గుర్రంపై ఊరేగుతూ యువరాజులా తిరగానే ఉబలాటం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఉంటుంది. కుర్రకారుకైతే ఈ ఆసక్తి మరీ ఎక్కువనే చెప్పాలి. వారు ఎప్పుడు ఎలాంటి వాటిపై ఆస క్తి కనబరుస్తారో తెలుసుకోవడం చాలా కష్టం. యూత్‌లో ప్రస్తుతం హార్స్ రైడింగ్ ఓ హాట్ టాపిక్. తాము గుర్రపుస్వారీని హాబీగా చేసుకోవాలని వారు తహతహలాడుతున్నారు.
ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది...
‘నాకు చిన్నప్పటినుంచి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. అందులో ఉండే థ్రిల్లే నన్ను వాటివైపు ఆకర్షితుడిని చేసింది. ఆ ఇష్టం నాతోపాటే పెరిగి నా కు హాబీగా మారింది. నాకు బైకర్స్ క్లబ్‌లో మెంబర్ షిప్‌కూడా ఉంది. ప్రస్తుతం నేను హార్స్‌రైడింగ్ నేర్చు కోవాలనుకుంటున్నాను. నాతో పాటు నా స్నేహితు లందరూ కూడా శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్. ఇందుకోసం పేరు పొందిన శిక్షకుల వద్ద ట్రైనింగ్ కోసం చేరాము’ అని రాజీవ్ తెలిపాడు.
ఖాళీగా ఉండాలి...
గుర్రపు స్వారీ చేసే కనీసం అరగంట ముందు వర కు కడుపు ఖాళీగా ఉండాలి. కడుపు నిండా తిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వారీ చేయకూడదు. గుర్రపు స్వారీ అంటేనే శరీరం కుదుపులకు గురౌతుంది. నిండు కడుపుతో స్వారీ చేస్తే వాంతులు, ఆయాసం రావడం ఖాయం. గుర్రపు స్వారీ చేసే సమయంలో పెద్దగా అరవడం, కేకలేయడం సరి కాదు. ఇలా చే స్తే గుర్రం గాబారా పడి మన అదుపు తప్పి పోతుం ది. గుర్రంపై స్వారీ చేసే వారికేగాక పక్కన నిలబడి చూసే వారికి కూడా ఇది వర్తిస్తుంది.
విశ్రాంతినివ్వాలి...
గుర్రపు స్వారీకి ఉదయం, సాయంత్రం సమయా లు అనుకూలంగా ఉంటాయి. ఎండ దెబ్బ తగలకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు గుర్రం దౌడు తీసే సమయంలో త్వరగా అలసిపోకుండా ఉంటుంది. చల్లటి త్రాగే నీటిని వెంట తీసుకెళ్లడం మరిచిపోకండి. దూర ప్రదేశాలకు గుర్రం పై వెళ్లే అలవాటు ఉన్న వారికి ఇది ఎంతో మేలుచేస్తుంది. సన్‌స్క్రీన్ లోషన్లు, గాగుల్స్‌ను వాడడం మంచిది. సుదూర ప్రాంతా ల్లో గుర్రం పైన వెళ్లే వారు ఏకధాటిగా గుర్రాన్ని దౌడు తీయించకుం డా మధ్య మధ్యలో దానికి విశ్రాంతినివ్వాలి. గుర్రం మీకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనదనే విషయాన్ని విస్మరించకండి. దాన్ని లొంగదీసుకోవడానికి రెచ్చగొట్టడం, కళ్లాన్ని అదేపనిగా లాగడం చేయకూడదు. కళ్లాన్ని రెండు చేతులతో పట్టుకొని, కాళ్లను ఫుట్‌రెస్ట్‌లో జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాతే రైడింగ్‌కు బయలుదేరాలి.
సరదాగా ఉంటుంది...
‘ఎంతో ఆసక్తిగా గుర్రపు స్వారీనేర్చుకున్నాను. గుర్రపు స్వారీ నేర్చుకోవడమంటే అంత సులువు కాదు. పట్టుదలతో కష్టపడి గుర్రపుస్వారీలో శిక్షణ పొందాను. కొండలు, గుట్టల్లో గుర్రాన్ని దౌడు తీయిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. సరదాగా సాగే ఈ ప్రయాణంలో అలసట అనిపించదు. కానీ గుర్రాన్ని అదుపులో ఉంచుకొని ప్రయాణం చేయాలి. లేదంటే అదుపు తప్పిన గుర్రం కింద పడేస్తే ప్రమాదమే’ అని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రకాష్ తెలిపారు.
