Mud is also used in medical porpuse, the health benefits that users swear by are not scientifically proven, but you know what you feel. The mud treatment is said to help clear clogged pores. Toxins are removed from the body as well. Those who suffer from pain in their muscles and joints have found relief through mud baths
Showing posts with label Facebook. Show all posts
Showing posts with label Facebook. Show all posts
Monday, October 25, 2010
Dirty fun at mud festival
The Paleo is the largest Switzerland open-air music festival.Students and festival volunteers paid tribute to the 40th anniversary of the Woodstock music festival by spreading the fun of mud as it was done in 1969 in Upstate New York.According to the festival organization, the project is a “back to the earth” psychedelic inspiration and 100% recyclable





Labels:
Facebook,
Gouthamaraju,
mud,
World4You,
youth
Wednesday, September 29, 2010
శ్రమైక జీవన సౌందర్యమే ‘ఆనందం’
|
Labels:
Facebook,
Gouthamaraju,
World 4 you,
వరల్డ్ 4 యు
Tuesday, September 28, 2010
ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్ * ప్రైవేటు టీచర్.కామ్
మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్ పోర ్టల్ ఇది. దీన్ని డిజైన్ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి.
ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆకలిగా ఉంది. జేబులో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలి? చచ్చిపోవాలనిపిస్తోంది. ఛీ... నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? లేదు. పిరికివాడిలా చావకూడదు. ఎలాగైనా చదువుకోవాలి. ఏదైనా సాధించాలి'' అనుకున్నాడు.
నిజానికి వంశీకి అమ్మానాన్నా, ఇద్దరు అక్కలూ ఉన్నారు. అతనిది మహబూబ్‌నగర్ జిల్లాలోని బుద్ధారం ధర్మ తండా. చాలా పేద కుటుంబం. కుటుంబంలో అందరూ ఏదో ఒక పనిచేస్తేనే కడుపునిండేది. అలాంటి పరిస్థితుల్లో వంశీని చదివించడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. వంశీ అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో అక్కలతో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. రోజుకు పది రూపాయలు వచ్చేవి.
అలా కూడబెట్టుకున్న డబ్బులు, అక్కావాళ్లు ఇచ్చిన ఇంకొన్ని డబ్బులు మూటకట్టుకుని ఇంట్లోంచి పారిపోయాడు. వనపర్తిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోసాగాడు. వాళ్ల అమ్మనాన్న కూడా 'పోనీ చదువుకోనీలే' అని వదిలేశారు. సెలవుల్లో ఇంటికి వెళ్లి వస్తుండేవాడు కానీ ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలా రెండు మూడేళ్లు గడిచింది.
పేపర్ బాయ్‌గా..
ఏడో తరగతి చదువుతున్నప్పుడు సాయంత్రం పూట వంశీ ఒక ఎస్టీడీ బూత్‌లో పనిచేసేవాడు. నెలకు వంద రూపాయలు వచ్చేవి. అవి కూడా సరిపోయేవి కావు. 'ఇంకా ఏదైౖనా పని ఉంటే చెప్పండి' అని ఎస్టీడీ యజమానిని అడిగితే 'పేపర్ బాయ్‌గా చేస్తావా? 150 రూపాయలిస్తాను' అన్నాడు.
వంశీ పేపర్ వేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ పని చేయాలంటే సైకిల్ ఉండాలి. ఆ యజమాని సైకిల్ తానే ఇస్తానన్నాడు కానీ దానికి అద్దె నెలకు 75 రూపాయలు. అలా ఉదయం, సాయంత్రం కష్టపడితే వచ్చే 175 రూపాయలతో వంశీ చదువుకునేవాడు.
ఆలోచన పుట్టిందిలా..
ఇంటర్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'మళ్లీ బడి' కార్యక్రమంలో చేరాడు. పాటలు పాడుతూ, పాఠాలు చెబుతూ గ్రామాల్లో తిరిగేవాడు. ఆ సందర్భంలోనే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. తర్వాత వనపర్తిలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండేవాడు.
ప్రయివేటు ట్యూషన్లు చెబుతూ ఎంఏ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు వనపర్తిలోని బ్రిలియంట్ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు, సహోద్యోగులు ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టిన ఆలోచనే ఎడ్యునెస్ట్.
