్వాసం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆత్మవిశ్వాసం వల్ల సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ చేసుకునే స్థైర్యం వస్తుంది. విజయాన్ని ఎదురుచూసేలా చేస్తుంది. చెయ్యలేనేమో, నష్టపోతానేమో లాంటి భయాల్ని దరిదాపుల్లోకి రానివ్వదు. పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుని వాటికి తగ్గ నిర్ణయాలు తీసుకునే ధెైర్యాన్ని ఇస్తుంది. ఓడిపోయినా, నష్టపోయినా భీరువుని చెయ్యదు. పడ్డా మళ్లీ లేచేందుకు చేయూతనిస్తుంది. ఓటమివల్ల వచ్చే బాధనీ దు:ఖాన్నీ వాటిల్లోంచి జనింగచే భయాన్నీ ఇమోషన్స్‌నీ తట్టుకునే శక్తినిస్తుంది.

సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌...

ఎవరికి వాళ్ల మనోవికాసానికి దోహదపడేలా తమని తాము పరీక్షించి చూసుకుని, బాధ్యత వహించడం. ఏం చేయాలంటే అనుక్షణం తమని తాము నిన్నటి కంటే ఈ రోజుకి ఎంత ఇంప్రూవ్‌ అయ్యాను కొత్తవి ఏం నేర్చుకున్నాను? వీటి వల్ల ఉద్యోగవకాశాలు ఎంత వరకు మెరుగు పరుచుకున్నాను? ఎంత అర్హత వచ్చింది? అని అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటి రోజుల్లో నల్గురితో ఏం మాట్లాడాలో తెలియక తికమకపడి టెన్షన్‌లో ఏదేదో వాగి ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టుకునే వాళ్లే కోకొల్లలు. ఈ కోవలోకొచ్చేవారికి సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌గా వాక్చాతుర్యం ఆచితూచి సందర్భోచితంగా మాట్లాడటం మొట్టమొదటి ఛాలెంజ్‌ అవుతుంది.

అన్నిటినీ అధిగమించాలంటే..
అభివృద్ధి చెందాంటే అది నూటికి నూరు శాతం ఎవరికి వారిదే బాధ్యత. దీని కోసం ఎవ్వరూ దీనికి ఏమీ చెయ్యలేరు. గడిచిపోయిన కాలం గురించి వగస్తూ కూర్చుంటే వున్న కాలం కూడా వృథా అయిపోతుంది.
సమస్యలు వస్తే చిరాకు పడటం, హడలి పోవడం రెండూ వద్దు. వాటిని సొల్యూషన్‌ వెతకడం ద్వారా సానబట్టిన వజ్రంలా మీరు తయారవ్వడం మొదలవుతుంది. కష్టాలకు ఎదురీదడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక్కొక్క భయాన్నీ, సందేహాన్నీ జయిస్తున్నప్పుడల్లా మీ భుజం మీరు తట్టుకుని ప్రోత్సహించుకోవాలి. స్ఫూర్తి, ఉత్సాహం రెట్టింపవుతాయి. ఏదెైనా చేయడం కష్టం అనిపించినప్పుడు చాలా మంది వదిలేస్తారు.

jumpఅది పలాయనవాదం పఠించేవారికి, లూజర్సకి, సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ మీద దృష్టి పెట్టిన వాళ్ళు చేసే పని కాదు. కొత్తగా ఏమి నేర్చుకున్నా కూడా దాన్ని గుర్తించి, గ్రహించి అర్థం చేసుకుని వ్యక్తీకరించుకుని, ఒక కొత్త ముఖ్యమూన పాఠ్యాంశంగా బురల్రో ముద్రవేసి, జ్ఞాపకంలో ఉంచుకుని, అవసరం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. పరిజ్ఞానంలో, బిహేవియర్‌లో మీ కన్నా ఒక మెట్టు పెైన ఉన్నవారితో సమయాన్ని వెచ్చించాలి. వారి నుండి తెలుసుకోవాల్సిన విషయాలను గుర్తించాలి. అవసరమైన వాటిని నేర్చుకోవాలి. మంచి సాహిత్యం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వ్యక్తిత్వానికి సానబెడుతుంది. అందులోనూ ఇంగ్లీష్‌లో చదివితే మరీ మంచిది. వీటివల్ల ఒకాబ్యులరీ పెరగడమే కాకుండా, ఇంగ్లీషు భాష బాగా ఇంప్రూవ్‌ అవుతుంది. బద్ధశత్రువులు అయిన వాళ్లు కూడా మిత్రులవుతారు. బాబోయ్‌ అనుకున్న కష్టాలు కూడా వెనక్కి వెళతాయి.. వీటన్నిటికీ ఆత్మవిశ్వాసం.. నమ్మకం.. ముఖ్యం.