గాల్లో తేలినట్టుగా...
‘గుర్రపు స్వారీ ఎంతో హాయిగా అనిపిస్తుంది. గుర్రాన్ని వేగంగా దౌ డు తీయిస్తుంటే గాలిలో తేలినట్టుంటుంది. గుర్రపు స్వారీ చేసే వారు తమ బరువు తక్కువగా ఉండే టట్టు చూసుకోవాలి. తక్కువ బరువు ఉన్న వారే వేగం గా గుర్రాన్ని పరిగెత్తించగలరు. ఇక కొన్ని గుర్రాలైతే ఎవరిని పడితే వారిని ఎక్కించుకోవు. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని శ్రేయా తెలిపారు.మొత్తం మీద ఆధునిక యువతకు పురాతన సవారీ మీద మోజు కలగడం విచిత్రమే!
ఒక్కరే సురక్షితం...
గుర్రపు స్వారీ నేర్చుకునేటప్పుడు, స్వారీ చేసేటప్పుడు కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు అనుభవజ్ఞులైన శిక్ష కులు. ‘స్వారీ చేయడానికి గుర్రాన్ని సమీపించే సమయంలో వెనక వైపు నుండి వెళ్లకండి. గుర్రానికి ముందు లేదా ఎడమవైపు నుండి వెళ్తే గుర్రం అనవసరంగా గాబరా పడకుండా ఉంటుంది. గుర్రంపై ఒక్కరు స్వారీ చేస్తేనే సురక్షితం. అప్పుడప్పుడూ పెద్దవారు చిన్నపిల్లల్ని గుర్రంపై కూర్చోబెట్టుకుని స్వారీ చేస్తుంటారు. ఇది ప్రమాదకరం. చిన్న పిల్లలు గుర్రపు స్వారీ చేసేప్పుడు ఓ ట్రైనర్‌ను వెంట పెట్టి ప్రతిక్షణం పరిశీలిస్తూ ఉండాలి. గుర్రపు పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు అప్పగించకండి. వాటిని ట్రైనర్ లేదంటే మీ వద్దే ఉం చుకుంటే గుర్రాన్ని అదుపులో ఉంచడానికి వీలవుతుంది’ అని టోలిచౌకీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్స్ రైడింగ్‌లో గుర్రపు స్వారీ శిక్షకుడు మహ్మద్ అజీజ్ తెలిపారు.
అంతసులభం కాదు...
‘గుర్రపుస్వారీ అంటే అంత తేలికైన విషయం కాదు. ఇంజన్‌తో నడిచే వాహనాలను నడిపినంత సులభంకాదు. ఈ విషయాన్ని హార్స్‌రైడింగ్ నేర్చుకునేవారు తప్పకుండా గుర్తించుకోవాలి. అంతే కాకుండా మనం వేసుకునే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. గుర్రపు స్వారీ చేసే టప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవద్దు. చర్మానికి హత్తుకుని ఉండేలా పొడవాటి దుస్తుల్ని వేసుకోవాలి. లింగ బేధం లేకుండా ప్రతిఒక్కరూ పాంట్స్ వేసుకుంటే ఉత్తమం.
అవీ తేలిక రంగులో ఉండాలి. మరికొందరు గుర్రానికి నూలు బట్టలు, ఇతర దుస్తుల్ని చుడుతుంటారు. ఇవి పరిగెత్తే సమయంలో కాళ్లలోకి వచ్చి చిక్కుకోవడంతో పడిపోవడం ఖాయం. కనీసం ఒకటి నుండి రెండు అంగుళాల ఎత్తున్న షూను వేసుకోండి. స్వారీ చేసే సమయంలో గడ్డి, ముళ్లు వంటివి కాళ్లకు తగలకుండా ఇవి కాపాడుతాయి. ఇంకా ఫుట్‌రెస్ట్‌లో చక్కగా ఇమిడిపోతుంది. అన్నికంటే ముఖ్యమైనది ముఖానికి, ప్రమాదవశాత్తూ కింద పడ్డా తలకు గాయాలవకుండా ఇది కాపాడుతుంది. హెల్మెట్‌కు బెల్ట్ ఉంటే మరీ మంచిది’ అని గండిపేట్ వద్ద గల ఇనిస్టిట్యూట్ ఫర్ హార్స్ రైడింగ్ లోని గుర్ర పుస్వారీ శికుడు నగేష్ వివరించారు.
- ఎస్.అనిల్ కుమార్
No comments:
Post a Comment