ఎడ్యునెస్ట్ గురించి...
ఈ రోజుల్లో ఒక వెబ్‌సైట్ రూపొందించడం పెద్ద కష్టం ఏం కాదు. చాలా తక్కువ ఖర్చులో కూడా తయారుచేయొచ్చు. కానీ వంశీ తయారు చేసుకున్న కాన్సెప్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం చాలా జిబి స్పేస్ కావాలి. ఒకరు మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారనుకుందాం.
వేరే స్కూల్లో అదే పోస్ట్, ఎక్కువ జీతంతో ఖాళీ ఉందనుకుందాం. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే అవి వెంటనే ఆ టీచర్‌కు ఎస్ఎమ్ఎస్ రూపంలో వెళ్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారాన్ని కేవలం ఇ-మెయిల్స్ ద్వారానే అందిస్తున్నాయి మిగతా వెబ్‌సైట్లు. అందరూ ప్రతిరోజూ ఇంటర్‌నెట్ చూసే అవకాశం ఉండదు కాబట్టే ఈ ఎస్ఎమ్ఎస్ పద్ధతిని ఎంచుకున్నానంటాడు వంశీ.
ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు అతనికి 50 వేల రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని తనకు నెల నెల వచ్చే జీతం నుంచి వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు వంశీ. అధికారికంగా వెబ్‌సైట్‌ని ప్రారంభించేందుకు గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
జూ బీరెడ్డి నగేష్ రెడ్డి
Thursday, September 9, 2010
ప్రపంచం మీ గుప్పిట్లో
గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ సెల్ఫ్ డెవలప్‌మెంట్‌ని బాగా వెలుగులోని తెచ్చిన వ్యక్తి. చాలా మంది గొప్పవారు కూడా వీటికి సంబంధించి ఎన్నో గొప్ప రచనలు కూడా చేశారు. వారిలో ప్రసిద్ధ సైకాలజిస్ట్‌స ఆల్‌ఫ్రెడ్ ఆడ్లర్, కార్ల్‌యంగ్ సైకాలజీకి, స్వయం అభివృద్ధికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. స్వయం అభివృద్ధికి పాటుపడే ముందు వాటికి కావలసిన విషయాలను కూలంకషంగా పరీక్షించుకోవల్సిన అవసరం ఎంతెైనా ఉంది అంటున్నారు.
ఆత్మవిశ్వాసం..
ఆత్మ గౌరవం ఎంత అవసరమో, ఎలా వాటని పెంపొందించుకోవాలో తద్వారా ఎలా ఆత్మవిశ్వాసం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆత్మవిశ్వాసం వల్ల సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకునే స్థైర్యం వస్తుంది. విజయాన్ని ఎదురుచూసేలా చేస్తుంది. చెయ్యలేనేమో, నష్టపోతానేమో లాంటి భయాల్ని దరిదాపుల్లోకి రానివ్వదు. పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుని వాటికి తగ్గ నిర్ణయాలు తీసుకునే ధెైర్యాన్ని ఇస్తుంది. ఓడిపోయినా, నష్టపోయినా భీరువుని చెయ్యదు. పడ్డా మళ్లీ లేచేందుకు చేయూతనిస్తుంది. ఓటమివల్ల వచ్చే బాధనీ దు:ఖాన్నీ వాటిల్లోంచి జనింగచే భయాన్నీ ఇమోషన్స్‌నీ తట్టుకునే శక్తినిస్తుంది.
సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్...
ఎవరికి వాళ్ల మనోవికాసానికి దోహదపడేలా తమని తాము పరీక్షించి చూసుకుని, బాధ్యత వహించడం. ఏం చేయాలంటే అనుక్షణం తమని తాము నిన్నటి కంటే ఈ రోజుకి ఎంత ఇంప్రూవ్ అయ్యాను కొత్తవి ఏం నేర్చుకున్నాను? వీటి వల్ల ఉద్యోగవకాశాలు ఎంత వరకు మెరుగు పరుచుకున్నాను? ఎంత అర్హత వచ్చింది? అని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటి రోజుల్లో నల్గురితో ఏం మాట్లాడాలో తెలియక తికమకపడి టెన్షన్‌లో ఏదేదో వాగి ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టుకునే వాళ్లే కోకొల్లలు. ఈ కోవలోకొచ్చేవారికి సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌గా వాక్చాతుర్యం ఆచితూచి సందర్భోచితంగా మాట్లాడటం మొట్టమొదటి ఛాలెంజ్ అవుతుంది.