Sunday, September 5, 2010

బిజినెస్‌ ‘ప్రభు’ ‘తులసీ సీడ్స్‌ అధినేత తులసీ రామచంద్ర ప్రభు ‘టర్నింగ్‌పాయింట్‌’

ఒకనాడు పదహారు రూపాయల పరీక్షఫీజు కట్టలేని యువకుడు నేడు 13 పరిశ్రమలను స్థాపించి, మూడు వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన కంపెనీల అధినేతగా ప్రసిద్ధికెక్కారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం అష్టకష్టాలు పడ్డ ఆ యువకుడు నేడు రెండువేల మందికి ఉద్యోగ ప్రదాతగా ఆవిర్భవించారు. ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకొని ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టేందుకు రెండేళ్ళపాటు కాళ్ళు అరిగేలా తిరిగిన నిరుద్యోగి ఇప్పుడు ఏకంగా 13 కంపెనీలకు అధినేతగా మారాడు. ఆ వ్యాపార దిగ్గజం పేరే తులసీ సీడ్స్‌ అధినేత తులసీ రామచంద్ర ప్రభు. చిన్న మధ్య తరహా పరిశ్రమల విభాగంలో ఇటీవలే ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డునందుకున్న ఆయన వ్యాపార ప్రస్థానం ఈ  ‘టర్నింగ్‌పాయింట్‌’


tualasi-rama1977 లో ‘కోస్టల్‌ ప్యాకేజింగ్స్‌’ పేరుతో అట్టపెట్టల కంపెనీని ప్రభు ప్రారంభించారు.అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార విస్తరణలో భాగంగా 1980లో చంద్రా ట్రాన్స్‌పోర్ట్‌, వంశీ ట్రేడ్‌లింక్స్‌ సంస్థలను స్థాపించారు. 1986లో అత్యాధునిక యంత్రాలలో చైతన్యా ప్యాకేజింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మరో ప్యాకేజింగ్‌ కంపెనీని స్థాపించారు. క్రమంగా తులసి సీడ్స్‌, తులసీ రామ్‌ చిట్స్‌, తులసీ ఫైలింగ్‌ సిస్టమ్స్‌, తులసీ డిజిటల్‌ స్టుడియోలను, హైదరాబాద్‌లో తులసీ టెక్నోసాఫ్ట్‌ కంపెనీని స్థాపించి ఎందరో మధ్యతరగతి యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కలుగచేశారు. తులసీ గ్రూపు సంస్థల్లో సుమారు వెయ్యి మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, నాలుగు వందల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు.తులసీ గ్రూపు సంస్థలలో పెద్దదైన కోస్టల్‌ ప్యాకేజింగ్స్‌, చైతన్యా ప్యాకేజింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తులసీ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు క్వాలిటీ మేనేజ్‌మెంటుకు ఐఎస్‌ఓ 9001 : 2000 ప్రామాణిక పత్రం లభించింది.

కుటుంబనేపథ్యం...
రామచంద్ర ప్రభు సతీమణి పేరు అరుణ. ఆమె ఇంటి విషయాలలోనే కాక గ్రూపు సంస్థల నిర్వహణా వ్యవహారాలలో కూడా ఆయనకు చేదోడువాదోడుగా అన్ని విధాల సహకరిస్తున్నారు. వీరికి యోగీష్‌ చంద్ర, కృష్ణచైతన్య అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు యోగీష్‌ చంద్ర తులసీ గ్రూపు సంస్థలకు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కాగా, రెండవ కుమారుడు కృష్ణచైతన్య అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తూ, హైదరాబాద్‌లో తులసీ గ్రూపు సంస్థలైన తులసీ టెక్నో సాఫ్ట్‌, ఇంటెక్‌ సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ కంపెనీలకు సాంకేతిక సలహాదారుగా ఉన్నారు.

తులసీ సీడ్స్‌ ప్రత్యేకతలు...
Tulasi-Family ప్రత్తి రైతుల ఆత్మహత్యలకు స్పందించి రైతు శ్రేయస్సే పరమావధిగా భావించి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించటానికే తులసీ ీీసీడ్స్‌ స్థాపించామని రామచంద్ర ప్రభు చెబుతుంటారు. భారతదేశంలోనే ఎంతో నాణ్యమైన బీటీ కాటన్‌ హైబ్రిడ్‌ విత్తనాలను దేశంలోని ప్రత్తి పండించే అన్ని రాష్ట్రాలకు అందజేసింది తులసీ సీడ్స్‌. విత్తనాల తయారీతో పాటు తులసీ ట్రస్ట్‌ ద్వారా సేంద్రీయ ఎరువులతో సేద్యాన్ని అభివృద్ధిపరిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. వర్మీ కంపోస్ట్‌ (వాన పాముల ద్వారా ఎరువు) తయారీ ఇందులో ఒక భాగం. హిందూ సంస్కృతిలో ముఖ్యమైన గోసంరక్షణ సిద్ధాంతానికి అనుకూలంగా ఆవుల పెంపకాన్ని ఆచరణలో పెట్టటం తులసీ గ్రూప్‌ ప్రత్యేకత.

