శోభాయమానంగా...
అనంతరం ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్
టన్‌లు ఒకరి వేలుకు మరొకరు వెడ్డింగ్ రింగ్ తొడగడంతో వారి వివాహం సంప్రదాయబద్దంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ వేడుక జరిగింది. వేయి సంవత్సరాల పురాతన భవనం వెస్ట్ మినిస్టర్ అబ్బే ఈ వివాహంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. స్కాంట్లాం డ్‌లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో డేటింగ్ చేసిన కేట్, విలియమ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక విలియమ్ తల్లి డయానాకు డిజైనర్‌గా వ్యవహరించిన దివంగత కేథరిన్ వాల్క ర్ ఒకప్పుడు డిజైన్ చేసిన సై్క బ్లూ ఊల్ కోట్‌లో వధువు కేట్ మిడిల్‌టన్ తల్లి కెరోల్ ఈ వేడుకకు హాజరు కావడం విశేషం.
గుర్రపు బగ్గీలో ఊరేగింపు...
మూడు దశాబ్దాల క్రితం...
1981, జూలై 29నలో ప్రిన్స్ విలియమ్ తల్లిదండ్రులు ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ చార్లెస్‌ల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో వ్యయంతో జరిగిన ఈ వివాహానికి ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అంతకంటే వైభవంగా ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్‌టన్‌ల వివాహాన్ని నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు చార్లెస్, డయానాలు పెళ్ల యిన 15 సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు. 1997లో ప్యా రిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డయానా తీవ్ర గా యాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. తల్లిలేని లోటు ప్రిన్స్ విలియమ్‌ను ఎంతో బాధించింది.
తిలకించిన రెండు బిలియన్ల ప్రజలు...
ప్రపంచంలోని దాపు మూడవ వంతు జనా భా ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్‌టన్‌ల వివా హాన్ని తిలకించడం విశేషం. దాదాపు రెండు బిలియన్ల ప్రజలు ఈ వివాహ వేడుకను చూ సి మురిసిపోయారు. టివి ఛానెల్స్‌తో పాటు ఇంటర్నెట్‌లో సైతం ఈ వేడుకను చూశారు.
జీవితాంతం కలిసి ఉండాలి...
రహస్యంగా కేట్ డ్రెస్ డిజైనింగ్...
ప్రజల కోసం స్ట్రీట్ పార్టీలు...
ప్రిన్స్ విలియమ్ వివాహం బ్రిటన్‌వాసులను ఆనందోత్సాహాల్లో ముంచె త్తింది. ప్రిన్స్ వివాహం సందర్భంగా బ్రిటన్‌లోని లండన్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ప్రజల కోసం వందలాది స్ట్రీట్ పార్టీలను నిర్వహించారు. తమ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఒక భాగంగా ఈ వివాహ వేడుకలను వారు జరు పుకున్నారు. విలియమ్ వివాహాన్ని పురస్కరిం చుకొని బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ప్రజలందరూ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. లండన్‌తో పాటు పలు పబ్‌లు ఉదయం నుంచే తెరుచు కున్నాయి. విలియమ్ వివాహ వేడుకను పుర స్కరించుకొని వీటిలో బీర్‌తో పాటు ఇంగీ్‌లష్ బ్రేక్‌ఫాస్ట్‌ను వేడి,వేడిగా సర్వ్‌చేశారు. వీటిలో బీన్స్, టోస్ట్, ఫ్రైడ్ ఎగ్స్, బెకాన్, సాసేజెస్ వంటి రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి.
బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు...
పెళ్లికోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్...
పార్టీలతో 140 టన్నుల చెత్త...
రాయల్ వెడ్డింగ్ మూలంగా 140 టన్నుల చెత్త పేరుకుపోయింది. ప్రిన్స్ విలియమ్ వివాహానంతరం నిర్వహించిన పార్టీలలో పెద్ద ఎత్తున వ్యర్థపదార్థాలు మిగిలాయి. ఈ చెత్తను తొలగించేందుకు ప్రత్యేకంగా 130 సానిటరీ పని వాళ్ల ను 45వేల పౌండ్ల వేతనంతో ఏర్పాటుచేశారు. వివాహ పార్టీలలో దాదాపు అయిదు లక్షల మంది దేశ, విదేశాలకు చెందిన ప్రజలు పాల్గొనడం విశేషం.
హాజరైన ప్రముఖులు...
వెడ్డింగ్ కేక్...