అన్నిటినీ అధిగమించాలంటే..
అభివృద్ధి చెందాంటే అది నూటికి నూరు శాతం ఎవరికి వారిదే బాధ్యత. దీని కోసం ఎవ్వరూ దీనికి ఏమీ చెయ్యలేరు. గడిచిపోయిన కాలం గురించి వగస్తూ కూర్చుంటే వున్న కాలం కూడా వృథా అయిపోతుంది.
సమస్యలు వస్తే చిరాకు పడటం, హడలి పోవడం రెండూ వద్దు. వాటిని సొల్యూషన్ వెతకడం ద్వారా సానబట్టిన వజ్రంలా మీరు తయారవ్వడం మొదలవుతుంది. కష్టాలకు ఎదురీదడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక్కొక్క భయాన్నీ, సందేహాన్నీ జయిస్తున్నప్పుడల్లా మీ భుజం మీరు తట్టుకుని ప్రోత్సహించుకోవాలి. స్ఫూర్తి, ఉత్సాహం రెట్టింపవుతాయి. ఏదెైనా చేయడం కష్టం అనిపించినప్పుడు చాలా మంది వదిలేస్తారు.
Labels:
Facebook,
Gouthamaraju,
Turning Point,
World 4 you,
వరల్డ్ 4 యు
Sunday, September 5, 2010
Facebook * ఫేస్‌బుక్
చౌరస్తాలో నిలబడ్డట్టే
చెయ్యని నేరానికి జైలు కెళ్లిన ఓ యువకుణ్ణి నిర్దోషిగా నిరూపించింది.
ఒంట్లో బాగోలేదని సాకులు చెప్పి పని ఎగ్గొట్టిన ఒక ఉద్యోగి గుట్టు బయటపెట్టింది.
డిప్రెషన్‌లో ఉన్నానంటూ హెల్త్ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసుకుని ఆ సమయమంతా పార్టీల్లో ఎంజాయ్ చేసిన ఒకామెకి ఆ డబ్బు రాకుండా చేసింది.
లాగ్ అవుట్ చెయ్యని పాపానికి ఒకాయన చేసిన దొంగతనాలన్నీ బయటపెట్టింది.
మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరిచినందుకు మరొకరి ఉద్యోగమే పోగొట్టింది.
ఈ 'మంచి చెడు'లన్నీ చేస్తున్నది ఏ నిఘా సంస్థో కాదు. వికీలీక్స్ అంతకన్నా కాదు. అదో ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్క్. ఇంటర్నెట్ వాడే వాళ్లందరికీ చిరపరిచితమైన ఫేస్‌బుక్.
ఆన్‌లైన్లో అమ్మ దొరికింది
ఈ సంవత్సరం జనవరి 10న ఫేస్‌బుక్‌లో చేరి తన తల్లికోసం వెతుకుతున్నట్లు చెప్పుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఈ వార్త లక్షల మందికి చేరింది. వారిలో కొందరు 'అమ్మ'ను వెతకడానికి పూనుకున్నారు. ఆ నోటా ఈ నోటా పాకి అది చివరకు వాళ్లమ్మను చేరింది. దీనంతటికీ పట్టింది 24 గంటలే. అంటే కొన్నేళ్లుగా తాను వెతుకుతున్న అమ్మని ఆమె ఫేస్‌బుక్‌లో 24 గంటల్లోనే వెతుక్కోగలిగింది. అంతేకాదు జనవరి 15 కల్లా తన తండ్రిని కూడా కలుసుకోగలిగింది.