చైతన్యా ప్యాకేజింగ్స్‌...
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజింగ్స్‌ సంస్థ చైతన్యా ప్యాకేజింగ్స్‌. తైవాన్‌ దేశం నుండి సుమారు పది కోట్ల విలువైన ఆటోమాటిక్‌ యంత్రాలను దిగుమతి చేసుకొని సాంకేతికపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన అగ్గిపెట్టెలు తయారుచేసి బంగ్లాదేశ్‌, దుబాయ్‌, ఫిలిఫె్ఫైన్స్‌, జింబాబ్వే దేశాలకు ఎగుమతి చేస్తోంది. గుంటూరు జిల్లాలో ఉన్న పొగాకు ఎగుమతి చేసే సంస్థలన్నీ చైతన్య ప్యాకేజింగ్స్‌ వారి సి-48 బ్రాండ్‌ ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ అట్టపెట్టెలను మాత్రమే వినియోగిస్తాయంటే అతిశయోక్తి కాదు.

ఉత్తమ సేవలకు అత్యుత్తమ గుర్తింపు...
tualasi-ramachandrఅత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో ప్రతిభ కలిగిన శాస్తవ్రేత్తల పర్యవేక్షణలో ెహబ్రీడ్‌ విత్తనాలు అందిస్తున్న తులసి సీడ్స్‌ పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం అవార్డు లభించింది. కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలమంత్రిత్వశాఖ వారు 2009 సంవత్సరానికి ఆర్‌ అండ్‌ డి విభాగానికి ప్రకటించిన అవార్డులలో మొదటిస్థానం తులసి సీడ్స్‌ కైవసం చేసుకుంది. ఈ అవార్డును ఆగస్ట్‌ 31వ తేదీన ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రామచంద్రప్రభు రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా అవార్డునందుకున్నారు.అంతేకాకుండా 1992 లో తులసి సీడ్స్‌ సంస్థను నెలకొల్పి 10 ఏళ్ళ స్వల్పవ్యవధిలోనే కేంద్ర చిన్నతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ నుండి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డును గెలుచుకున్నాడు.

అప్పటి రాష్టప్రతి అబ్దుల్‌ కలాం చేతులమీదుగా పురస్కారం అందుకోవడం విశేషం. అప్పట్లో బిటిపత్తి విత్తనాలు ఉత్పత్తి చేయడానికి జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ ఎస్సెస్‌మెంట్‌ కౌన్సిల్‌ (జిఇఎసి) అనుమతి తులసీ సీడ్స్‌ సంస్థకు లభించింది. శ్రీతులసి, నమస్కార్‌ అన్న రెండు బిటి తరహా విత్తనాలు మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమ్మకాలు జరిపారు.మార్కెట్‌లో కొత్త తరహా విత్తనాలను ప్రవేశపెట్టడం కోసం మోన్‌సాంటోనుంచి బిటి జీన్‌ టెక్నాలజీని స్వీకరించిన అనేక భారతీయ కంపెనీల్లో తులసీ సీడ్స్‌ ఒకటి. ఈ కంపెనీ రు.2 కోట్లు వెచ్చించి గుంటూరు సమీపాన అప్పట్లో బయోటెక్‌ కేంద్రాన్ని కూడా నెలకొల్పడం విశేషం.

ప్రభు ప్రస్థానం...
పేరు : తులసి రామచంద్ర ప్రభు
తల్లిదండ్రులు: వెంకాయమ్మ, పేరయ్య 
పుట్టిన తేది : జూన్‌ 21, 1947 
చదువు : బి.టెక్‌ (మెకానికల్‌ ఇంజరింగ్‌ - ఐఐటీ, మద్రాసు)
తొలి బిజినెస్‌: ‘కోస్టల్‌ ప్యాకేజింగ్స్‌ కంపెని
ప్రస్తుత హోదా: చైర్మన్‌, తులసి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌
భార్య : శ్రీమతి అరుణ,
పిల్లలు : యోగీష్‌ చంద్ర (తులసీ గ్రూప్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌),
          కృష్ణచైతన్య (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)


అవార్డులు :
  • 1994లో ‘బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌’ అవార్డు.
  • ఏపిఎస్‌ఎఫ్‌సి నుంచి ‘పారిశ్రామిక విజేత’ అవార్డు (2001),
    ‘బెస్ట్‌ క్వాలిటీ ప్రోడక్ట్‌‌స’
  • జాతీయ అవార్డు (2003)
  • బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు (2007)
  • కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల నుండి
    ఆర్‌ అండ్‌ డి విభాగంలో మొదటి స్థానం (2009)