వేయి సంవత్సరాల వెస్ట్‌మినిస్టర్‌లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేకి వేయి సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. పదవ శాత బ్దం మధ్య కాలంలో మొదట దీన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఇందులో వివా హ వేడుకలను నిర్వహిస్తున్నారు. 1066 నుంచి ఈ చర్చి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు, ప్రఖ్యాతులను సంపాదించింది. ప్రస్తుతం ఉన్న చర్చి నిర్మాణాన్ని హెన్రీ-3 రాజు 1245లో ప్రారం భించా రు. చర్చిలోని అరుదైన పెయింటింగ్స్, గ్లాస్ కళాఖండాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
- ఎస్.అనిల్ కుమార్
అనగనగా ఒక రాణి !
ప్రేమకు మారుపేరు... ప్రిన్సెస్ ఆఫ్ డయానా... గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె అందం.. ఫ్యాషన్.. హుందాతనం.. కలబోత డయానా.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. వివాహ బంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో 36 ఏళ్ల వయసుతో ప్రమాదంలో మృతిచెందింది. శుక్రవారం ఆమె కుమారుడు ప్రిన్స్ విలియవ్గ్సు, ప్రియురాలు ేకట్‌ల వివాహం.. జరిగింది. ఓ సాధారణ మధ్య తరగతి యువతి... దేశానికి కాబోయే రాజు... సహజంగానే అందరి దృష్టీ ేకట్ వైపే.. అందాల రాణి ప్రిన్సెస్ డయానాతో పోలికలే..
సహజసిద్ధంగా....
ఓ సాధారణ మధ్యతరగతి యువతి ేథరిన్ మిడిల్ టన్.. ముద్దుగా కేట్ మిడిల్ టన్ అని కూడా పిలుస్తారు. కేట్ ఎంతో సాధారణంగా కనిపిస్తారు. ఆమె కంటి చూపులు ఎంతో తీక్షణంగా వుంటాయి. అందంలో డయానాతో సరిపోల్చేం దుకు ఏ ఒక్కరు ఇష్టపడనప్పటికీ ఫ్యాషన్‌ను ఫాలో అవ్వడంలో కేట్ కూడా డయానాతో పోల్చదగినది. ఇప్పటికే కేట్ బ్రిటన్‌లో ఎంతో పేరు పొందింది. ఎక్కడికి వెళ్లినా ఆమెను గుర్తు పట్టే స్థాయికి చేరుకుంది.
ధైర్యమే ఆభరణం...
డయానా మొదటి నుండి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించేవారు. ఆమె భర్త నుండి విడిపోయి ప్రిన్సెస్‌గా ఆమెకున్న పేరును తన నుండి తొలగించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆమె ఏ మాత్రం బాధ పడలేదు. ‘నేను ప్రజల మనసుల్లో మహారాణిగా వుండాలనుకున్నాను. అది ఎప్పుడో జరిగిపోయింది’ అని ఆమె ఎంతో హుందాగా ప్రకటించింది.
వయసు.. పరిణతి....
20 ఏళ్ల వయసులో డయానా స్పెన్సర్ పెళ్లి కూతురిగా మారి రాజరికపు కట్టుబాట్లలో బంగారు పంజరంలోకి చేరింది. అతి కొద్ది కాలంలోనే వివాహ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన భర్త మరో స్త్రీతో సంబంధం కలిగి వున్నాడని ప్రకటించి ఆవేదన చెందింది. ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. వివాహ బంధం నుండి విడాకులు తీసుకుని రాజకోట నుండి బయటిి వచ్చింది.
కేట్ ఎంతో పరిణతి కలిగిన వ్యక్తిగా హుందాగా ప్రవర్తించడంలో మెలకువలను పాటిస్తోంది. కేట్, విలియమ్‌ల కన్నా ఒక సంవత్సరం పెద్దది. పైగా విలియంతో పదేళ్ల పరిచయం.. కానీ ఎక్కడా కేట్ వివాదాస్సదం కాలేదు. అన్ని సందర్భాల్లోనూ నిలకడగా కనిపించింది. సుదీర్ఘ కాలం అనంతరం పెళ్లికి ముందుగానే బ్రిటన్ యువరాణిగా ఆమెకు గుర్తింపు లభించింది.
అడుగుజాడలు...
సేవా మార్గంలో...