ఇన్నేళ్లుగా తనకీ ఆలోచన ఎందుకు రాలేదు అనుకుని ఆశ్చర్యపోతోంది లారీ. ఇంటర్నెట్‌లేని రోజుల్లో దత్తత తీసుకోబడిన చాలామందికి వారి అసలు తల్లిదండ్రులెవరో తెలుసుకోవడం కొంచెం..కాదు కాదు చాలా కష్టం. అయితే లారీ తన తల్లిదండ్రుల్ని కనుగొనడంతో ఇప్పుడు చాలామంది ఇదే బాట పడుతున్నారు. అయితే వాళ్లని దత్తత తీసుకున్న పేరెంట్స్‌కి ఇది పెద్ద సమస్య అవుతోంది. వాళ్లు అసలు తల్లిదండ్రులకే దగ్గరైపోతారేమోనని దత్తత తీసుకున్న వాళ్లు ఆందోళన చెందుతుంటే, తమ పిల్లల్ని ఆన్‌లైన్లో చూసి వారి గురించి తెలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపం చెందుతున్నారు అసలు తల్లిదండ్రులు.
రెండేళ్లు వెనక్కి వెళితే- లారీయే 19 ఏళ్ల క్రితం దత్తత ఇచ్చిన తన కొడుకుని 'మై స్పేస్' అనే మరో సోషల్ నెట్‌వర్క్ ద్వారా కలుసుకోగలిగింది. ఇప్పుడు లారీ తన కొడుకు, అమ్మ, నాన్న... అందరినీ కలవగలిగింది. ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడూ కలుసుకుంటారు. ఫేస్‌బుక్ ఉంది కాబట్టి ఎవరెక్కడుంటున్నారో తెలుసుకోవడం సులభమవుతోంది అంటున్నారు.
మెసేజ్ సేవ్ చేసింది...
చివరికి ఫేస్‌బుక్‌తో అది సాధ్యమైంది. ఆ దొంగతనం జరిగినప్పుడు రోడ్నీ మాన్‌హాటన్‌లోని తన తండ్రి అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ఆయన కంప్యూటర్ నుండి రోడ్నీ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌ను రోడ్నీ తండ్రి కోర్టుకు సమర్పించాడు. జడ్జి కూడా ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ ఏ టైమ్‌కి వెళ్లిందో, ఏ 'ఐపి' అడ్రస్ నుంచి వెళ్లిందో పరిశీలించి రోడ్నీ తండ్రి ఐపి అడ్రస్ నుంచే వెళ్లిందని నిర్ధారించుకున్నాడు. ఒకే వ్యక్తి రెండు చోట్లా ఎలా ఉంటాడు అని అడిగి కేసు కొట్టి వేశాడు. మొత్తం మీద రోడ్నీని ఫేస్‌బుక్ అలా రక్షించింది. ఇంటర్నెట్‌లో మనం మెసేజ్‌లు పంపించినా, చాటింగ్ చేసినా, మెయిల్ చేసినా ఆ సమయం రికార్డు అవుతుంది. దాన్ని ట్యాంపర్ చెయ్యడం ఎవరి వల్లా కాదు. అందుకే ఇప్పుడది 'అథెంటిక్ ప్రూఫ్' అని న్యూయార్క్ పోలీసులు అంటున్నారు.
వైట్‌హౌస్ 'సెక్యూరిటీ'ని
బయట పెట్టింది...
అయినా దానిలోకి ఆహ్వానం లేకుండా చొరబడాలనుకున్నారు. అనుకోవడమే కాదు, అంత పని చేసి చూపించారు కూడా. అమెరికా అధ్యక్ష భవనం సెక్యూరిటీని కూడా దాటుకుని ఎలాగైతేనేం లోపలికెళ్లారు. బరక్ ఒబామాతోటి, ఇతర ప్రముఖులతోటి కరచాలనాలు, పలకరింపులు లాంటివి జరిగాయి. అందరు నాయకులతోటి ఫోటోలు కూడా దిగారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలన్నీ మిచెల్లె ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. వైట్‌హౌస్ సెక్యూరిటీ ఎంతబాగా పనిచేస్తోందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోవడమే కాకుండా మిచెల్లె, తరిక్ సలాహీలు సెలబ్రిటీలయిపోయారు. ఫేస్‌బుక్‌లో వాళ్లకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే వాళ్లు ఆ రియాలిటీ షోలో పాల్గొనడానికి ఎంపికయ్యారు.
అంత ఆసక్తి పనికి రాదు...
గ్రూప్ తెచ్చిన కష్టాలు....
అయితే అరెస్టుకి కారణం క్లెకాక్ ఆ గ్రూప్‌ని మొదలుపెట్టడం కాదని, ఆ గ్రూప్‌లో ఉంచిన ప్రధాని ఫోటో గురించి అని చెప్పారు. నాజీ యూనిఫార్మ్‌లో ఆయన ఫోటో పెట్టాడు. కాబట్టి ప్రధానిని ఆ డ్రస్‌లో చూపడం నేరమని అన్నారు. చివరికి తేలిందేమిటంటే ఆ గ్రూప్‌లో చేరిన వాళ్లలో ఎవరో ఆ ఫోటోని పెట్టారని, క్లెకాక్‌కి దానితో ఏ సంబంధం లేదని. అయితే అప్పటికే ఆ యువకుడు జైలుకెళ్లాల్సి వచ్చింది.
ఆఫీస్‌కి డుమ్మా కొడితే....
అనారోగ్యం సాకుతో శెలవు తీసుకున్నాడని గ్రహించి జీతంలో కోత విధించారు. అయితే ఫేస్‌బుక్‌లో తాను అలా రాసినందువల్లే జీతంలో కోత పడిందని డాయిల్‌కి తెలీదు. అకారణంగా తన జీతంలో కోత విధించారని, తాను అనారోగ్యం వల్లనే ఆఫీస్‌కి రాలేదని బుకాయించాడు. అప్పుడు తాను ఫేస్‌బుక్‌లో రాసిన దాన్ని తీసి ఆయనకే మెయిల్ చేశారు. జీతంలో కోత పడినా డాయిల్‌కు మాత్రం కొందరు ఫాన్స్ దొరికారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఫేస్‌బుక్ గ్రూపులు కూడా మొదలు పెట్టారు.
లాగవుట్ చెయ్యకపోతే
అంతే మరి...
ఫేస్‌బుక్‌కి ఎంతగా బానిస అయిపోయినా దొంగతనానికి వెళ్లినపుడు ఆ పనేదో చూసుకోవాలి కాని కంప్యూటర్ కనపడిందని ఫేస్‌బుక్‌లోకి ఎంటరైపోకూడదు. రోమ్‌లో జొనాథన్ పార్కర్ అనే దొంగ ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కంప్యూటర్ కనిపించడంతో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అయితే దొంగతనం చేయాలనే హడావిడిలో లాగ్అవుట్ చెయ్యడం మర్చిపోయి వెళ్లిపోయాడు. తర్వాత సీన్‌లోకి ఎంటరైన పోలీసులు ఆ ఫేస్‌బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఆయనే దొంగ అని నిర్థారించుకుని దాంట్లో ఉన్న వివరాల ద్వారా ఎలాగైతేనేం ఆయన్ని పట్టుకున్నారు.
పార్టీలకెళ్తే...హెల్త్ ఇన్సూరెన్స్
ఎలా వస్తుంది?
'మా మంచి అమ్మ'గా ఉంటే అంతే
అన్నీ అనుకున్నట్టు జరగవుగా. ఇలాంటి సంఘటనల వలనో లేదా రోజూ గంటల కొద్దీ ఫేస్‌బుక్‌లో గడపడం వల్ల బోర్ కొట్టిందో ఏమో ఇప్పుడు దాని నుంచి బయటపడాలనుకునే వారు కూడా ఎక్కువవుతున్నారు. అందుకే గూగుల్‌లో '"how to delete Facebook account'' అనే సెర్చ్‌లు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఈ జనరేషన్ అంతే. ఏ నెట్‌వర్క్‌లోనైనా చేరడం, అంతలోనే అది నచ్చక బయటికొచ్చేయడం అన్నీ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి.
ఫేస్‌బుక్ జనాభా ఎంత?