డయానా సేవా మార్గంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అనేక దేశాల్లో ఆమె పర్యటించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కేట్ ఇప్పటికీ వరకు సేవా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన లేదు. ఆమె తన విద్య, ప్రిన్స్ విలియంతో ప్రేమ విషయాల్లోనే ఎక్కువగా ఫోకస్ అయ్యారు.
ఎవరికి వారే...
ఎంతో ప్రత్యేకం...
మిడిల్ టన్, విలియం తల్లి డయానాలను ప్రతి సందర్భంలోనూ పోల్చి చూసే వారే ఎక్కువ. డయానా పెళ్లి సమయంలో వేసుకున్న దుస్తులను, కేట్ డ్రెస్‌ను పోల్చి చూస్తే ఎంతో పరిణతి కనిపిస్తోంది అని డయానా డిజైనర్ డేవిడ్ ఇమ్మానుయేల్ చెబుతున్నారు. ‘1981లో డయానా చార్లెస్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు 20. అప్పటికి ఫ్యాషన్ పై ఆమెకు అంతగా అవగాహన కలిగే అవకాశం లేదు. ఆమె వయసుకు తగిన విధంగా అప్పటి ఫ్యాష న్ ప్రకారం ఆమె డ్రెస్ రూపొందించాం. కానీ కేట్ ఎంతో పరిణతి చెందిన యువతి. ఆమెకు ఫ్యాషన్ మీద అవగాహన వుంది. డయానా కన్నా పెళ్లి నాటికి వయసులోనూ పెద్దదే. కాబట్టి కేట్ తనకు ఏది సరిపోతుందో దాన్ని ఎంపిక చేసుకుంది.’ అని అంటున్నాడు.
కొత్త పేరుతో కుస్తీ..
ప్రిన్స్ విలియం కూడా కేట్‌తో వివాహ అనంతరం మొదటి సారి డాన్స్ చేసేందుకు కఠిన మైన సాధననే చేశాడు. ఇందుకు శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. ‘విలియం దృష్టంతా ఇప్పుడు డాన్స్ మీద వుంది. పెళ్లికూతురుతో కలిసి డాన్స్ చేయడం కోసం అతను ఎంతగానో సాధన చేశాడు’ అని సన్నిహితులు అంటున్నారు. దీనికి తోడు విలియంను రాయల్ ఎయిర్ ఫోర్స్‌లోని ఆయనతోపాటు పనిచేసేవారు దీనిపై ఆటపట ి్టస్తున్నారు కూడా.
కేట్ బ్లౌజ్ సందడి ..!
పెళ్లికి ముందు ఒంటరి..!
అందగత్తెల సరసన..
ఇందులో మరో విషయాన్ని ప్రస్తావిస్తూ... కేట్ మిడిల్‌టన్ మిగిలిన వారిలా గొప్ప అందం కాకపోయినా ఆమె స్టైల్, నడవడిక ఇవన్నీ కూడా ఆమెను ప్రిన్సెస్ గ్రేస్, క్వీన్ రాని యాల సరసన నిలిపాయి అని విశేషకులు అంటున్నారు. అలాగే ‘బ్రిటీష్ రాజరికంలో వచ్చే భవిష్యత్తు తరాలలో మార్పుకు కేట్‌ను సూచకంగా భావించొచ్చు అని కూడా వారు అభిప్రా యపడుతున్నారు.
ఉంగరానికి సవరింపులు...!
ఇప్పుడు దాని విలువ చాలా పెరిగి వుంటుంది. ఈ ఉంగరానికి సంబంధించి విలియం ఒక సారి మాట్లా డుతూ ‘ఈ గొప్ప సందర్భంలో అమ్మ కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో కేట్‌కు బహూకరించాను’ అని తెలిపారు.
కేట్ డిజైనర్ అలెగ్జాండర్ ..!
పెళ్లి వార్త బయటికి వచ్చి నప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికలు, ఫ్యాషన్ ప్రియు లు కేట్ వెడ్డింగ్ డ్రెస్ పైనే దృష్టి సారిం చారు. దీనిపై ఎంతో మంది పేర్లు కూడా వెలికివచ్చాయి కానీ అసలు వ్యక్తిని మాత్రం తెలుసుకోలేకపోయారు. గత కొంత కాలంగా కేట్ వస్తధ్రార ణపైనే ఫ్యాషన్ ప్రియులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఫాలో అవుతున్న ట్రెండ్‌ను ఇప్పుడు ఎక్కువగా బ్రిటన్ యువతులు అనుసరిచేం దుకు ఇష్టపడటమే దీనికి కారణమట.