యాభై కోట్లు దాటిందని ఆ మధ్య పత్రికల్లో కూడా వచ్చింది. అవును... దాన్నే గనక ఒక దేశం అనుకుంటే జనాభా పరంగా అది ప్రపంచంలోనే మూడో పెద్ద దేశమవుతుంది. ప్రపంచంలోని ప్రతి నలుగురు నెటిజన్లలో ఒకరు ఫేస్‌బుక్ యూజర్. నిజానికి దానిది స్కూల్లో చేరే వయస్సే... అంటే జస్ట్ సిక్స్ ఇయర్స్. అవును పుట్టిన ఆరేళ్లకే ఈ సోషల్ నెట్‌వర్క్ అంతగా ఎదిగి ఇంటర్నెట్ సూపర్‌పవర్స్‌లో ఒకటిగా మారింది. హార్వర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ మార్క్ జూకర్‌బర్గ్ రూపొందించిన ఈ నెట్‌వర్క్ ఇప్పుడు ప్రపంచంలోనే మరే నెట్‌వర్క్‌కి లేనంతమంది యూజర్లని సంపాదించుకుంది. దీన్ని రూపొందించినపుడు జూకర్‌బర్గ్ వయసు 21 ఏళ్లు.
మైక్రోసాఫ్ట్ మనకి కంప్యూటర్లని చేరువ చేయడమే గాక వాటిని ఉపయోగించడం సులభతరం చేసింది. కావల్సిన సమాచారాన్ని గూగుల్ ఒక సెర్చ్‌తో మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేలా చేసింది. యూట్యూబ్ మనల్ని వీడియోలతో ఎంటర్టెయిన్ చేస్తూనే ఉన్నది. అయితే ఫేస్‌బుక్ అలాకాదు. మనల్ని కంప్యూటర్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. మన భావాల్ని వ్యక్తపరచడానికి, కొత్త స్నేహాల్ని ఏర్పరచుకోవడానికి, పాత స్నేహితుల్ని వెదుక్కోవడానికి అదో అవకాశంగా మారింది. అందుకే ఎప్పుడో స్కూల్లో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహాల గురించి ఆరా తీయాలన్నా ఇప్పుడు జనమంతా మరోమారు ఆలోచించకుండా ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేస్తున్నారు.
13 ఏళ్లు దాటితే చాలు
ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి, తొంగి చూసే అలవాటు ఎంతో కొంత అందరిలోనూ సహజంగా ఉండేవే కాబట్టి అలాంటి వారందరూ ఫేస్‌బుక్‌లో ఎదుటివాళ్ల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. ఫేస్‌బుక్ జనాభా పెరుగుతున్నట్టే దాంట్లో తమ సొంత విషయాల్ని పేర్కొనడం కూడా ఎక్కువైంది. ఇంతకు ముందు వ్యక్తిగతం అనుకున్న చాలా విషయాలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరి ఫేస్‌బుక్ ఎకౌంటూ ఒక్కో ఓపెన్ డైరీ. ఉద్యోగులు తమ బాస్‌ల గురించి, విద్యార్థులు లెక్చరర్ల గురించి కామెంట్లు రాయడానికి ఫేస్‌బుక్‌నే ఎంచుకొంటున్నారు.
ఈ మెయిల్‌లా కాకుండా ఫేస్‌బుక్‌లో రాసిన వాటిని ఎవరైనా చూడొచ్చు. సగటున ఒక్కొక్కరూ కనీసం గంట సేపు ఫేస్‌బుక్ వాడుతున్నారు. రోజుకి కోట్లలో మెసేజ్‌లు రాస్తున్నారు. వారానికి పదికోట్ల కొత్త ఫొటోలొచ్చి ఫేస్‌బుక్‌లో చేరుతున్నాయి. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు దగ్గర్నుంచి వీకెండ్ పార్టీల దాకా ఏ చిన్న విశేషమైనా దాని ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం, వాటి సంగతుల్ని వివరించడం ఇప్పుడు నెటిజన్లకి ఫేవరైట్ పాస్‌టైం. అయితే ఒక్కోసారి ఆ ఫోటోలు, మనం రాసే రాతలే మనల్ని ఇరకాటంలో పెట్టొచ్చు. ఒక్కోసారి మనల్ని రక్షించనూ వచ్చు. అందుకే ప్రైవసీ గురించి కొత్త చర్చని లేవనెత్తింది ఫేస్‌బుక్. దాచుకోవడం నుంచి ప్రదర్శించడం వైపు ఆ చర్చ మళ్లింది.
Labels:
Facebook,
Gouthamaraju,
World 4 you,
వరల్డ్ 4 యు
Subscribe to:
Posts (Atom)